
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో అల్లు అర్జున్ పవర్‌ప్యాక్డ్ ఫర్‌ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేశారు. బన్నీతో పాటు అదే సినిమాలో నటుడిగా మెరిసిన మరో యువకుడు విక్రమ్ సహిదేవ్. అన్వర్ పాత్రలో విక్రమ్ సహిదేవ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతకు ముందు ‘రేసుగుర్రం’లో అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రలో మెప్పించాడు. ఇప్పుడీ కుర్రాడు ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు.
లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘ఎవడు తక్కువ కాదు’. విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అన్నది ఉపశీర్షిక. రఘు జయ దర్శకుడు. హోలీ సందర్భంగా సినిమా టైటిల్ ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్... అనేది ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ సహిదేవ్ క్యారెక్టర్ కు ఫర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. న్యూ ఏజ్ రివెంజ్ డ్రామా ఇది. బాల నటుడిగా ఆకట్టుకున్న మా విక్రమ్ సహిదేవ్, కథకు తగ్గట్టు వైవిద్యమైన పాత్రలో కనిపిస్తాడు. యాక్షన్‌తో పాటు అందమైన టీనేజ్ ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. హోలీ సందర్బంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసాం. మా సంస్థలో ఇది ఓ మంచి సినిమాగా నిలవటంతో పాటు, విక్రమ్ మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకంగా ఉన్నాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment