Maha Samudram: గన్‌ పట్టిన సిద్దు.. కోపోద్రోక్తుడైన శర్వా | Maha Samudram Character Revealing Motion Poster Out | Sakshi
Sakshi News home page

మహాసముద్రం నుంచి మరో మోషన్ పోస్టర్

Published Thu, Jul 29 2021 4:33 PM | Last Updated on Thu, Jul 29 2021 4:41 PM

Maha Samudram Character Revealing Motion Poster Out - Sakshi

శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.  యాక్షన్ డ్రామాగా రూపొందు తోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. థియేటర్స్‌లో విడుదల అయ్యేందుకు ఈ చిత్రం రెడీ అవుతుంది. ఈ సందర్భంగా రానున్న కొద్ది రోజుల్లో ఈ సినిమా నుంచి ప్రేక్షకులకు ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ ఇచ్చేందుకు చిత్రయూనిట్‌ రెడీ అవుతుంది.

తాజాగా ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ మోషన్‌ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది.మోషన్‌ పోస్టర్‌లో కనిపిస్తున్న ‘మహాసముద్రం’లోని ఇంటెన్స్‌ క్యారెక్టర్స్‌ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇక ఫీరోసియస్‌గా కనిపిస్తున్న హీరోలు శర్వాందన్, సిద్దార్థ్‌ల లుక్స్, తాజా కొత్త పోస్టర్స్‌ అవుట్‌స్టాండింగ్‌గా ఉన్నాయి. సిద్దార్థ్‌ గన్‌ పట్టు కోవడం, శర్వానంద్  కోపోద్రోక్తుడై నడుచుకుంటూ రావడం మోషన్‌ పోస్టర్‌లో కనిపిస్తుంది. సంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌ ఈ చిత్రంలోని క్యారెక్టర్స్‌కు ఇచ్చిన ఎలివేషన్స్‌ ప్రత్యేకమైనవని చెప్పవచ్చు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అయితే అదిరిపోయేలా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement