ఈ మాయ ఏమిటో! | Sarvanand, nitya menon in "emito ii maya" | Sakshi
Sakshi News home page

ఈ మాయ ఏమిటో!

Published Wed, Oct 9 2013 12:32 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM

ఈ మాయ ఏమిటో!

ఈ మాయ ఏమిటో!

‘ఏమిటో ఈ మాయ...’ ఈ మధురాక్షరాలు చెవిన పడగానే... పండు వెన్నెల్లో విహరిస్తున్న ఫీలింగ్.  పింగళి వారి పెన్నా మజాకా. ఆ కలం నుంచి జాలువారిన ఎన్నో పదాలు సినిమా టైటిల్స్ అయిపోయాయి. అవ్వడమేకాదు... విజయాలను కూడా అందుకున్నాయి. ఆ సెంటిమెంట్‌నే నమ్ముకొని మరో సినిమా వచ్చేస్తోంది.
 
అదే... ‘ఏమిటో ఈ మాయ’. శర్వానంద్, నిత్యామీనన్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి  చేరన్ దర్శకుడు. తమిళంలో ‘ఆటోగ్రాఫ్’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన చేరన్ ఈ సినిమాను యువతరం మెచ్చేలా తెరకెక్కిస్తున్నారు. 
 
ప్రతిష్టాత్మక స్రవంతి మూవీస్ పతాకంపై పి.రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలలో పాటల్ని, వచ్చే నెలలో సినిమాను విడుదల చేయనున్నట్లు రవికిషోర్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జీవి ప్రకాష్‌కుమార్, పాటలు: అనంత శ్రీరామ్, సమర్పణ: కృష్ణచైతన్య.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement