ఆమె నటనకు ఇంప్రెస్‌ అయ్యా : రాజమౌళి | Rajamouli Impressed For Sammohanam And Ee Nagaraniki Emaindi | Sakshi
Sakshi News home page

లేటుగా చూసి.. ఇంప్రెస్‌ అయ్యా : రాజమౌళి

Published Fri, Jun 29 2018 4:53 PM | Last Updated on Sun, Jul 14 2019 4:08 PM

Rajamouli Impressed For Sammohanam And Ee Nagaraniki Emaindi - Sakshi

హైదరాబాద్‌ : దర్శక దిగ్గజం ఎస్‌ఎస్‌. రాజమౌళి రెండు సినిమాలపై ప్రశంసల జల్లులు కురిపించారు. అందులో ఒకటి సమ్మోహనం కాగా, మరో మూవీ నేడు విడుదలైన ఈనగరానికి ఏమైంది. ఇటీవల విడుదలై హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న సమ్మోహనం మూవీని కాస్త ఆలస్యంగా చూశాను. కానీ ఇంప్రెస్‌ అయ్యాను. సుధీర్‌ బాబు, అదితి రావు హైదరీ నటన ఆకట్టుకుంది. సీనియర్‌ నటుడు నరేష్ అద్భుతంగా చేశారు. మూవీ యూనిట్‌కు కంగ్రాట్స్‌ అని రాజమౌళి ట్వీట్‌ చేశారు. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన సమ్మోహనం మూవీకి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు.

పెళ్లి చూపులు మూవీతో టాలీవుడ్‌లో తనదైన ట్రెండ్‌ సృష్టించిన యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చూసి తరుణ్‌ను రాజమౌళి మెచ్చుకున్నారు. మంచి కామెడీ ఉంది. మూవీ యూనిట్‌కు అభినంనలు అంటూ’ మరో ట్వీట్‌ చేశారు రాజమౌళి.

   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement