Siddharth, Aditi Rao Hydari Attends Sharwanand-Rakshita Reddy Engagement - Sakshi
Sakshi News home page

Siddharth-Aditi Rao Hydari: డేటింగ్‌ రూమర్స్‌.. శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌లో జంటగా సిద్ధార్థ్‌, అదితి!

Published Thu, Jan 26 2023 8:49 PM | Last Updated on Fri, Jan 27 2023 8:53 AM

Hero Siddharth Attends Sharwanand Engagement With Aditi Rao Hydari - Sakshi

హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్‌ అదితి రావ్‌ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, వెకేషన్స్‌కి వెళ్లడి,  సినిమా ఈవెంట్స్‌కి కలిసి హజరవుతుండటంతో తరచూ ఈ జంట వార్తల్లో నిలుస్తుంది. అయితే ఇంత వరకు డేటింగ్‌ రూమర్స్‌పై ఈజంట క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరు జంటగా ఓ యంగ్‌ హీరో నిశ్చితార్థం వేడుక సందడి చేశారు. కాగా టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డి అనే అమ్మాయితో నేడు శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరిగింది.

చదవండి: డాడీ నా వల్ల కావడం లేదు.. ప్లీజ్‌ తిరిగి రా: రీతూ చౌదరి ఆవేదన

ఈ వేడుకలో రామ్‌ చరణ్‌, నాగార్జునతో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు సతీసమేతంగా హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. అలాగే హీరో సిద్ధార్థ్‌ కూడా తన రూమార్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ అదితి రావ్‌ హైదరితో కలిసి హజరయ్యాడు. ఈ కొత్త జంటతో వీరిద్దరు తీసుకున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో వీరి డేటింగ్‌ రూమర్స్‌ మరోసారి వార్తల్లో నిలిచాయి. కాగా ఇండస్ట్రీలో సిద్ధార్థ్‌, శర్వానంద్‌లు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. శర్వా, సిద్ధార్థ్‌ల కాంబినేషన్‌లో సముంద్రం అనే మూవీ రాగా అందులో అదితి హీరోయిన్‌గా నటించింది. 

చదవండి: ఘనంగా శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. హాజరైన రామ్‌చరణ్‌ దంపతులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement