‘‘నా తొలి సినిమా ‘ఎస్‌ఎంఎస్’ రిలీజ్‌కి ఓ వారం ముందు ఇంద్రగంటిగారితో ఓ సినిమా చేద్దామనుకున్నా. ఓ ప్రొడక్షన్ హౌస్‌తో సైన్ కూడా అయింది. కానీ టేకాఫ్ కాలేదు. అవసరాల శ్రీనివాస్ కథతో ఇంద్రగంటిగారు డైరెక్ట్ చేసేట్టు అనుకున్నారు. ఆ సినిమానే ‘ఊహలు గుసగుసలాడే’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. ఆయన హీరోగా, అదితీరావు హైదరీ హీరోయిన్‌గా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు పంచుకున్న విశేషాలు...
∙ఇంద్రగంటిగారు ఒకరోజు ఫోన్ చేసి ‘సమ్మోహనం’ స్క్రిప్ట్ వినమన్నారు. నచ్చింది, చేశా. ఈ చిత్రంలో నా పేరు విజయ్. చిల్డ్రన్స్ బుక్స్ ఇల్లస్ట్రేటర్‌గా కనిపిస్తాను. విజయ్‌కి సినిమా ఇండస్ట్రీ మీద, స్టార్స్ మీద కొన్ని అభిప్రాయాలుంటాయి. అదితీరావు ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా నటించారు. మేమిద్దరం ఎలా కనెక్ట్ అయ్యామన్నదే ఈ సినిమా. నా పాత్ర చాలెంజింగ్‌గా అనిపించింది. ఓ కామన్ ఆడియన్ డౌట్స్‌ని ఆన్‌స్క్రీన్‌పై డిస్కస్ చేస్తున్నట్టు ఉంటుంది.
∙ఇంద్రగంటిగారు తెరకెక్కించిన ప్రాపర్ లవ్‌స్టోరీ ‘అంతకు ముందు ఆ తర్వాత’. కానీ, ‘సమ్మోహనం’ వంటి ఇంటెన్స్ లవ్ స్టోరీ ఆయన ఇప్పటిదాకా చేయలేదు. ఇలాంటి లవ్‌స్టోరీ రాలేదు. ‘ఏమాయ చేసావె’ కూడా వేరు.‘సమ్మోహనం’లో ఫన్, రొమాన్స్ ఉంటుంది. ఈ చిత్రంలో హరీశ్ శంకర్, అవసరాల శ్రీనివాస్, తరుణ్ భాస్కర్‌గారు మాత్రమే గెస్ట్ రోల్స్ చేశారు. హీరోలెవరూ చేయలేదు.
∙ఈ సినిమా సెట్స్‌కి ఫ్రెండ్స్‌ని పిలిచేవాణ్ణి. ఇంద్రగంటిగారి సినిమాల్లో యాక్టరే కింగ్. యాక్టర్ కూర్చోవచ్చు. నిలబడొచ్చు. యాక్టర్ మంచి మూడ్‌లో ఉంటే దాన్ని గమనించి ఇంద్రగంటిగారు సినిమా చేస్తారు. అంతేగానీ కెమెరాను సెట్ చేసుకుని ‘యాక్టర్‌ని పిలవండయ్యా’ అని చెప్పరు.
. శివలెంక కృష్ణప్రసాద్‌గారు చూడ్డానికి తెల్లగా ఉంటారు. అంతే స్వచ్ఛంగానూ ఉంటారు. భవిష్యత్తులోనూ ఆయనతో సినిమా చేయాలని ఉంది. బాలీవుడ్ నటులు షూట్‌లో ప్రొనౌన్స్ కూడా సరిగా చేయలేరు. కానీ, అదితీ చాలా స్పష్టంగా తెలుగు నేర్చుకుని వచ్చేది. డబ్బింగ్ కూడా చెప్పింది.
∙మన చుట్టూ చాలామంది ప్రతిభావంతులున్నారు. కొరియోగ్రాఫర్లు, పాటలు రాసేవాళ్లు, నటీనటులు... ఎంతో టాలెంట్ ఉండి కూడా ఇక్కడ అవకాశాల కోసం తిరగలేక వెళ్లిపోయిన వాళ్లున్నారు. నేను ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తే బావుంటుందనిపించి చేశా. చాలా మంది వచ్చి కలుస్తూనే ఉన్నారు.
∙ప్రవీణ్ సత్తార్‌గారి దర్శకత్వంలో చేయనున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతుంది. నా తర్వాతి సినిమా మా సంస్థలోనే ఉంటుంది. ఆర్.ఎస్.నాయుడుని దర్శకునిగా పరిచయం చేస్తున్నా. మా బ్యానర్‌లో మహేశ్‌తో సినిమా చేసే అవకాశం ఉంది. మంచి కథ ఉంటే ఇంద్రగంటిగారి దర్శకత్వంలో మహేశ్‌తో సినిమా చేస్తే చాలా బావుంటుంది’’ అంటున్న సుధీర్‌తో ‘మీ వాయిస్‌లో మెచ్యూరిటీ కనిపిస్తోంది’ అంటే.. ‘‘వాయిస్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నా. మానేస్తే మళ్లీ పీలగా మారిపోతుంది’’ అన్నారు నవ్వేస్తూ.
మహేశ్‌తో సినిమా ఉంటుంది
Published Wed, Jun 13 2018 12:39 AM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment