
సుధీర్‌బాబు, అదితీ రావ్
కొత్త.. ఈ పదం రోజూ విన్నా కొత్తగానే ఉంటుంది. ప్రేమ అనే పదం కూడా అలాంటిదే. తరతరాలుగా, యుగయుగాలుగా మానవాళికి ‘ప్రేమ’తో పరిచయం ఉంది. ప్రేమ విలువ, ప్రేమలోని మాధుర్యం వంటి విషయాలను ప్రస్తావిస్తూ కొత్తతరం ప్రేమ కథతో రూపొందిన చిత్రం ‘సమ్మోహనం’. సుధీర్‌బాబు, అదితీరావ్ హైదరీ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ‘సమ్మోహనం’ షూటింగ్ పూర్తయింది. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా షూటింగ్ సుముహూర్తంలో ప్రారంభించడంతో నిర్విఘ్నంగా చిత్రీకరణ పూర్తిచేశాం.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాం. త్వరలో టీజర్ విడుదల చేస్తాం. జూన్ 15న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. వివేక్ సాగర్ పాటలు శ్రోతలను మెప్పిస్తాయి. ఈ చిత్రం తప్పక ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రొమాన్స్, హాస్యం సమ్మిళితమైన చిత్రం ‘సమ్మోహనం’. అనూహ్యమైన కథాంశంతో, ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే కథతో తెరకెక్కించాం. నిర్మాణ విలువలు మెప్పిస్తాయి. పీజీ విందా ఫొటోగ్రఫీ చిత్రానికి హైలైట్’’ అన్నారు మోహనకృష్ణ ఇంద్రగంటి.
Comments
Please login to add a commentAdd a comment