‘స్వయంవ‌ద’ టైటిల్ ఆవిష్కర‌ణ‌ | Swayamvada Movie Title Logo Launch | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 22 2018 1:39 PM | Last Updated on Thu, Nov 22 2018 1:40 PM

Swayamvada Movie Title Logo Launch - Sakshi

ఆదిత్య అల్లూరి, అనికా రావు  జంట‌గా ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై తెరకెక్కుతున్న సినిమా స్వయంవద. ఈ సినిమాను వివేక్ వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖ సమక్షంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన సీనియ‌ర్ ద‌ర్శకుడు అల్లాణి శ్రీధ‌ర్ ‘స్వయంవ‌ద‌’ చిత్ర టైటిల్‌ను, లోగోను ఎ.వి.ఏ సుబ్బారావు,  టైటిల్ మోష‌న్ పోస్టర్ ను నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అల్లాణి శ్రీధ‌ర్ మాట్లాడుతూ, ‘వివేక్ మంచి రైట‌ర్ అని అతికొద్ది మందికే తెలుసు. ఆయ‌న నాతో క‌లిసి ప‌నిచేసిన‌ప్పుడే నాకు విష‌యం అర్ధమైంది. యువ‌త ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడింది? అన్నదే ఈ సినిమా క‌థ‌.  త‌ప్పకుండా సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నా’ అని అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ‘సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వివేక్ గురువుకు త‌గ్గ శిష్యుడ‌ని టైటిల్‌ను బ‌ట్టే తెలుస్తోంది. ఇదో డిఫ‌రెంట్ మూవీ. ఈ సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నా’ అని అన్నారు.

చిత్ర ద‌ర్శకుడు వివేక్ వ‌ర్మ మాట్లాడుతూ, ‘స్వయంవ‌ద అనేది సంస్కృత ప‌దం. దీనికి చాలా ప్రత్యేక‌త ఉంది. తన గురించి తానే ఓ స‌ర్వస్వం అనే ఓ పాత్ర గురించి సినిమాలో చెప్పబోతున్నా. ఇందులో హీరోయిన్ మొత్తం 6 గెట‌ప్స్‌లో క‌నిపిస్తుంది. హీరో కూడా చ‌క్కగా న‌టించాడు. టెక్నిక‌ల్ గాను సినిమా హైలైట్‌గా ఉంటుంది. ఒక‌ పాట షూటింగ్ మిన‌హా అంతా పూర్తయింద’న్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement