
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించటంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమిళనాడు రాజకీయ ముఖచిత్రమే మారిపోనుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నో ఏళ్లుగా అభిమానులను, రాజకీయ పక్షాలను ఊరించిన సూపర్‌స్టార్ త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో వెండితెర మీద రజనీకి నీరాజనాలు పట్టిన జనం రాజకీయాల్లోనూ ఆదరిస్తారా అన్న చర్చ మొదలైంది. రజనీ అంటేనే స్టైల్. ఆయన బాడీ లాంగ్వేజ్ తో పాటు డైలాగ్ డెలివరీకి దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. రజనీ కూడా తన సినిమాల్లో రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన పంచ్ డైలాగ్‌లను బాగానే పేల్చారు. మరి ఆ పంచ్ డైలాగ్స్ ఇప్పుడు పని చేస్తాయా.. వెండితెర మీద కాసులు కురిపించిన.. రజనీ మార్క్ డైలాగ్స్ ఓటర్లను ప్రభావితం చేస్తాయా..? ఈ సందర్భంగా అభిమానులను ఉర్రూతలూంగించిన రజనీ పంచ్ డైలాగ్స్ ను ఓసారి గుర్తు చేసుకుందాం..
- కష్టపడందే ఏదీ రాదు.. కష్టపడుకుండా వచ్చింది ఏదీ ఉండదు
- నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే
- ఒక పిరికివాడితో యుద్ధం చేయటం నాకు.. మానిక్ భాషాకి నచ్చదు
- దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటిస్తాడు
- నాయకుడికి బంధం, బంధుత్వం ఒక్కటే.. ఒప్పు చేసిన వాడు బంధువు, తప్పు చేసిన వాడు శత్రువు
- నా దారి... రహదారి
- అతిగా ఆశపడే మగవాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు
- ధనం అంతా నీ దగ్గరే ఉంటే మనఃశాంతి ఎలా ఉంటది.. ఏదో నీకు కావల్సినంత ఉంచుకొని మిగిలింది దానం చేస్తే మనఃశాంతి దక్కుతుంది
- నాన్న పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది
- తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత
- పుట్టుకతో వచ్చింది.. ఎన్నటికీ పోదు
- పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు.. పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లరు.. ఇంకా దేనికయ్యా నీదీ నాదీ అనే స్వార్థం
Comments
Please login to add a commentAdd a comment