
సింహాచలం(పెందుర్తి): సింహగిరిపై సోమవారం మహా సముద్రం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. హీరో శర్వానంద్, హీరోయిన్ అదితీరావు హైదరీ తదితరులపై ఆలయప్రాంగణంలోని ధ్వజస్తంభం, కల్యాణ మండపంలో కొన్ని సన్నివేశాలను దర్శకుడు అజయ్‌భూపతి చిత్రీకరించారు. హీరో కుటుంబంతో సహా ఒక చిన్నపాపకు అక్షరాభ్యాసం చేసేందుకు ఆలయానికి వచ్చే సన్నివేశాలు, కల్యాణ మండపంలో ఒక స్వామీజీ ప్రవచన సనివేశాన్ని చిత్రీకరించారు. విశాఖలో మహా సముద్రం సినిమా షూటింగ్ 34 రోజుల పాటు చేశామని, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూర్చారన్నారు.
మంత్రి ముత్తంశెట్టితో శర్వానంద్ చిట్‌చాట్..
సింహగిరికి సోమవారం వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును సినీ హీరో శర్వానంద్ కలిశారు. పరస్పరం నమస్కరించుకుని, ఒకరినొకరు ఆప్యాయంగాపలకరించుకున్నారు.
అప్పన్నకు పూజలు.. : శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని హీరో శర్వానంద్ దర్శించుకున్నారు. కప్పస్తంభానికి మొక్కుకుని బేడా ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో స్వామికి అష్టోత్తం పూజ, గోదాదేవికి పూజలు జరిపారు. స్వామివారి ప్రసాదాన్ని శర్వానంద్‌కు దేవ స్థానం ఈవో ఎం.వి.సూర్యకళ అందజేశారు. లక్ష్మీనృసింహుడికి కిలో ముత్యాలు : శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి సినీ దర్శకుడు అజయ్‌భూపతి కిలో ముత్యాలను కానుకగా సమర్పించా రు. మహా సముద్రం సినిమాకు దర్శకత్వం వహి స్తున్న ఆయన అప్పన్నను దర్శించుకుని ఆలయ సూపరింటెండెంట్ బంగారునాయుడుకు ముత్యాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment