అ.. అ... జోడీ కుదిరింది
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ – అల్లు అర్జున్ హీరోగా నటించే కొత్త సినిమా పేరు ఇది. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, శ్రీరామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించనున్న ఈ సినిమా గత నెల్లో ప్రారంభమైంది. అప్పట్నుంచి ఇందులో అల్లు అర్జున్‌కు జోడీగా ఎవరు నటిస్తారనే ప్రచారం మరింత జోరందుకుంది. ఓ ముగ్గురు, నలుగురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి.
చివరకు, మలయాళీ ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేశారనే వార్తలొచ్చాయి. తాజాగా దర్శక–నిర్మాతలు అదే వార్తను కన్ఫర్మ్ చేశారు. అ ఫర్ అల్లు అర్జున్‌కు జోడీగా అ ఫర్ అనూ నటించనున్నారని తెలిపారు. ఆగస్టు మొదటివారంలో ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. తమిళ హీరోలు అర్జున్, శరత్‌కుమార్ ముఖ్య తారాగణంగా నటించనున్న ఈ సినిమాకు సంగీతం: విశాల్–శేఖర్, సహ నిర్మాత: ‘బన్నీ’ వాసు, సమర్పణ: కె. నాగబాబు.