
హీరోగా లగడపాటి వారసుడు
పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లగడపాటి శ్రీధర్ తనయుడు, విక్రమ్ సహిదేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే రేసుగుర్రం, రుద్రమదేవి, పటాస్ లాంటి సినిమాల్లో బాలనటుడిగా అలరించిన విక్రమ్ కన్నడ సినిమాతో లీడ్ యాక్టర్గా మారుతున్నాడు. నలుగురు యువకుల జీవితాల్లోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 19న రిలీజ్ కానుంది.
తమిళంలో ఘనవిజయం సాధించిన గోలీసోడా సినిమాను అదే పేరుతో కన్నడలో రీమేక్ చేశారు. ఈ సినిమాతో లగడపాటి శ్రీదర్ తనయుడు విక్రమ్ సహిదేవ్తో పాటు కన్నడ నటులు సాధు కోకిల, అరుణ్ సాగర్ల తనయులు కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారు. కన్నడలో రిలీజ్ తరువాత తెలుగులోనూ ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు లగడపాటి శ్రీధర్.