అతిథి రావ్ హైదరీ : ఖిల్జీ భార్య మెహరున్నీసా
‘పద్మావత్’ చిత్రంలో పద్మావతి కోసం అల్లావుద్దీన్ ఖిల్జీ.. ఢిల్లీలో తన రాజ్యాన్ని వదిలేసి చిత్తోడ్‌ఘడ్ చేరుకుని అక్కడి ఎడారిలో గుడారం వేసుకుని కూర్చుంటాడు! ‘తలుపు మూసిన తలవాకిటనే పగలూ రేయీ కూర్చున్నా..’ అని 1978 నాటి ‘ఇంద్రధనస్సు’ సినిమాలో కృష్ణ పాడతాడు కదా, శారద కోసం.. అలా ఇక్కడ ఖిల్జీ.. పద్మావతి కోసం అలమటిస్తుంటాడు. అతడి కళ్లు చెమ్మగిల్లుతాయి కూడా. ‘ఏంటి అంతటివాడికి ఇంత ఖర్మ?’ అని అనిపిస్తుంది ప్రేక్షకులకు.
‘పద్మావతంత అపురూపమైన మానవ స్త్రీ ఈ భువిలో లేదని’.. నమ్మకద్రోహి అయిన చిత్తోడ్‌ఘడ్ రాజగురువు ఢిల్లీ వెళ్లి ఖిల్జీకి చెప్పి, అతడిని రెచ్చగొట్టడంతో ఆ మాయలో పడిపోతాడు ఖిల్జీ! అతడి భార్య మెహరున్నీసా కూడా అందాలరాశే. అంత అందాన్ని కళ్లెదుట పెట్టుకుని, వేరే రాజ్యపు స్త్రీ కోసం ఖిల్జీ పాకులాడటం కూడా ఆడియన్స్‌కి అతడిపై గౌరవాన్ని తగ్గిస్తుంది. సినిమా చూస్తున్నవారికి హాల్లోంచి ఒక మాట తప్పనిసరిగా వినిపిస్తుంది. ‘అరె.. ఈవిడ కూడా అందంగా ఉంది కదా. ఖిల్జీకి ఇదేం పోయేకాలం?’ అని! ఖిల్జీ భార్యగా అతిథి రావ్ హైదరీ నటించారు. నిజంగానే ఆమె దీపికా పదుకోన్‌కి దీటుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment