Allu Arjun Chief Guest For Allu Sirish Urvasivo Rakshasivo Movie Success Meet - Sakshi
Sakshi News home page

Urvasivo Rakshasivo: తమ్ముడికి సపోర్ట్‌గా అల్లు అర్జున్‌

Published Sat, Nov 5 2022 4:27 PM | Last Updated on Sat, Nov 5 2022 5:01 PM

Allu Arjun Is The Chief Guest For Allu Sirish Urvasivo Rakshasivo Movie Success Celebration - Sakshi

ఎట్టకేలకు అల్లు శిరీష్‌ ఖాతాలో ఓ హిట్‌ పడింది. శుక్రవారం విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. ఓపెనింగ్స్‌ భారీ రేంజ్‌లో రాకపోయినా.. రెండో రోజు మాత్ర భారీ స్థాయిలో బుకింగ్స్‌ జరిగాయి.  లవ్‌, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. సునీల్‌, వెన్నెక కిశోర్‌ల కామెడీ, శిరీష్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. ఆడియన్స్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో చిత్రబృందం ఫుల్‌ హ్యాపీగా ఉంది. శుక్రవారం సాయత్రమే సక్సెస్‌ మీట్‌ పెట్టి తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

(చదవండి: ఊర్వసివో రాక్షసివో మూవీ రివ్యూ)

ఇక ఆదివారం ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించాలని చిత్రయూనిట్‌ నిర్ణయించుకుంది. ఈ వేడుకకు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. తమ్ముడికి సపోర్ట్‌గా అన్న వస్తుండడంతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. శిరీష్‌కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్‌ హీరోయిన్‌గా నటించింది. సునీల్‌, వెన్నెల కిశోర్‌, ఆమని ఇతర కీలక పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement