
సునీల్
శర్వానంద్, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పడి పడి లేచే మనసు’. ‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ వంటి సెన్సిబుల్ ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించిన హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో సునీల్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. తొలి షెడ్యూల్ పూర్తయింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండవ షెడ్యూల్ జరుగుతోంది. సునీల్ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నారు. నేటి నుంచి ఆయన షూటింగ్‌లో పాల్గొంటారు. శర్వానంద్, సాయి పల్లవి, సునీల్, ‘వెన్నెల’ కిశోర్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఇటీవల విడుదలైన శర్వానంద్, సాయి పల్లవిల ఫస్ట్ లుక్‌కి విశేష స్పందన వచ్చింది’’ అన్నారు. సునీల్ ఉన్నారంటే కచ్చితంగా ప్రేక్షకులు పడి పడి నవ్వుకోవడం ఖాయం అని ఊహించవచ్చు. మురళీశర్మ, ప్రియా రామన్, కల్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జయకృష్ణ గుమ్మడి.
Comments
Please login to add a commentAdd a comment