‘‘ఏడాదిన్నరగా నా సినిమా రిలీజ్ కాలేదు. అనుకోకుండా స్మాల్ బ్రేక్ వచ్చింది. కానీ, నేను బిజీగానే ఉన్నాను. ఇప్పుడు నా టైమ్ స్టార్టయ్యింది. నేను నటించిన సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానన్న నమ్మకం ఉంది’’ అన్నారు కథానాయిక మెహరీన్. శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన చిత్రం ‘మహానుభావుడు’. ఎస్‌కేఎన్ సహ నిర్మాత. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక మోహరీన్ చెప్పిన విశేషాలు...
⇒ వెరీ స్వీట్ మ్యూజికల్ లవ్‌స్టోరీ ఇది. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. విలేజ్ నుంచి వచ్చి ఐటీ కంపెనీలో వర్క్ చేసే మేఘన అనే క్యారెక్టర్‌లో నటించాను. ఫస్ట్‌హాఫ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో, సెకండాఫ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాలో చేసిన మహాలక్ష్మీ క్యారెక్టర్‌కి మేఘన క్యారెక్టర్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుంది.
⇒ యూవీ క్రియేషన్స్ వంటి ప్రెస్టీజియస్ బ్యానర్‌లో మారుతి గారితో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. మారుతిగారు ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ వంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తారు.
⇒ ఈ సినిమాలో నాకు పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. ప్రజెంట్ తెలుగు మాట్లాడలేకపోయినా బాగా అర్థం చేసుకోగలను. శర్వా, మారుతిగారు నాకు లాంగ్వేజ్ పరంగా బాగా హెల్ప్ చేశారు. సినిమా యూనిట్ ఇచ్చిన సపోర్ట్‌ను మర్చిపోలేను.
⇒ ఈ మధ్య నేనో సినిమా ఒప్పుకుని, తప్పుకున్నానని కొంతమంది అంటున్నారు. నిజానికి నేను ఏ ప్రాజెక్ట్ నుంచీ తప్పుకోలేదు. అవి కుదర్లేదంతే. కానీ, ఇప్పుడు ‘రాజా ది గ్రేట్’, ‘జవాన్’, ‘కేరాఫ్ సూర్య’ వంటి గుడ్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నానని గర్వంగా చెప్పగలను. ఈ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ కాబోతున్నాయి. రెండు వారాలకోసారి మీరు హీరోయిన్ మెహరీన్‌ని స్రీన్‌పై చూస్తారు. కానీ, క్యారెక్టర్ పరంగా కొత్త మెహరీన్‌ను చూస్తారని కచ్చితంగా చెప్పగలను.
⇒ ‘మహానుభావుడు’ ఫస్ట్ డే షూట్‌లో శర్వాను కలిశాను. శర్వాది ఫ్రెండ్లీ నేచర్. చాలా నైస్ అండ్ స్వీట్ పర్సన్. హంబుల్‌గా ఉంటాడు. సెట్‌లో మేం ఈజీగా స్నేహితులమైపోయాం.
⇒ రవితేజగారు చాలా హార్డ్‌వర్క్ చేస్తారు. రవితేజగారి దగ్గర రీ–స్టార్ట్ బటన్ ఉంది. ప్రతి సినిమాకు కొత్త నటుడిలా రీఛార్జ్ అవుతారు. ‘రాజా ది గ్రేట్’ సక్సెస్ అవుతుంది. ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన కో–స్టార్స్ అందరూ నాకు బాగా హెల్ప్ చేశారు.
⇒ తెలుగు చిత్రపరిశ్రమ నాకు మదర్ లాంటిది. సినిమా ఫేట్‌ను మనం నిర్ణయించలేం. క్యారెక్టర్ పరంగా ది బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇవ్వొచ్చు. ప్రతి సినిమాను నా ఫస్ట్ ఫిల్మ్‌లా ఫీలయ్యి చేస్తాను. బాలీవుడ్‌లో కొత్త అవకాశాలు వస్తే తప్పకుండా చెప్తాను.
నా టైమ్ స్టార్టయ్యింది
Published Thu, Sep 28 2017 12:13 AM | Last Updated on Thu, Sep 28 2017 8:52 AM
Advertisement
Advertisement