NTR Birthday celebrations
-
ఆ డైలాగ్స్ వింటే చాలు.. పూనకాలు పుట్టుకొచ్చేస్తాయి!
ప్రేమిస్తే ప్రాణమిస్తా.. ఈ మాట జూనియర్ ఎన్టీఆర్‌కు బాగా సూటవుతుంది. సినిమాను ఎంతలా ప్రేమిస్తాడంటే దానికోసం ఏమైనా చేస్తాడు, ఎక్కడివరకైనా వెళ్తాడు. తన ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడడు. అందుకే అతడికి ఈ రేంజ్లో ఫాలోయింగ్.. మాస్ ఫాలోయింగ్‌లో తారక్ తరువాతే ఎవరైనా అన్నంతగా అభిమానులను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఆయన పేరు చెప్తే చాలు అభిమానులు పూనకంతో ఊగిపోతారు. ఆయన నోటి నుంచి డైలాగ్స్ వస్తే విజిల్స్ వేస్తూ రెచ్చిపోతారు! నేడు(మే 20న) తారక్ బర్త్‌డే.. ఈ సందర్భంగా ఆయన సినిమాల్లోని పవర్ఫుల్ డైలాగ్స్‌లో కొన్నింటిని ఓసారి చూసేద్దాం.. (ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి ఏంటీ? ) ఆది అమ్మతోడు అడ్డంగా నరికేస్తా సాంబ నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావ్, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావ్, ఈ సాంబతో పెట్టుకుంటే చచ్చిపోతావ్ సింహాద్రి పదిమంది చల్లగా ఉండటం కోసం నేను చావడానికైనా, చంపడానికైనా సిద్ధం యమదొంగ రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో.. చూస్కో.. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకోవచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది. బృందావనం సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్‌గా లవర్ బాయ్‌లా ఉన్నాడనుకుంటున్నావేమో.. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటకు తెచ్చావనుకో.. రచ్చ రచ్చే! ఊసరవెల్లి కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా.. కానీ టచ్ చేస్తే దానమ్మ షాకే.. సాలిడ్‌గా ఉంటుంది దమ్ము బతకండి.. బతకండి అంటే వినలేదు కదరా.. కోత మొదలైంది, రాత రాసిన భగవంతుడు వచ్చినా ఆపలేడు చరిత్ర చరిత్ర అని నీలిగావు. గేటు దగ్గర మొదలుపెడితే గడప దగ్గరికి వచ్చేసరికి ముగిసిపోయింది నీ చరిత్ర. పట్టుమని పది నిమిషాలు పట్టలేదు నాకు. అదే, నేను ఓ గంట కాన్సంట్రేషన్ చేస్తే.. ఏమీ మిగలదు బాద్షా బాద్షాను టచ్ చేస్తే సౌండ్ సాలిడ్‌గా ఉంటుంది. పిచ్ నీదైనా మ్యాచ్ నాదే.. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్‌సైడ్ అయిపోద్ది. భయపడేవాడు బానిస- భయపెట్టేవాడు బాద్షా టెంపర్ ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. అదే దయాగాడి దండయాత్ర నా పేరు దయ, నాకు లేనిదే అది! ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుంది. యూజర్ నేమ్ దయ, పాస్వర్డ్ పోలీస్. దమ్ముంటే నా వైఫై దాటి రండ్రా.. జనతా గ్యారేజ్ బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఎ చేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్.. ఇవి మాత్రమే కాకుండా ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట? ఎంత మాట?..., రేయనక, పగలనక, ఎండనక, వాననకా.., ఆఫ్ట్రాల్ కాదు సర్... ఇలా గుక్క తిప్పకుండా చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ మరెన్నో ఉన్నాయి. మరి తారక్ డైలాగ్స్‌లో మీకు ఏది ఇష్టమో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. -
విజయవాడ చేరుకున్న రజనీకాంత్‌కు ఘన స్వాగతం
సాక్షి, విజయవాడ: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడ చేరుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు ఆయన విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం.. గన్నవరం విమానాశ్రయంలో నందమూరి బాలకృష్ణ, టీడీ జనార్ధన్, సావనీర్ కమిటీ రజనీకాంత్‌కు ఘన స్వాగతం పలికారు. నేడు సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సభ జరగనుంది. ఈ వేదికపై ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలను ఈ పుస్తకాల్లో పొందుపరిచారు. చదవండి: ఫిలింఫేర్ అవార్డులు.. ఉత్తమ నటి, దర్శకుడు ఎవరంటే? -
అట్లాంటాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
అట్లాంటా : అట్లాంటాలో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు 94వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పెర్సిస్ ఇండియన్ రెస్టారెంట్లో, ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈవేడుకల్లో నందమూరి కళ్యాణ్ రామ్ పాల్గొన్నారు. ముందుగా రాజేష్ జంపాల స్వాగతోపన్యాసం చేయగా, నందమూరి కళ్యాణ్ రామ్, తానా పూర్వ అధ్యక్షులు వడ్లమూడి రామ్మోహనరావులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ని గుర్తు చేసుకుంటూ ఒక ప్రత్యేక వీడియోని ప్రదర్శించారు. నందమూరి కళ్యాణ్ రామ్ తన తాత నందమూరి తారక రామారావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే తన విద్యాభ్యాసం, కుటుంబ జీవితం, సినిమాల గురించి సభికులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఎంతో ఓర్పుగా సమాధానాలు ఇచ్చారు. చివరిగా తెలుగు వారందరు కలిసి మెలిసి ఉండి ఒకరికొకరు సహాయం చేసుసుకోవాలని సూచించారు. అనంతరం జోహార్ ఎన్టీఆర్ నినాదాల నడుమ కళ్యాణ్ రామ్ కేక్ కట్ చేసి అభిమానులకు, ఆడపడుచులకు స్వయంగా కేక్ అందించారు. ఈ సందర్భంగా నరేంద్ర సూరపనేని ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రతిష్టించేందుకు కృషి చేయాలని కళ్యాణ్ రామ్‌ని కోరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా సభ్యుల కోరిక మేరకు ఎన్టీఆర్ జయంతి వేడుకలకు విచ్చేసిన కళ్యాణ్ రామ్‌కి మురళి బొడ్డు పుష్ఫగుచ్ఛం అందజేయగా, శ్రీనివాస్ లావు అంజయ్య చౌదరి లావు శాలువాతో సత్కరించారు. అలాగే బాలా రెడ్డి ఇందుర్తి, షీలా లింగం, సుబ్బారావు మద్దాళి, సుధాకర్ వల్లూరుపల్లి, శ్రీనివాస్ కడియాల, ప్రభాకరరావు కడియాల తదితరులు ఎన్టీఆర్ పుట్టుపూర్వోత్తరాలు, సినీ జీవితం, రాజకీయ ప్రవేశం, ముఖ్యమంత్రిగా పేదలకోసం ప్రారంభించిన ప్రజాహిత కార్యక్రమాల గురించి ప్రసంగించారు. తర్వాత వెంకీ గద్దె ప్రసంగిస్తూ 2008 లో ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా తరపున ఎన్టీఆర్ జయంతి వేడుకలు మొట్టమొదటిసారి ప్రారంభించగా, ప్రతి సంవత్సరం అప్రతిహాతంగా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఈ ఏడాది 10వ వేడుకలు కావడం అందులోనూ నందమూరి వారసులు కళ్యాణ్ రామ్ పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే తమ ఆహ్వానాన్ని మన్నించి కళ్యాణ్ రామ్‌ని తీసుకువచ్చిన చక్రి సూరపనేనికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించిన ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు అనిల్ యలమంచిలి, వినయ్ మద్దినేని, వెంకట్ అడుసుమిల్లి, భరత్ మద్దినేని, శ్రీహర్ష యెర్నేని, మల్లిక్ మేదరమెట్ల, ఉపేంద్ర నర్రా, శ్రీనివాస్ నిమ్మగడ్డ, విజయ్ కొత్తపల్లి, పెర్సిస్ రెస్టారెంట్ యజమానులు శ్రీధర్ దొడ్డపనేని, మిత్రులు బిల్హన్ ఆలపాటి, శ్రీనివాస్ రాయపురెడ్డి, మధు యార్లగడ్డ, వెంకట్ మీసాల, రాజు మందపాటి, అనిల్ కొల్లి, గిరి సూర్యదేవర, ఇన్నయ్య ఎనుముల, చవన్ కోయ, హేమంత్ వర్మ పెన్మెత్స, రామ్ మద్ది, మహేష్ పవార్, తిరు చిలపల్లి, ప్రణీత్ కావూరి, మురళి కిలారు, బాలనారాయణ మడ్డ, శ్రీనివాస్ గుంటక, విశాల్ మాదల, ప్రశాంత్ కొల్లిపర, శ్రీకాంత్ పుట్టి తదితరులకు వెంకీ గద్దె కృతజ్ఞతలు తెలిపారు.