‘‘అల్లు అర్జున్ ఒక ప్యాన్ ఇండియా స్టార్. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడానికి బన్నీ చాలా ట్రై చేస్తుంటాడు. సినిమా సినిమాకి తన హార్డ్ వర్క్ పెంచుతూ పైకెదిగే హీరో ఆమిర్ ఖాన్. ఆయన తర్వాత అలా చేసేది అల్లు అర్జునే అని నా నమ్మకం’’ అని నిర్మాత లగడపాటి శ్రీధర్ అన్నారు.
అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో నాగబాబు సమర్పణలో శిరీషా శ్రీధర్ నిర్మిస్తోన్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్‌కి మంచి స్పందన రావడంతో నిర్మాత శ్రీధర్ విలేకరులతో మాట్లాడారు.
► ‘రేసుగుర్రం, టెంపర్, కిక్’ వంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లకు కథ అందించిన తర్వాత వంశీ స్వీయ కథతో దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. ఆ మూడు సినిమాల్లోని పవర్ ఈ ఒక్క సినిమాలో ఉంటుంది.
► ఈ చిత్రంలో కేవలం దేశభక్తి మాత్రమే కాదు. రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, సొసైటీ అనే అంశాలు కూడా ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. తెలుగు సినిమా కీర్తిని ‘బాహుబలి’ ఎంతవరకు తీసుకెళ్లిందో మా చిత్రం కూడా అలానే తీసుకెళుతుంది. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది. 2018 బన్నీ ఇయర్ అన్నది నా నమ్మకం. అందులో నాకే మాత్రం సందేహం లేదు.
► బన్నీ అంటే ప్రేక్షకులకి ఎంత ప్రేమో విన్నాను. మా ఫస్ట్ ఇంపాక్ట్‌కు వచ్చిన స్పందనతో అది ఎలా ఉంటుందో చూశా. 29 గంటల్లో కోటి మందికి పైగా ఇంపాక్ట్‌ను వీక్షించారు. వారికి కృతజ్ఞతలు.
► ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్. మిగతా భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేద్దామనుకున్నాం. బన్నీ త్వరలో తమిళంలో పరిచయం కానున్నారు. ఆ ఎంట్రీ డైరెక్ట్ తమిళ్ సినిమాతోనే ఉంటే బాగుంటుందని ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ని డబ్ చేయలేదు.
► షూటింగ్ 70 శాతం అయింది. మరో 40 రోజుల్లో పూర్తవుతుంది. మార్చికల్లా ఫస్ట్ కాపీ చేతికొస్తుంది. వేసవికి కచ్చితంగా వస్తున్నాం. ఏప్రిల్ 27న తప్పకుండా సినిమా రిలీజ్ చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment