Rajinikanth To Attend Senior NTR Centenary Birth Anniversary Celebrations, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Rajinikanth: ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు.. విజయవాడ చేరుకున్న రజనీకాంత్‌

Published Fri, Apr 28 2023 10:22 AM | Last Updated on Fri, Apr 28 2023 1:37 PM

Rajinikanth To Attend NTR Centenary Birth Anniversary Celebrations - Sakshi

సాక్షి, విజయవాడ: తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ విజయవాడ చేరుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు ఆయన విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం.. గన్నవరం విమానాశ్రయంలో నందమూరి బాలకృష్ణ, టీడీ జనార్ధన్‌, సావనీర్‌ కమిటీ రజనీకాంత్‌కు ఘన స్వాగతం పలికారు.

నేడు సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల సభ జరగనుంది. ఈ వేదికపై ఎన్టీఆర్‌ చారిత్రక ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్‌ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలను ఈ పుస్తకాల్లో పొందుపరిచారు.

చదవండి: ఫిలింఫేర్‌ అవార్డులు.. ఉత్తమ నటి, దర్శకుడు ఎవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement