Thala Ajith Vishwasam Fame Actress Anikha Surendran Reveals About Fans Scary Love Proposal - Sakshi
Sakshi News home page

అభిమాని ప్రపోజ్‌, అంగీకరించకపోతే చస్తానని బెదిరింపులు: నటి

Published Thu, May 27 2021 11:07 AM | Last Updated on Thu, May 27 2021 1:12 PM

Vishwasam Fame Actress Anikha Surendran Reveals About Fans Scary Love Proposal - Sakshi

తమ కోసం ఏదైనా చేసే అభిమానులు ఉన్నందుకు నటీనటులు గర్వంగా ఫీల్‌ అవుతారు. కానీ కొన్నిసార్లు వారి మితిమీరిన అభిమానం వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. నటి అనికా సురేంద్రన్‌కు ఎదురైన ఈ సంఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. విశ్వాసం సినిమాలో స్టార్‌ హీరో అజిత్‌ కూతురుగా నటించి మెప్పించింది అనికా. ఓ మలయాళ చిత్రం ద్వారా ఆమె హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ ఓ ప్రశ్నను సంధించాడు. నీ వీరాభిమాని నిన్ను ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్‌ చేసి, పెళ్లికి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తే నువ్వేం చేస్తావు? అని ప్రశ్నించాడు. దీనికి అనికా స్పందిస్తూ అది నిజంగానే తన జీవితంలో జరిగిందని చెప్పుకొచ్చింది. ఈమెయిల్‌ ద్వారా ఓ వ్యక్తి తనకు ప్రేమలేఖ పంపి, బెదిరించాడని తెలిపింది. ఆ సమయంలో తను ఎంతగానో భయాందోళనకు గురయ్యానని పేర్కొంది. కానీ తర్వాత అతడు అలాంటిదేమీ చేయకపోవడంతో ఊపిరి పీల్చుకున్నానంది.

చదవండి: హీరోయిన్‌ లవ్‌ ఎఫైర్‌.. అడ్డొచ్చిన తమ్ముడిని ముక్కలుగా నరికి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement