na peru surya na ellu India
-
‘నా పేరు సూర్య..’ చేసినందుకు గర్వపడుతున్నా
‘‘అందరికీ నమస్కారం. నా పేరు అల్లు అర్జున్. నా ఇల్లు ఇండియా. ఈ ఫంక్షన్ పేరు థ్యాంక్యూ ఇండియా. ఇక్కడ నేను ఫస్ట్ థ్యాంక్యూ చెప్పాల్సింది మా గెస్ట్ పవన్ కల్యాణ్‌గారికి. ఈ సినిమా గురించి ఒక్కొక్కరు మాట్లాడితే బాగుంటుంది. కానీ, నేను తక్కువ మాట్లాడితే బాగుంటుంది’’ అని అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. కె. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలైంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ‘థ్యాంక్యూ ఇండియా మీట్’ (సక్సెస్ మీట్) నిర్వహించారు. హీరో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి నాకు వచ్చిన ఓ బెస్ట్ కాంప్లిమెంట్ గురించి చెబుతాను. చాలామంది మహిళలు ఫోన్ చేసి.. ఈ సినిమా మాకు చాలా బాగుంది. మా పిల్లలు ఈ సినిమా చూశాక మిలటరీ యూనిఫాం కుట్టించుకోవాలనుకుంటున్నారు’’ అన్నారు. ఈ మూవీలో నా నటన చాలామందికి నచ్చింది. వండర్ఫుల్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు.నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఓ మంచి చిత్రం. ఇలాంటి మంచి సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పటానికి కల్యాణ్‌గారు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి మంచి సినిమా చేసే అవకాశం నాకు ఇచ్చిన బన్నీకి థ్యాంక్స్. నేనెప్పుడూ కథని నమ్ముతాను. ఆ కథకి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేశారు బన్నీగారు. దానికి సహకరించారు వక్కంతం వంశీగారు. ఈ సినిమాని తర్వాతి జెనరేషన్ కోసం తీశాం. ఈ చిత్రం చూసిన స్టూడెంట్స్‌లో ఓ మార్పు వస్తుందని కచ్చితంగా నమ్ముతా. ఈ వేసవిలో కుటుంబంతో కలిసి ఈ సినిమాకి వెళ్లి ఎంజాయ్ చేయండి. వండర్ఫుల్ జ్ఞాపకాలతో ఇంటికెళతారని గ్యారంటీగా చెప్పగలను. మా సినిమాని ఆదరించిన తెలుగు, తమిళం, మలయాళ ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా నా తొలి సినిమాకే ఇంత పెద్ద అవకాశం రావడం హ్యాపీ. మంచి కథను కూడా కమర్షియల్ సినిమాగా తీయొచ్చనే నా నమ్మకాన్ని నమ్మి నాతో ప్రయాణం చేసిన అర్జున్‌గారికి, ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమా ఇంత రిచ్‌గా రావడానికి కృషి చేసిన శ్రీధర్‌గారు, నాగబాబుగారు, ‘బన్నీ’వాసులకు థ్యాంక్స్. మంచి కంటెంట్‌తో ఉన్న ఈ సినిమాని గుండెల్లోకి తీసుకున్న తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో లగడపాటి శిరీషా శ్రీధర్, నాగబాబు, సహ నిర్మాత ‘బన్నీ’ వాసు, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, దర్శకుడు మెహర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
2018 బన్నీ ఇయర్... నో డౌట్
‘‘అల్లు అర్జున్ ఒక ప్యాన్ ఇండియా స్టార్. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడానికి బన్నీ చాలా ట్రై చేస్తుంటాడు. సినిమా సినిమాకి తన హార్డ్ వర్క్ పెంచుతూ పైకెదిగే హీరో ఆమిర్ ఖాన్. ఆయన తర్వాత అలా చేసేది అల్లు అర్జునే అని నా నమ్మకం’’ అని నిర్మాత లగడపాటి శ్రీధర్ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో నాగబాబు సమర్పణలో శిరీషా శ్రీధర్ నిర్మిస్తోన్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్‌కి మంచి స్పందన రావడంతో నిర్మాత శ్రీధర్ విలేకరులతో మాట్లాడారు. ► ‘రేసుగుర్రం, టెంపర్, కిక్’ వంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లకు కథ అందించిన తర్వాత వంశీ స్వీయ కథతో దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. ఆ మూడు సినిమాల్లోని పవర్ ఈ ఒక్క సినిమాలో ఉంటుంది. ► ఈ చిత్రంలో కేవలం దేశభక్తి మాత్రమే కాదు. రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, సొసైటీ అనే అంశాలు కూడా ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. తెలుగు సినిమా కీర్తిని ‘బాహుబలి’ ఎంతవరకు తీసుకెళ్లిందో మా చిత్రం కూడా అలానే తీసుకెళుతుంది. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది. 2018 బన్నీ ఇయర్ అన్నది నా నమ్మకం. అందులో నాకే మాత్రం సందేహం లేదు. ► బన్నీ అంటే ప్రేక్షకులకి ఎంత ప్రేమో విన్నాను. మా ఫస్ట్ ఇంపాక్ట్‌కు వచ్చిన స్పందనతో అది ఎలా ఉంటుందో చూశా. 29 గంటల్లో కోటి మందికి పైగా ఇంపాక్ట్‌ను వీక్షించారు. వారికి కృతజ్ఞతలు. ► ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్. మిగతా భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేద్దామనుకున్నాం. బన్నీ త్వరలో తమిళంలో పరిచయం కానున్నారు. ఆ ఎంట్రీ డైరెక్ట్ తమిళ్ సినిమాతోనే ఉంటే బాగుంటుందని ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ని డబ్ చేయలేదు. ► షూటింగ్ 70 శాతం అయింది. మరో 40 రోజుల్లో పూర్తవుతుంది. మార్చికల్లా ఫస్ట్ కాపీ చేతికొస్తుంది. వేసవికి కచ్చితంగా వస్తున్నాం. ఏప్రిల్ 27న తప్పకుండా సినిమా రిలీజ్ చేస్తాం. -
29 గంటల్లో కోటి
డిజిటల్ వ్యూస్‌లో అల్లు అర్జున్ మరోసారి తన సత్తా చాటారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫస్ట్ ఇంపాక్ట్ 29గంటల్లోనే కోటి డిజిటల్ వ్యూస్‌ని రాబట్టుకోవడం విశేషం. జనవరి 1 సాయంత్రం 5 గంటలకి డిజిటల్ మీడియాలో విడుదల చేసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫస్ట్ ఇంపాక్ట్ కోటి వ్యూస్‌తో నాన్ ‘బాహుబలి’ రికార్డులో తొలి స్థానంలో నిలిచినట్లు చిత్రబృందం ప్రకటించింది. రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ కె.నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఏప్రిల్ 27న సినిమా విడుదల చేస్తున్నారు. ‘‘మా సినిమా ఫస్ట్ ఇంపాక్ట్‌కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులందరికి నా ధన్యవాదాలు’’ అన్నారు అల్లు అర్జున్. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్ రవి, సంగీతం: విశాల్–శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు, సహ నిర్మాత: బన్నీ వాసు. -
అల్లు సూర్య@ముంబయ్!
అల్లు అర్జున్ కొత్త సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మ్యూజిక్ సిట్టింగ్స్ ముంబయ్‌లో మొదలయ్యాయి. బాలీవుడ్ ద్వయం విశాల్–శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సోమవారం సాయంత్రం ముంబయ్‌లోని విశాల్ అండ్ శేఖర్ స్టూడియోకి వెళ్లిన అల్లు అర్జున్ ట్యూన్స్ గురించి డిస్కస్ చేశారు. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించనున్న ఈ సిన్మాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్, శరత్‌కుమార్ విలన్, అర్జున్ కీలక పాత్రధారి. -
అ.. అ... జోడీ కుదిరింది
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ – అల్లు అర్జున్ హీరోగా నటించే కొత్త సినిమా పేరు ఇది. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, శ్రీరామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించనున్న ఈ సినిమా గత నెల్లో ప్రారంభమైంది. అప్పట్నుంచి ఇందులో అల్లు అర్జున్‌కు జోడీగా ఎవరు నటిస్తారనే ప్రచారం మరింత జోరందుకుంది. ఓ ముగ్గురు, నలుగురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివరకు, మలయాళీ ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేశారనే వార్తలొచ్చాయి. తాజాగా దర్శక–నిర్మాతలు అదే వార్తను కన్ఫర్మ్ చేశారు. అ ఫర్ అల్లు అర్జున్‌కు జోడీగా అ ఫర్ అనూ నటించనున్నారని తెలిపారు. ఆగస్టు మొదటివారంలో ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. తమిళ హీరోలు అర్జున్, శరత్‌కుమార్ ముఖ్య తారాగణంగా నటించనున్న ఈ సినిమాకు సంగీతం: విశాల్–శేఖర్, సహ నిర్మాత: ‘బన్నీ’ వాసు, సమర్పణ: కె. నాగబాబు.