కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒక్కసారి అయినా ఆ రెడ్ కార్పెట్‌పై నడవాలని ప్రతి హీరోయిన్‌కు కోరిక ఉంటుంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన హీరోయిన్లు, డిజైనర్లు కేన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. అయితే తాజాగా అదితిరావు హైదరి మెరిసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హైదరాబాదీ ముద్దుగుమ్మ అదితిరావు హైదరి కేన్స్ రెడ్ కార్పెట్‌పై అదిరిపోయే లుక్‌లో కనిపించింది. హాఫ్ షోల్డర్ వైట్ అండ్ బ్లాక్ ఔట్‌ఫిట్‌తో ఆమె సందడి చేశారు. ప్యాషన్ ప్రపంచం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ వేడుకల్లో ఇప్పటికే ఐశ్వర్యరాయ్, శోభిత ధూళిపాళ, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ లాంటి తారలు తళుక్కున మెరిసి ఆకర్షించారు.
వైట్ అండ్ బ్లాక్ ఔట్‌ఫిట్‌తో ఆ రెడ్ కార్పెట్‌పై అదితిరావు హైదరి నడుస్తుంటే అక్కడ కెమెరామెన్‌లతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ నటించిన హీరామండి వెబ్ సిరీస్ మంచి టాక్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతుంది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌లో ఆమె గూడఛారిగా మెప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment