
అదితీరావ్ హైదరీ
‘‘స్కూల్‌లో కొన్నిసార్లు ఫార్ములాస్‌తో ఇబ్బంది పడుతుంటాం. కొన్నిసార్లు గట్టెక్కడానికి బట్టీ పట్టేసి ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవ్వకుండా బయటపడుతుంటాం. ప్రస్తుతం నేను అదే టెక్నిక్‌ని ఉపయోగిస్తున్నాను’’ అంటున్నారు అదితీరావ్ హైదరీ. పరభాష హీరోయిన్లు తెలుగులో నటించినప్పుడు డైలాగులు చెప్పడానికి ఇబ్బంది పడతారు.
ఈ సవాల్‌ని ఎలా ఎదుర్కొన్నారు? అని అదితీని అడగ్గా – ‘‘యాక్టర్‌గా చాలెంజ్‌లని ప్రేమిస్తాను. నా కంఫర్ట్ జోన్ నుంచి నన్ను బయటకు తీసుకెళ్లే ఏ పనైనా ఇష్టమే. కొత్త భాషలని త్వరగా నేర్చుకోవడం కొంచెం ఇబ్బందే. యాక్చువల్లీ ఎంత పెద్ద డైలాగ్స్ అయినా బట్టీ పట్టగలను. లిప్ సింక్‌తో ఇబ్బంది పడకుండా చూసుకోగలను. ప్రస్తుతానికి డబ్బింగ్ కూడా చెప్పుకోగలుగుతున్నాను. త్వరలోనే అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంటాను’’ అన్నారు. అదితీ నటించిన ‘సమ్మోహనం’ ఈ నెల 15న రిలీజ్ కానుంది.