
కాశీపట్నం గుడి వద్ద షూటింగ్ సందడి
అనంతగిరి(అరకులోయ): మండలంలో కాశీపట్నం, తుమ్మనవలస మధ్యలో బంగారమ్మగుడి సమీపంలో అరకు,విశాఖ ప్రధాన రహదారిలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమాలో కొన్ని సన్నివేశాలను శుక్రవారం చిత్రీకరించారు. చెక్‌పోస్టును ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీ చేస్తున్న సన్నివేశం, హీరో శర్వానంద్, అతని స్నేహితుల మధ్య జరిగే సన్నివేశాలను చిత్రీకరించారు.
శర్వానంద్, కల్యాణి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కేశవ చిత్రం డైరెక్టరు నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెరకెక్కుతోంది. 1990 సంవత్సరానికి సంబంధించిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో జబర్దస్త్ మహేష్, ఆదర్శ్, రాజా తదితరులు నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment