విక్రమ్ సహిదేవ్ (నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు) హీరోగా నటించిన తాజా చిత్రం ‘వర్జిన్ స్టోరీ’. సౌమికా పాండియన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ప్రదీప్ బి. అట్లూరి దర్శకుడు. లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా థ్యాంక్స్‌మీట్‌లో లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ – ‘‘వర్జిన్ స్టోరీ’ చిత్రంతో ఓ కొత్త ప్రయత్నం చేశాం. అవకాశం ఉన్నా కూడా ఎక్కడా అసభ్యకర సన్నివేశాలను చూపించలేదు. టీనేజ్‌లో ఉన్నవారికి మా సినిమా మరింత బాగా అర్థం అవుతుంది’’ అన్నారు. ‘‘యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది’’ అన్నారు ప్రదీప్. ఈ కార్యక్రమంలో సౌమిక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment