ప్రేమిస్తే ప్రాణమిస్తా.. ఈ మాట జూనియర్ ఎన్టీఆర్‌కు బాగా సూటవుతుంది. సినిమాను ఎంతలా ప్రేమిస్తాడంటే దానికోసం ఏమైనా చేస్తాడు, ఎక్కడివరకైనా వెళ్తాడు. తన ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడడు. అందుకే అతడికి ఈ రేంజ్‌లో ఫాలోయింగ్.. మాస్ ఫాలోయింగ్‌లో తారక్ తరువాతే ఎవరైనా అన్నంతగా అభిమానులను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఆయన పేరు చెప్తే చాలు అభిమానులు పూనకంతో ఊగిపోతారు. ఆయన నోటి నుంచి డైలాగ్స్ వస్తే విజిల్స్ వేస్తూ రెచ్చిపోతారు! నేడు(మే 20న) తారక్ బర్త్‌డే.. ఈ సందర్భంగా ఆయన సినిమాల్లోని పవర్‌ఫుల్ డైలాగ్స్‌లో కొన్నింటిని ఓసారి చూసేద్దాం..
(ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి ఏంటీ? )
ఆది
అమ్మతోడు అడ్డంగా నరికేస్తా
సాంబ
నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావ్, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావ్, ఈ సాంబతో పెట్టుకుంటే చచ్చిపోతావ్
సింహాద్రి
పదిమంది చల్లగా ఉండటం కోసం నేను చావడానికైనా, చంపడానికైనా సిద్ధం
యమదొంగ
రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో.. చూస్కో.. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకోవచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది.
బృందావనం
సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్‌గా లవర్ బాయ్‌లా ఉన్నాడనుకుంటున్నావేమో.. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటకు తెచ్చావనుకో.. రచ్చ రచ్చే!
ఊసరవెల్లి
కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా.. కానీ టచ్ చేస్తే దానమ్మ షాకే.. సాలిడ్‌గా ఉంటుంది
దమ్ము
బతకండి.. బతకండి అంటే వినలేదు కదరా.. కోత మొదలైంది, రాత రాసిన భగవంతుడు వచ్చినా ఆపలేడు చరిత్ర చరిత్ర అని నీలిగావు. గేటు దగ్గర మొదలుపెడితే గడప దగ్గరికి వచ్చేసరికి ముగిసిపోయింది నీ చరిత్ర. పట్టుమని పది నిమిషాలు పట్టలేదు నాకు. అదే, నేను ఓ గంట కాన్సంట్రేషన్ చేస్తే.. ఏమీ మిగలదు
బాద్‌షా
బాద్‌షాను టచ్ చేస్తే సౌండ్ సాలిడ్‌గా ఉంటుంది. పిచ్ నీదైనా మ్యాచ్ నాదే.. బాద్‌షా డిసైడ్ అయితే వార్ వన్‌సైడ్ అయిపోద్ది. భయపడేవాడు బానిస- భయపెట్టేవాడు బాద్‌షా
టెంపర్
ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. అదే దయాగాడి దండయాత్ర నా పేరు దయ, నాకు లేనిదే అది! ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుంది. యూజర్ నేమ్ దయ, పాస్‌వర్డ్ పోలీస్. దమ్ముంటే నా వైఫై దాటి రండ్రా..
జనతా గ్యారేజ్
బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఎ చేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్..
ఇవి మాత్రమే కాకుండా ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట? ఎంత మాట?..., రేయనక, పగలనక, ఎండనక, వాననకా.., ఆఫ్ట్రాల్ కాదు సర్... ఇలా గుక్క తిప్పకుండా చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్ మరెన్నో ఉన్నాయి. మరి తారక్ డైలాగ్స్‌లో మీకు ఏది ఇష్టమో కామెంట్ బాక్స్‌లో చెప్పండి.
Comments
Please login to add a commentAdd a comment