‘సమ్మోహనం’ మూవీలో తన అందం, అభియనంతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్ అదితీరావు హైదరీ తాజాగా వార్తల్లో నిలిచారు. తన మాజీ భర్త పోస్టుకు ఆమె పెట్టిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎనిమిదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుని విడిగా ఉంటున్న ఆమె తాజాగా మాజీ భర్త ఇన్‌స్టా పోస్టుపై స్పందించడంతో అది కాస్తా చర్చనీయాంశంగా మారింది. కాగా అదితీ మాజీ భర్త సత్యదీప్ మిశ్రా తన పెట్ డాగ్‌తో సరదాగా ఆడుకుంటు సోఫాలో వాలిన ఫొటోను షేర్ చేశాడు. దానికి అదితీ ‘ఊఫ్..’ అంటూ క్రేజీగా షాట్ కామెంట్‌తో స్పందించింది. అది చూసి నెటిజన్లు ఆమె కామెంట్‌పై తమదైన శైలిలో చర్చించుకుంటున్నారు.
కాగా ఆదితీరావు హైదరీ 2009లో బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత మనస్పర్థలతో 2013లో భర్తతో విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం సత్యదీప్ తన సహానటి, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మాసాబా గుప్తాతో రిలేషన్‌లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తుండగా... అదితీ మాత్రం సింగిల్ లైఫ్ లీడ్ చేస్తోంది. చివరగా నాని ‘వీ’ సినిమాలో నటించిన అదితీ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తోన్న మహా సముద్రంలో కథానాయిగా కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment