విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో రఘు జయ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఏ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అనేది ఉపశీర్షిక. ‘రేసుగుర్రం, పటాస్, రుద్రమదేవి, నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ సినిమాల్లో బాలనటుడిగా ప్రశంసలు అందుకున్నాడు విక్రమ్. ఇక, తను ప్రధాన పాత్ర చేస్తున్న ‘ఎవడు తక్కువ కాదు’ చిత్రంలోని తొలి పాట ‘లైఫ్ ఈజ్ ఏ క్యాసినో... తాడో పేడో తేల్చేసెయ్... నీ ఆటేదో ఆడేసెయ్’ అనే పాటను సోమవారం విడుదల చేశారు. ‘‘రిలీజ్ చేసిన పాటకు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. యాక్షన్‌తో పాటు అందమైన టీనేజ్ ప్రేమకథతో రూపొందిన చిత్రం ఇది. మా సంస్థలో మంచి చిత్రం అవుతుంది. విక్రమ్‌కు నటుడిగా మంచి పేరు వస్తుంది. త్వరలో మిగతా పాటలను, ఈ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్.
Comments
Please login to add a commentAdd a comment