Lagadapati Sridhar
-
టీనేజ్ వారికి మా సినిమా బాగా అర్థం అవుతుంది: లగడపాటి శ్రీధర్
విక్రమ్ సహిదేవ్ (నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు) హీరోగా నటించిన తాజా చిత్రం ‘వర్జిన్ స్టోరీ’. సౌమికా పాండియన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ప్రదీప్ బి. అట్లూరి దర్శకుడు. లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా థ్యాంక్స్‌మీట్‌లో లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ – ‘‘వర్జిన్ స్టోరీ’ చిత్రంతో ఓ కొత్త ప్రయత్నం చేశాం. అవకాశం ఉన్నా కూడా ఎక్కడా అసభ్యకర సన్నివేశాలను చూపించలేదు. టీనేజ్‌లో ఉన్నవారికి మా సినిమా మరింత బాగా అర్థం అవుతుంది’’ అన్నారు. ‘‘యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది’’ అన్నారు ప్రదీప్. ఈ కార్యక్రమంలో సౌమిక తదితరులు పాల్గొన్నారు. -
సినిమాలు తెలుగోడి దమ్ము చూపిస్తున్నాయి
‘‘రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెస్ రాజు, ‘దిల్’ రాజుగార్లు, మైత్రీ మూవీ మేకర్స్.. ఇలా వీరందరూ బాలీవుడ్, హాలీవుడ్ వారు సైతం తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా తెలుగు సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్లారు. ఈ మధ్య మన సినిమాలు తెలుగోడి దమ్ము ఏంటో చూపిస్తున్నాయి’’ అన్నారు లగడపాటి శ్రీధర్. విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషికా ఖన్నా, వినీత్ భవిశెట్టి, స్నేహల్ కమల్, అభిజిత్ దేశ్ పాండే, జయశ్రీ రాచకొండ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కొత్తగా రెక్కలొచ్చెనా’. ఈ సినిమా ద్వారా నిర్మాత–నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య పెద్దబ్బాయి ప్రదీప్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లగడపాటి శిరీష, లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ యూనిట్‌కి లగడపాటి శ్రీధర్ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఇదే వేదికపై ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ లోగోను ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత నవీన్ యర్నేని విడుదల చేయగా, ఫస్ట్ లుక్‌ను హీరోహీరోయిన్ వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి రిలీజ్ చేశారు. నవీన్ మాట్లాడుతూ– ‘‘ఉప్పెన’ కలెక్షన్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయి. మాకు ఇంత విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘కొత్తగా రెక్కలొచ్చెనా’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు బుచ్చిబాబు, వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి. ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్: గోపీచంద్ లగడపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాఘవేంద్ర అన్న. -
ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది
‘‘సాధారణంగా స్టార్స్ ఉన్న సినిమాలైతే ముందు వాటి గురించి మాట్లాడుకున్న తర్వాత సినిమాకి వెళతారు. కానీ, ‘ఎవడు తక్కువ కాదు’లో స్టార్స్ లేరు. కథే స్టార్. ముందు మాట్లాడుకుని తర్వాత చూసే సినిమా కాదిది. సినిమా చూశాక దాని గురించి మాట్లాడుకునేలా ఉంటుంది’’ అన్నారు లగడపాటి శ్రీధర్. ‘రేసుగుర్రం, పటాస్, రుద్రమదేవి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ సహిదేవ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. తమిళ ‘గోలీ సోడా’ సినిమాకి ఇది రీమేక్. రఘు జయ దర్శకత్వంలో లగడపాటి శిరీషా సమర్పణలో లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. లగడపాటి శ్రీధర్ చెప్పిన విశేషాలు. ► టీనేజ్ లవ్‌స్టోరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తమిళంలో రూ. 2 కోట్లతో తీసిన ‘గోలీ సోడా’ సినిమా రూ. 20కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఇంకా ఎక్కువ బడ్జెట్‌తో, మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో రిచ్‌గా తీశాం. ► ‘గోలీ సోడా’ చిత్రానికి హీరోయిన్ సమంత పెద్ద అభిమాని. కథ అంత బాగుంటుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ కథలో మార్పులు చేశాం. టీనేజర్స్ నేపథ్యంలో తెలుగులో ఈ మధ్య మంచి సినిమా రాలేదు. ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది. ► యూత్‌లో ఎవడూ తక్కువ కాదు. వారికి ఎన్నో కలలు ఉంటాయి. వాటిని ఎలా సాధించొచ్చు? సాధించిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? అని మా సినిమాలో చెప్పాం. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ► వేసవికి కావాల్సిన మాస్ యూత్‌ఫుల్ ఫిల్మ్. ఓవర్సీస్లో రిలీజ్‌కి ప్లాన్ చేయలేదు. ఇక్కడ స్పందనను బట్టి రిలీజ్ చేద్దామనుకుంటున్నాం. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాకి విక్రమ్‌కి ఎంత పేరొచ్చిందో ఈ సినిమాతో అంతకుమించి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించా.. చాలా సంతోషంగా అన్ని ఏరియాల వాళ్లు కొనుక్కోవడం బిగ్గెస్ట్ సక్సెస్. -
దమ్మున్న కుర్రోడి కథ
‘‘పోయిన చోటే వెతుక్కోవాలి’ అని తెలుగులో ఒక నానుడి. ఓ కుర్రాడు మార్కెట్లో పడిన చోటే పైకి లేచి నిలబడాలని ప్రయత్నించాడు. వయసులో చిన్నోడు అయినా ధైర్యంగా మార్కెట్లో పెద్దలతో తలపడ్డాడు. అప్పుడు ఆ పెద్దలు ఏం చేశారు? ఈ యుద్ధంలో చివరికి ఏమైంది? అనేది ఈ నెల 24న తెరపై చూసి తెలుసుకోవాలి’’ అని దర్శకుడు రఘు జయ అంటున్నారు. విక్రమ్ సహిదేవ్, ప్రియాంకా జైన్ జంటగా రఘు జయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అన్నది ఉపశీర్షిక. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించారు. ఈ నెల 24న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘పగ, ప్రతీకారం నేపథ్యంలో సరికొత్త కథ, కథనంతో రూపొందిన చిత్రమిది. ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. రఘు జయ చాలా సహజంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రచార చిత్రాలకు, పాటలకు ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. ట్రైలర్లో విక్రమ్ సహిదేవ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ బావుందని అందరూ ప్రశంసించడం సంతోషంగా ఉంది. ట్రైలర్ విడుదల చేసిన సుకుమార్‌గారు కూడా మెచ్చుకున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర. -
మే 24న ‘ఎవడు తక్కువ కాదు’
బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అనేది ట్యాగ్ లైన్. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి రఘు జయ దర్శకుడు. ప్రియాంక జైన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు హరి గౌర సంగీతమందించారు. ‘పోయిన చోటే వెతుక్కోవాలి’ ‘పడిన చోటే పైకి లేచి నిలబడాలని’ పెద్దలు చెబుతారు. ఒక మార్కెట్లో కుర్రాడు పడిన చోటే పైకి లేచి నిలబడాలని ప్రయత్నించాడు. వయసులో చిన్నోడు అయినా ధైర్యంగా మార్కెట్లో పెద్దలతో తలపడ్డాడు. అప్పుడు ఆ పెద్దలు ఏం చేశారు? ఆ కుర్రాడు, అతడికి ఉన్న వ్యక్తులు ఎలా ఎదుర్కొన్నారు? ఈ యుద్ధంలో చివరికి ఏమైంది? అనేది ‘ఎవడు తక్కువ కాదు’ కథ. ఇప్పటికే సెన్సార్‌కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 24న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ‘ప్రచార చిత్రాలకు, పాటలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. పగ, ప్రతీకారం నేపథ్యంలో సరికొత్త కథ, కథనంతో రూపొందిన చిత్రమిది. అలాగే, ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. దర్శకుడు రఘు జయ చాలా సహజంగా చిత్రాన్ని తెరకెక్కించాడు. రియలిస్టిక్, రా అప్రోచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ట్రైలర్లో విక్రమ్ సహిదేవ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ బావుందని, అగ్రెస్సివ్‌గా చేశాడని అంతాప్రశంసిస్తున్నారు. ట్రైలర్ విడుదల చేసిన సుకుమార్ గారు కూడా మెచ్చుకున్నారు. సినిమా చూసి ప్రేక్షకులు మా విక్రమ్ ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది’ అని అన్నారు. -
తాడో పేడో తేల్చేసెయ్
విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో రఘు జయ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఏ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అనేది ఉపశీర్షిక. ‘రేసుగుర్రం, పటాస్, రుద్రమదేవి, నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ సినిమాల్లో బాలనటుడిగా ప్రశంసలు అందుకున్నాడు విక్రమ్. ఇక, తను ప్రధాన పాత్ర చేస్తున్న ‘ఎవడు తక్కువ కాదు’ చిత్రంలోని తొలి పాట ‘లైఫ్ ఈజ్ ఏ క్యాసినో... తాడో పేడో తేల్చేసెయ్... నీ ఆటేదో ఆడేసెయ్’ అనే పాటను సోమవారం విడుదల చేశారు. ‘‘రిలీజ్ చేసిన పాటకు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. యాక్షన్‌తో పాటు అందమైన టీనేజ్ ప్రేమకథతో రూపొందిన చిత్రం ఇది. మా సంస్థలో మంచి చిత్రం అవుతుంది. విక్రమ్‌కు నటుడిగా మంచి పేరు వస్తుంది. త్వరలో మిగతా పాటలను, ఈ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. -
ప్రేమ..ప్రతీకారం
లగడపాటి విక్రమ్ సహిదేవ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అనేది ఉపశీర్షిక. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య –నా ఇల్లు ఇండియా’ సినిమాలో అన్వర్ పాత్రలో సహిదేవ్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘ఎవడు తక్కువ కాదు’ చిత్రానికి రఘు జయ దర్శకత్వం వహించారు. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించారు. టైటిల్‌ను అనౌన్స్ చేసి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అనే ట్యాగ్‌లైన్ హీరో క్యారెక్టర్‌కు బాగా సూట్ అవుతుంది. కథకు తగ్గట్లు వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. సహిదేవ్‌కు మంచి పేరు వస్తుంది. సినిమాలో యాక్షన్‌తోపాటు అందమైన టీనేజ్ లవ్‌స్టోరీ ఉంటుంది. న్యూ ఏజ్ రివేంజ్ డ్రామా కూడా. ఫస్ట్‌లుక్, టైటిల్‌కు రెస్పాన్స్ వస్తోంది. మా సంస్థలో ఓ మంచి సినిమాగా నిలిచిపోతుంది’’ అని అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. -
విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో అల్లు అర్జున్ పవర్‌ప్యాక్డ్ ఫర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. బన్నీతో పాటు అదే సినిమాలో నటుడిగా మెరిసిన మరో యువకుడు విక్రమ్ సహిదేవ్. అన్వర్ పాత్రలో విక్రమ్ సహిదేవ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతకు ముందు ‘రేసుగుర్రం’లో అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రలో మెప్పించాడు. ఇప్పుడీ కుర్రాడు ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘ఎవడు తక్కువ కాదు’. విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అన్నది ఉపశీర్షిక. రఘు జయ దర్శకుడు. హోలీ సందర్భంగా సినిమా టైటిల్ ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్... అనేది ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ సహిదేవ్ క్యారెక్టర్ కు ఫర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. న్యూ ఏజ్ రివెంజ్ డ్రామా ఇది. బాల నటుడిగా ఆకట్టుకున్న మా విక్రమ్ సహిదేవ్, కథకు తగ్గట్టు వైవిద్యమైన పాత్రలో కనిపిస్తాడు. యాక్షన్‌తో పాటు అందమైన టీనేజ్ ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. హోలీ సందర్బంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసాం. మా సంస్థలో ఇది ఓ మంచి సినిమాగా నిలవటంతో పాటు, విక్రమ్ మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకంగా ఉన్నాం’ అన్నారు. -
‘స్వయంవద’ ఫస్ట్ లుక్ లాంచ్
ఆదిత్య అల్లూరి, అనికా రావు జంటగా లక్ష్మీ చలన చిత్ర పతాకంపై వివేక్ వర్మ దర్శకత్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తోన్న సినిమా స్వయంవద. ఈ సినిమాను ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘స్వయంవద సినిమా టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో సినిమా కూడా అంతే పవర్ ఫుల్ గా వుంటుందనుకుంటున్నాను. ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను.ఆల్ ది బేస్ట్ స్వయంవద చిత్ర యూనిట్’ అన్నారు. చిత్ర దర్శకుడు వివేక్ వర్మ మాట్లాడుతూ.. ‘స్వయం వద’ సినిమా ఫస్ట్ లుక్ ను మాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ గారు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. స్వయంవద అనేది సంస్కృత పదం. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. తన గురించి తానే సర్వస్వం అనే ఓ పాత్ర గురించి సినిమాలో చెప్పబోతున్నా. ఇందులో హీరోయిన్ అనికా రావు మొత్తం 6 గెటప్స్ లో కనిపిస్తుంది. హీరో ఆదిత్య అల్లూరి కొత్తవాడైనా చక్కగా నటించాడు. అందరికీ నచ్చే విధంగా కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ గా తెరకెక్కించాం. టెక్నికల్ గాను సినిమా హైలైట్ గా ఉంటుంది’ అన్నారు. నిర్మాత రాజా దూర్వాసుల మాట్లాడుతూ.... సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.టీజర్ ను ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తాము.సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్ తో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
2018 బన్నీ ఇయర్... నో డౌట్
‘‘అల్లు అర్జున్ ఒక ప్యాన్ ఇండియా స్టార్. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడానికి బన్నీ చాలా ట్రై చేస్తుంటాడు. సినిమా సినిమాకి తన హార్డ్ వర్క్ పెంచుతూ పైకెదిగే హీరో ఆమిర్ ఖాన్. ఆయన తర్వాత అలా చేసేది అల్లు అర్జునే అని నా నమ్మకం’’ అని నిర్మాత లగడపాటి శ్రీధర్ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో నాగబాబు సమర్పణలో శిరీషా శ్రీధర్ నిర్మిస్తోన్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్‌కి మంచి స్పందన రావడంతో నిర్మాత శ్రీధర్ విలేకరులతో మాట్లాడారు. ► ‘రేసుగుర్రం, టెంపర్, కిక్’ వంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లకు కథ అందించిన తర్వాత వంశీ స్వీయ కథతో దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. ఆ మూడు సినిమాల్లోని పవర్ ఈ ఒక్క సినిమాలో ఉంటుంది. ► ఈ చిత్రంలో కేవలం దేశభక్తి మాత్రమే కాదు. రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, సొసైటీ అనే అంశాలు కూడా ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. తెలుగు సినిమా కీర్తిని ‘బాహుబలి’ ఎంతవరకు తీసుకెళ్లిందో మా చిత్రం కూడా అలానే తీసుకెళుతుంది. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది. 2018 బన్నీ ఇయర్ అన్నది నా నమ్మకం. అందులో నాకే మాత్రం సందేహం లేదు. ► బన్నీ అంటే ప్రేక్షకులకి ఎంత ప్రేమో విన్నాను. మా ఫస్ట్ ఇంపాక్ట్‌కు వచ్చిన స్పందనతో అది ఎలా ఉంటుందో చూశా. 29 గంటల్లో కోటి మందికి పైగా ఇంపాక్ట్‌ను వీక్షించారు. వారికి కృతజ్ఞతలు. ► ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్. మిగతా భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేద్దామనుకున్నాం. బన్నీ త్వరలో తమిళంలో పరిచయం కానున్నారు. ఆ ఎంట్రీ డైరెక్ట్ తమిళ్ సినిమాతోనే ఉంటే బాగుంటుందని ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ని డబ్ చేయలేదు. ► షూటింగ్ 70 శాతం అయింది. మరో 40 రోజుల్లో పూర్తవుతుంది. మార్చికల్లా ఫస్ట్ కాపీ చేతికొస్తుంది. వేసవికి కచ్చితంగా వస్తున్నాం. ఏప్రిల్ 27న తప్పకుండా సినిమా రిలీజ్ చేస్తాం. -
హీరోగా లగడపాటి వారసుడు
పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లగడపాటి శ్రీధర్ తనయుడు, విక్రమ్ సహిదేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే రేసుగుర్రం, రుద్రమదేవి, పటాస్ లాంటి సినిమాల్లో బాలనటుడిగా అలరించిన విక్రమ్ కన్నడ సినిమాతో లీడ్ యాక్టర్‌గా మారుతున్నాడు. నలుగురు యువకుల జీవితాల్లోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 19న రిలీజ్ కానుంది. తమిళంలో ఘనవిజయం సాధించిన గోలీసోడా సినిమాను అదే పేరుతో కన్నడలో రీమేక్ చేశారు. ఈ సినిమాతో లగడపాటి శ్రీదర్ తనయుడు విక్రమ్ సహిదేవ్తో పాటు కన్నడ నటులు సాధు కోకిల, అరుణ్ సాగర్ల తనయులు కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారు. కన్నడలో రిలీజ్ తరువాత తెలుగులోనూ ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు లగడపాటి శ్రీధర్. -
సూర్య సినిమాకు తప్పు చేశా!
ఆయన సిల్వర్‌స్పూన్‌తో పుట్టారు. సిల్వర్‌స్క్రీన్ గురించి కలగన్నారు. పదేళ్ళ క్రితం నిర్మాతయ్యారు. లగడపాటి శ్రీధర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఏం సంపాదించినా అన్నీ సినిమాల వల్లే కాబట్టి, చుట్టూ ఉన్నవాళ్ళను ‘సినిమాల’తోనే సంతోషపెట్టాలనుకొన్నారు. శుక్రవారం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’తో రానున్నారు. ఈ సందర్భంగా ఇవాళ్టి బర్త్‌డే బాయ్ శ్రీధర్‌తో కాసేపు... * వరుసగా కన్నడం నుంచి రీమేక్ చేస్తున్నారేం? బడ్జెట్ పరిమితులున్న చోట, తప్పనిసరై క్రియేటివిటీ వెల్లివిరుస్తుంది. కన్నడంలో అదే జరుగుతోంది. నన్నడిగితే, మన చిన్న సినిమాలకు కన్నడ చిత్రాలే నమూనా లాంటివి. వాటిని గనక తెలుగుకు తగ్గట్లు రీ-ప్యాకేజ్ చేసుకొని, ఇంప్రూవ్ చేసుకుంటే, మంచి చిన్న సినిమాలు వస్తాయి. అందుకే, ‘పోటు గాడు’, తాజాగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’ లాంటివి చేయగలిగా. * కానీ, చిన్న సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారంటారా? ప్రొడక్షన్ వ్యాల్యూస్, పబ్లిసిటీతో సహా 5 కోట్లలో సినిమా తీస్తే కానీ, ప్రేక్షకుల్ని ఆకర్షించే చిన్న సినిమా రాదు. అలాంటి ప్రయత్నమే ప్రేమ ఇతివృత్తంగా తీసుకొని తీస్తున్న ‘కృష్ణమ్మ...’ ప్రేమకు ఒక గైడ్‌లా ఉంటుంది. స్కూలు మొదలు కెరీర్ దాకా పన్నెండేళ్ళ ప్రేమ ప్రయాణాన్ని చూపెట్టాం. * డిజిటల్ ఏజ్‌లో స్వచ్ఛమైన ప్రేమను కోరేవారు, చూసేవారు ఉంటారా? ఇందులో టైమ్‌పాస్ లవ్, టైమ్‌లెస్ లవ్ - రెండూ చూపించాం. జీవితంలో చాంపియన్ కావాలంటే, సిన్సియర్ ప్రేమే అవసరమని చెప్పాం. * బయట ఎమోషనల్‌గా ఉండే మీరు, ప్రేమ కథలు తీయడం...? (మధ్యలోనే అందుకుంటూ...) కుటుంబ విలువల మీద నాకు ఆసక్తి ఎక్కువ. సిన్సియర్ ప్రేమను చూపిస్తూ, కన్నడంలో చంద్రు తీసిన ‘ప్రేమ్ కహానీ’, ‘తాజ్‌మహల్’, ‘చార్మినార్’ మూడూ వసూళ్ళ వర్షం కురిపించాయి. ‘తాజ్‌మహల్’ను ‘పోటుగాడు’గా తీశా. ఇప్పుడు ఇది చేశా. * డెరైక్షన్, కెమేరా, సంగీతం- వీటికి కన్నడ టీమ్‌నే వాడారేం? చాలా రీమేక్స్‌లో ఒరిజినల్లో ఉన్న ఫ్లేవర్ మిస్సయిందని అనుకుంటూ ఉంటాం. అందుకే, ‘చార్మినార్’ దర్శకుడు (చంద్రు), కెమేరామన్ (కె.ఎస్. చంద్రశేఖర్), సంగీత దర్శకుడు (హరి) ముగ్గురినీ తీసుకున్నా. * మీ జోక్యం ఎక్కువనేనా స్టార్స్‌తో సినిమా తీయలేదు? స్టార్స్ కోసం సినిమాలు తీయలేను. సినిమాను ప్రేమిస్తా. చేస్తున్న పని ప్రతి సెకనూ ఆస్వాదిస్తా. టీమ్ సక్సెసే నా సక్సెస్ అనీ, ప్రేక్షకుల వినోదానికి బాధ్యుడిగా నిలవాలనీ భావిస్తా. అవన్నీ తెలిసినవాళ్ళే నాతో చేయడానికి ముందుకొస్తారు. కాంబినేషన్స్‌తో డబ్బులు పెట్టి కూర్చోవడం ఇష్టం లేదు. అందుకే, నాకెప్పుడూ నిద్ర లేని రాత్రుల్లేవు. * మరి, సూర్య ‘సికిందర్’ను డబ్ చేసిన విషయం...? (మధ్యలోనే...) వేరేవాళ్ళ మాట నమ్మి, చూడకుండానే రిలీజ్ చేసేశా. అది నేను చేసిన తప్పు. అలా మళ్ళీ చేయను. * నిర్మాతగా ఈ పదేళ్ళలో ఆర్థికంగా పోగొట్టుకున్నదే ఎక్కువేమో? నో రిగ్రెట్స్! కాకపోతే, ఛాన్సిచ్చి చూద్దామని ‘అండర్ డాగ్స్’ మీద తరచూ పందెం కాశాను. పాఠాలు నేర్చుకున్నా. ఇప్పుడిక దీన్ని బిజినెస్‌గానే చేయాలనుకుంటున్నా. ఇకపై మంచి రేసుగుర్రాలపైనే పందెం కాస్తా. * మీ అబ్బాయి కూడా సినిమాల్లోకి వచ్చి, నటిస్తున్నట్లున్నాడు! మా అబ్బాయి విక్రమ్ (9వ తరగతి)కి నటుడు కావాలని ఆశ. దర్శకుడు సురేందర్‌రెడ్డి ‘రేసుగుర్రం’లో పరిచయం చేశారు. ‘కృష్ణమ్మ...’లో చిన్నప్పటి ఎపిసోడ్లో వాడు నటించాడు. అందరూ రకరకాల స్టార్స్ అని పేరు పెట్టుకుంటుంటే, వాడు ‘గ్లోబల్ స్టార్’ అని పెట్టుకున్నాడు (నవ్వు). * మీ రాబోయే సినిమాలు? తమిళ సూపర్‌హిట్ ‘గోలీసోడా’ హక్కులు కొన్నా. అన్నీ కుదిరితే, ఆ రీమేక్ చేయాల్సిందిగా ‘అతనొక్కడే’ కథా చర్చల రోజుల నుంచి మాకు సన్నిహితుడైన దర్శకుడు సురేందర్‌రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నా. చూద్దాం. * ఏమిటీ అన్నీ రీమేక్‌లేనా? అవి సేఫ్ అనా? సొంత కథలు చేయరా? మూడు నాలుగు మించి కొత్త కథలెవరూ చెప్పలేరు. మొదట నేనూ కొత్త ఐడియాలతో వచ్చా. ఇప్పుడు రీమేక్‌లు చేస్తున్నా. అది సొంత కథా, రీమేకా అని కాదు - జనానికి కావాల్సినవి, నచ్చేవి ఇవ్వాలనుకుంటున్నా. * మీ డ్రీమ్ ‘స్టైల్ -2’ ఏమైంది? స్క్రిప్ట్ సిద్ధం. అద్భుతంగా నాట్యం చేసే అమ్మాయి చుట్టూ తిరిగే కథ. అలాంటి నటి కోసం చూస్తున్నా. వేటూరి గారు చివరి రోజుల్లో బెడ్ మీద ఉంటూనే, ‘స్టైల్ -2’ కోసం రెండు అద్భుతమైన పాటలు రాశారు. ఎప్పటికైనా ఈ సినిమా తీసి, ఆయనకు అంకితమిస్తా. - రెంటాల -
స్వచ్ఛమైన ప్రేమికులను కృష్ణమ్మ కలిపింది..
నీ ప్రేమ స్వచ్ఛమైనదే అయితే... దానిని గెలిచేలా చేయడానికి ప్రకృతంతా ఏకమవుతుంది అనేది నానుడి. వాళ్లిద్దరి ప్రేమ స్వచ్ఛమైనదే. అందుకే సాక్షాత్తు కృష్ణా నదే పూనుకొని తన ప్రవాహాన్ని మార్చుకుంది. ప్రేమ ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్లేలా చేసింది. అది ప్రకృతి గెలుపు. ప్రేమ గెలుపు. రాధా కృష్ణులు ఎప్పటికీ కలవరంటారు. వాళ్లిద్దరి పేర్లు అవే. రాధ, కృష్ణ. ఇద్దరూ చిన్నప్పుడే ఒకరికొకరు స్నేహితులయ్యారు. క్లాస్‌లో తెలివిగల రాధ, చదువురాని కృష్ణకు స్ఫూర్తిగా మారింది. ఆమె నవ్వునే చూస్తూ ఆమె కళ్లను కళ్లల్లో పెట్టుకుంటూ అతడు కెరీర్లో ఒక్కొక్క మెట్టే ఎక్కాడు. కృష్ణమ్మ సాక్షిగా ఆమెను గెలుచుకుందాం అనుకున్నాడు. కాని అడ్డంకి. తను ప్రాణం కన్నా ప్రేమించిన అమ్మాయి తనకు దక్కకుండా మూడు సందర్భాల్లో తప్పిపోతుంది. ఇక ఆఖరి సందర్భంలో ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలి. కాని అప్పుడు కూడా అతడు ఊహించింది ఒకటి. జరిగింది ఒకటి. కాని కృష్ణమ్మ ఆశీస్సులు ఉన్న ప్రేమ వారిది. ఆ నదే వారిని కలిపింది. ఎలా? తెలియాలంటే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చూడాల్సిందే. కన్నడంలో పెద్ద విజయం సాధించిన ‘చార్మినార్’ రీమేక్‌కు మరిన్ని హంగులు, నేటివిటీ, కథాబలం జత చేసి దర్శకుడు ఆర్.చంద్రు తీసిన ఈ సినిమా ప్రతి మనసునూ తాకే సన్నివేశాలతో విడుదలకు సిద్ధమవుతుంది. నిర్మాత లగడపాటి శ్రీధర్ తన సంస్థ రామలక్ష్మి క్రియేషన్స్ దశాబ్ద వేడుకల సందర్భంగా ప్రేక్షకులకు అందిస్తున్న క్యూట్ లవ్‌స్టోరీ ఇది. సుధీర్, నందిత ఇది వరకే హిట్ పెయిర్‌గా నిరూపించుకున్నారు. ఈ సినిమాలో వారిరువురి మధ్య కెమిస్ట్రీ మరింత పే చేయొచ్చు. -
పదేళ్లు ఫుల్ హ్యాపీ!
‘‘ఇదొక అందమైన ప్రేమ కథ. అందరి హృదయాలనూ తాకుతుంది. ఈ నెల 25న విజయవాడలో పాటల వేడుక చేయబోతున్నాం. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి రెడీ చేస్తున్నాం’’ అని లగడపాటి శ్రీధర్ తెలిపారు. సుధీర్‌బాబు, నందిత జంటగా ఆర్. చంద్రు దర్శకత్వంలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష, శ్రీధర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమ సంస్థ ప్రారంభమై దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా లగడపాటి శ్రీధర్ హైదరాబాద్‌లో పత్రికల వారితో ముచ్చటించారు. ‘ఎవడి గోల వాడిదే’ లాంటి సిల్వర్ జూబ్లీ సినిమాతో మా ప్రస్థానం మొదలైంది. స్టైల్, వియ్యాలవారి కయ్యాలు, పోటుగాడు చిత్రాలతో మా సంస్థ ప్రతిష్ట పెరిగింది. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు చేస్తాం’’ అని శ్రీధర్ చెప్పారు. -
‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ ప్రోమోస్ విడుదల
-
ఆద్యంతం ఆసక్తికరం...
షేక్ సైదా సూరజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘పాషా అందరివాడు’. బండారు దానయ్యకవి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో ఇటీవల విడుదల చేశారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌కి అందించారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. దానయ్యకవి అద్భుతమైన సంగీతం అందించారని, సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని సైదా సూరజ్ అన్నారు. సంగీత దర్శకునిగా ఈ సినిమా తనకు మంచి పేరు తెస్తుందని బండారు దానయ్యకవి విశ్వాసం వెలిబుచ్చారు. చంద్రమోహన్, పి.ప్రభాకర్, చిన్నా తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: కాంచనపల్లి రాజేంద్రరాజు. -
రజనీకాంత్‌కి బాషా, కమల్‌హాసన్‌కి నాయకుడు...
సూర్యకు సికిందర్ ‘‘పవర్‌స్టార్, సూపర్‌స్టార్ కలిస్తే ఎంత పవరుంటుందో సూర్యలో అంత పవర్ ఉంటుంది’’ అంటున్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. సూర్య కథానాయకునిగా లింగుస్వామి దర్శకత్వంలో ‘సికిందర్’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘‘తమిళంలో ఎంత స్టార్డమ్ ఉందో, తెలుగులో కూడా అంతే స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు సూర్య. ‘సికిందర్’ ఆయన్న మరో మెట్టుపై నిలబెట్టే సినిమా అవుతుంది. ఇందులో ఆయన స్టయిలిష్ డాన్‌గా నటించారు. రజనీకాంత్‌కి ‘బాషా’, కమల్‌హాసన్‌కి ‘నాయకుడు’లా సూర్యకు ‘సికిందర్’ నిలిచిపోతుంది. సూర్య ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని అనుకుంటున్నారు. అలాంటిదేం లేదు. ఇందులో ఆయన రెండు రకాలుగా కనిపిస్తారంతే’’ అని చెప్పారు లగడపాటి శ్రీధర్. రీమేక్‌లు ఎక్కువగా చేస్తున్నారేంటని తనను చాలామంది అడుగుతున్నారనీ, తన దగ్గర చాలా కథలు ఉన్నా... ఆ కథలకు తగ్గ స్టార్ హీరోలు దొరకడం లేదనీ, అందుకే రీమేక్‌లు చేస్తున్నాననీ శ్రీధర్ చెప్పారు. రీమేక్‌లు, డబ్బింగులు పక్కనపెట్టి త్వరలోనే ఓ భారీ తెలుగు సినిమా చేస్తానని ఆయన తెలిపారు. తాను నిర్మిస్తున్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమా గురించి చెబుతూ -‘‘ప్రేమలోని అసలైన కోణాన్ని ఆవిష్కృతం చేసే కథాంశమిది. కన్నడ ‘చార్మినార్’ చిత్రం దీనికి మాతృక. మన నేటివిటీకి తగ్గట్టుగా క్లైమాక్స్ మార్చాం. సినిమా బాగా వస్తోంది’’ అన్నారు. తమ రామలక్ష్మీ క్రియేషన్స్ సంస్థ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నామని లగడపాటి శ్రీధర్ తెలిపారు. -
లగడపాటి శ్రీధర్ జన్మదిన వేడుక
-
అతడే సీఎమ్ అయితే?
ఆ నలుగురు, వినాయకుడు చిత్రాల ద్వారా ఉత్తమాభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ప్రేమ్‌కుమార్ పట్రా. ఆయన సమర్ఫణలో అనిల్ జేసన్ గూడూరు దర్శకత్వంలో సరితా పట్రా నిర్మించిన చిత్రం ‘ఆ ఐదుగురు’. వెంకట్, అస్మితా సూద్, క్రాంతి, క్రాంతికుమార్, తనిష్క్‌రెడ్డి, కృష్ణతేజ, శశి ఇందులో ముఖ్య తారలు. ‘మంత్ర‘ ఆనంద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ ఆడియో వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, లగడపాటి శ్రీధర్, డీయస్ రావు, శ్రీధర్ రెడ్డి తదితరులు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. తన తండ్రి చనిపోవడం వల్ల ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగిందని, ఈ నెల 20న లేక 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్ పట్రా తెలిపారు. ఇందులో ఐపీయస్ అధికారి తోట చక్రవర్తిగా నటించానని, ఈ పాత్ర కోసం రెండు నెలలు పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్నానని వెంకట్ చెప్పారు. ఈ కథ ప్రధానంగా ఐదు పాత్రలు చుట్టూ తిరుగుతుందని, ఆదర్శ భావాలున్న ఓ యువకుడు ముఖ్య మంత్రి అయితే ఏం చేస్తాడనేది ముఖ్య అంశమని దర్శకుడు అన్నారు. పాటలు రాయడంతో పాటు ఈ సినిమాకి మాటలు కూడా రాశానని, ఇది ప్రయోజనాత్మక సినిమా అని సుద్దాల అశోక్‌తేజ చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవీణ్‌కుమార్ పట్రా. -
అందమైన జ్ఞాపకాల దొంతర
సుధీర్‌బాబు, నందిత జంటగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆర్. చంద్రు దర్శకత్వంలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి బి.గోపాల్ కెమెరా స్విచాన్ చేయగా, ఎ.కోదండరామిరెడ్డి క్లాప్ ఇచ్చారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కన్నడ చిత్రం ‘చార్మినార్’కు ఇది రీమేక్. తొలి చూపులోనే ప్రేమ అన్నట్టు... ఆ సినిమా చూడగానే ప్రేమలో పడిపోయి ఈ కథను తెలుగు ప్రేక్షకులకు కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నాను. ‘ప్రేమకథాచిత్రమ్’ జంట సుధీర్‌బాబు, నందిత ఈ సినిమా కోసం జతకట్టడం ఆనందంగా ఉంది. చంద్రు ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తాడనే నమ్మకం నాకుంది’’ అని లగడపాటి శ్రీధర్ చెప్పారు. ప్రతి ప్రేక్షకుని మనసునీ హత్తుకుపోయే సినిమా ఇదని, ఇదొక అందమైన జ్ఞాపకాల దొంతర అని సుధీర్‌బాబు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కన్నడంలో భారీ సినిమాల మధ్య విడుదలై ‘చార్మినార్’ ఘన విజయం సాధించింది. శ్రీధర్‌గారు కథకు తగ్గ టైటిల్ ఖరారు చేశారు. ‘ఓనమాలు’ఫేం ఖదీర్‌బాబు సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. మంచి టీమ్ కుదిరింది’’ అని తెలిపారు. గిరిబాబు, ఎమ్మెస్ నారాయణ, సారిక రామచంద్రరావు, చిట్టిబాబు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కేఎస్ చంద్రశేఖర్, కళ: నారాయణరెడ్డి, సంగీతం: హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దేవినేని రవికుమార్. -
ఆ పాట చూసే పోటుగాడు చేయాలనుకున్నాం: లగడపాటి శిరీష, శ్రీధర్
‘‘ఈ చిత్ర విజయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే విజయవంతమైన సినిమాకి కావల్సిన అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం. ఆల్రెడీ కన్నడంలో ఘనవిజయం సాధించింది కాబట్టి తెలుగులో కూడా అలాంటి ఫలితాన్నే ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అంటున్నారు లగడపాటి శ్రీధర్, శిరీషా. మనోజ్ హీరోగా పవన్ వడియార్ దర్శకత్వంలో వీళ్లు నిర్మించిన చిత్రం ‘పోటుగాడు’. కన్నడంలో ఘనవిజయం సాధించిన ‘గోవిందాయ నమః’ చిత్రానికి ఇది రీమేక్. శనివారం ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘పోటుగాడు’ గురించి శిరీషాశ్రీధర్ ఈ విధంగా మాట్లాడారు. రెండేళ్ల విరామం తర్వాత మేం నిర్మించిన చిత్రం ఇది. ఈ గ్యాప్‌కి కారణం ఉంది. మేం నిర్మించిన ‘ఎవడి గోల వాడిదే’ చిత్రాన్ని ప్రేక్షకులు మినిమమ్ నాలుగు సార్లు చూశారు. ఆ తర్వాత నిర్మించిన ‘స్టయిల్’కి కూడా మంచి ఆదరణ లభించింది. ఈసారి కూడా ప్రేక్షకులు రెండు, మూడుసార్లు చూసే సినిమాని ఇవ్వాలనుకున్నాం. అలాంటి సమయంలోనే కన్నడంలో రూపొందుతున్న ‘గోవిందాయ నమ’ చిత్రానికి సంబంధించిన పాట చూడటం జరిగింది. పాటలే ఇంత అద్భుతంగా తీస్తే.. ఇక ఆ దర్శకుడికి ఎంత ప్రతిభ ఉంటుంది? అనుకున్నాను. ఆ పాట చూసి, ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించిన పవన్ వడియార్ దర్శకత్వంలోనే తెలుగు సినిమా కూడా చేయాలనుకుని, ఆయన్ను ఎంపిక చేశాం. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ కథను మార్చాం. క్లయిమాక్స్‌ని పూర్తిగా మార్చేశాం. **** అందుకే మనోజ్‌ని ఎన్నుకున్నాం: ఈ చిత్రంలో మనోజ్ పాత్ర నవరసాలు పండించాల్సి ఉంటుంది. తన పాత్రలో నాలుగు కోణాలుంటాయి. ఇన్ని కోణాలను పండించగల సత్తా కలక్షన్ కింగ్ మోహన్‌బాబుగారి కుమారుడు మనోజ్‌కి ఉంటుందనిపించింది. అందుకే తనను హీరోగా ఎంపిక చేశాం. ఈ సినిమాతో మనోజ్ ‘కలక్షన్ కింగ్’ అని కూడా అనిపించుకుంటాడు. తన ఎనర్జీ సూపర్బ్. డాన్స్ అద్భుతంగా చేశాడు. ఎప్పటిలానే రిస్కీ ఫైట్స్‌ని సునాసయంగా చేశాడు. కాలు, చెయ్యి బెణికిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా విజయం మీద ఉన్న నమ్మకంతో దాదాపు వెయ్యి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. మనోజ్ కెరీర్లో భారీ విడుదల ఇదే. **** మోహన్‌బాబుగారు సినిమా బాగుందన్నారు: ఈ చిత్రాన్ని మోహన్‌బాబుగారు చూశారు. మా అబ్బాయితో మంచి సినిమా తీశావని అభినందించారు. బ్రహ్మాండంగా ఉందన్నారు. అలాగే అక్కడక్కడా లాగ్ ఉందని చెప్పారు. ఆయన చెప్పిన చోట్ల ట్రిమ్ చేసిన తర్వాత, సినిమా ఇంకా బాగుందనిపించింది.