
కల్యాణి ప్రియదర్శన్
హే.... అని ఎగిరి గంతేస్తున్నారు కల్యాణి ప్రియదర్శన్. ఎందుకంటే తను ఎప్పటి నుంచో అనుకుంటున్న ఓ కోరిక నెరవేరిందట. ఏంటా కోరిక అనుకుంటున్నారా? గ్యాంగ్‌స్టర్ సినిమాలో నటించాలన్నది తన డ్రీమ్. ‘హలో’తో మంచి హిట్ అందుకున్నా ఒక్క సినిమా కూడా సైన్ చేయని కల్యాణి, తన నెక్స్›్ట సినిమాను అనౌన్స్ చేశారు. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో శర్వానంద్ డబుల్ యాక్షన్ చేయనున్నారు. ఒక పాత్రకు జోడీగా కల్యాణి ప్రియదర్శన్‌ని ఎంపిక చేశారు చిత్రబృందం.
ఈ సినిమా గురించి మాట్లాడుతూ – ‘‘నేను ఎప్పటి నుంచో ఒక గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్‌లో న టించాలని అనుకునేదాన్ని. ఫైనల్‌గా సుధీర్‌వర్మ – శర్వానంద్ సినిమా ద్వారా ఆ కోరిక తీరిపోతోంది. ఇంత అమేజింగ్ టీమ్‌తో జాయిన్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు కల్యాణి. ‘‘ఈ సినిమాలో ఇద్దరి హీరోయిన్స్‌లో ఒక హీరోయిన్‌గా కల్యాణిని ఎంపిక చేశాం. మార్చి 3వ వారం నుంచి షూటింగ్ చేస్తాం’’ అని అన్నారు. ఇందులో శర్వానంద్ ఒక క్యారెక్టర్ కోసం 40 ఏళ్ల పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాకు కెమేరా:దివాకర్ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment