రావా ఇలా... | Sharwanand & SaiPallavi launched song from Parichayam | Sakshi
Sakshi News home page

రావా ఇలా...

Published Sat, Jun 30 2018 12:56 AM | Last Updated on Sat, Jun 30 2018 12:56 AM

Sharwanand & SaiPallavi launched song from Parichayam - Sakshi

విరాట్, శర్వానంద్, సాయిపల్లవి, లక్ష్మీకాంత్‌ చెన్నా

విరాట్‌ కొండూరు హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘పరిచయం’. సిమ్రత్‌ కౌర్‌ కథానాయిక.  లక్ష్మీకాంత్‌ చెన్నా దర్శకత్వంలో అసిన్‌ మూవీ క్రియేషన్స్‌ పతాకంపై రియాజ్‌ నిర్మించారు. శేఖర్‌ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాలోని రెండోపాట ‘రావా ఇలా...’ ను హీరో శర్వానంద్, హీరోయిన్‌ సాయి పల్లవి శుక్రవారం విడుదల చేశారు.

పాట చాలా బాగుందంటూ ఈ సందర్భంగా వారు చిత్రబృందాన్ని అభినందించారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ ఎంటరై్టనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల రిలీజ్‌ చేసిన తొలి పాట ‘ఏమైందో మనసా...’ కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ లభించింది. ఈ చిత్రం నైజాం రైట్స్‌ను ఏషియన్‌ సంస్థ సొంతం చేసుకుంది. జూలై 20న విడుదల కానున్న ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నరేష్‌ రానా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement