
జూన్ స్టార్టింగ్‌లో స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. కొత్త స్టూడెంట్స్ అందరూ స్కూల్‌లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతుంటారు. కాజల్ అగర్వాల్ కూడా కొత్త స్టూడెంట్‌లాగానే కొత్త సినిమా సెట్‌లోకి జాయిన్ అవుతారు. సుధీర్ వర్మ డైరెక్షన్‌లో శర్వానంద్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై పీడీవీ ప్రసాద్, నాగ వంశీ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. శర్వానంద్ లుక్ డిఫరెంట్‌గా ఉండబోతుందట. ఇందులో ఆల్రెడీ ఒక హీరోయిన్‌గా ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ యాక్ట్ చేస్తున్నారు. మరో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ను కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. జూన్ 15 నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు కాజల్. ప్రస్తుతం బాలీవుడ్ హిట్ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రంలో నటిస్తున్నారు కాజల్.
Comments
Please login to add a commentAdd a comment