అట్లాంటాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు | NTR Birthday celebrations in Atlanta | Sakshi
Sakshi News home page

అట్లాంటాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

Published Mon, Jun 12 2017 4:46 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

అట్లాంటాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

అట్లాంటాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

అట్లాంటా :
అట్లాంటాలో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు 94వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పెర్సిస్ ఇండియన్ రెస్టారెంట్లో, ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈవేడుకల్లో నందమూరి కళ్యాణ్ రామ్ పాల్గొన్నారు. ముందుగా రాజేష్ జంపాల స్వాగతోపన్యాసం చేయగా, నందమూరి కళ్యాణ్ రామ్, తానా పూర్వ అధ్యక్షులు వడ్లమూడి రామ్మోహనరావులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ని గుర్తు చేసుకుంటూ ఒక ప్రత్యేక వీడియోని ప్రదర్శించారు. నందమూరి కళ్యాణ్ రామ్ తన తాత నందమూరి తారక రామారావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే తన విద్యాభ్యాసం, కుటుంబ జీవితం, సినిమాల గురించి సభికులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఎంతో ఓర్పుగా సమాధానాలు ఇచ్చారు. చివరిగా తెలుగు వారందరు కలిసి మెలిసి ఉండి ఒకరికొకరు సహాయం చేసుసుకోవాలని సూచించారు.

అనంతరం జోహార్ ఎన్టీఆర్ నినాదాల నడుమ కళ్యాణ్ రామ్ కేక్ కట్ చేసి అభిమానులకు, ఆడపడుచులకు స్వయంగా కేక్ అందించారు. ఈ సందర్భంగా నరేంద్ర సూరపనేని ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రతిష్టించేందుకు కృషి చేయాలని కళ్యాణ్ రామ్ని కోరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా సభ్యుల కోరిక మేరకు ఎన్టీఆర్ జయంతి వేడుకలకు విచ్చేసిన కళ్యాణ్ రామ్కి మురళి బొడ్డు పుష్ఫగుచ్ఛం అందజేయగా, శ్రీనివాస్ లావు అంజయ్య చౌదరి లావు శాలువాతో సత్కరించారు.

అలాగే బాలా రెడ్డి ఇందుర్తి, షీలా లింగం, సుబ్బారావు మద్దాళి, సుధాకర్ వల్లూరుపల్లి, శ్రీనివాస్ కడియాల, ప్రభాకరరావు కడియాల తదితరులు ఎన్టీఆర్ పుట్టుపూర్వోత్తరాలు, సినీ జీవితం, రాజకీయ ప్రవేశం, ముఖ్యమంత్రిగా పేదలకోసం ప్రారంభించిన ప్రజాహిత కార్యక్రమాల గురించి ప్రసంగించారు. తర్వాత వెంకీ గద్దె ప్రసంగిస్తూ 2008 లో ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా తరపున ఎన్టీఆర్ జయంతి వేడుకలు మొట్టమొదటిసారి ప్రారంభించగా, ప్రతి సంవత్సరం అప్రతిహాతంగా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఈ ఏడాది 10వ వేడుకలు కావడం అందులోనూ నందమూరి వారసులు కళ్యాణ్ రామ్ పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే తమ ఆహ్వానాన్ని మన్నించి కళ్యాణ్ రామ్ని తీసుకువచ్చిన చక్రి సూరపనేనికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించిన ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు అనిల్ యలమంచిలి, వినయ్ మద్దినేని, వెంకట్ అడుసుమిల్లి, భరత్ మద్దినేని, శ్రీహర్ష యెర్నేని, మల్లిక్ మేదరమెట్ల, ఉపేంద్ర నర్రా, శ్రీనివాస్ నిమ్మగడ్డ, విజయ్ కొత్తపల్లి, పెర్సిస్ రెస్టారెంట్ యజమానులు శ్రీధర్ దొడ్డపనేని, మిత్రులు బిల్హన్ ఆలపాటి, శ్రీనివాస్ రాయపురెడ్డి, మధు యార్లగడ్డ, వెంకట్ మీసాల, రాజు మందపాటి, అనిల్ కొల్లి, గిరి సూర్యదేవర, ఇన్నయ్య ఎనుముల, చవన్ కోయ, హేమంత్ వర్మ పెన్మెత్స, రామ్ మద్ది, మహేష్ పవార్, తిరు చిలపల్లి, ప్రణీత్ కావూరి, మురళి కిలారు, బాలనారాయణ మడ్డ, శ్రీనివాస్ గుంటక, విశాల్ మాదల, ప్రశాంత్ కొల్లిపర, శ్రీకాంత్ పుట్టి తదితరులకు వెంకీ గద్దె కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement