పదేళ్లు ఫుల్ హ్యాపీ! | Krishnamma Kalipindi Iddarini audio on Jan 25 | Sakshi
Sakshi News home page

పదేళ్లు ఫుల్ హ్యాపీ!

Published Tue, Jan 20 2015 11:52 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

పదేళ్లు ఫుల్ హ్యాపీ! - Sakshi

పదేళ్లు ఫుల్ హ్యాపీ!

‘‘ఇదొక అందమైన ప్రేమ కథ. అందరి హృదయాలనూ తాకుతుంది. ఈ నెల 25న విజయవాడలో పాటల వేడుక చేయబోతున్నాం. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి రెడీ చేస్తున్నాం’’ అని లగడపాటి శ్రీధర్ తెలిపారు. సుధీర్‌బాబు, నందిత జంటగా ఆర్. చంద్రు దర్శకత్వంలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష, శ్రీధర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
 తమ సంస్థ ప్రారంభమై దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా లగడపాటి శ్రీధర్ హైదరాబాద్‌లో పత్రికల వారితో ముచ్చటించారు. ‘ఎవడి గోల వాడిదే’ లాంటి సిల్వర్ జూబ్లీ సినిమాతో మా ప్రస్థానం మొదలైంది. స్టైల్, వియ్యాలవారి కయ్యాలు, పోటుగాడు చిత్రాలతో మా సంస్థ ప్రతిష్ట పెరిగింది. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు చేస్తాం’’ అని శ్రీధర్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement