హీరో బాలకృష్ణకు పౌరాణిక పాత్రలు అంటే చాలా మక్కువ. అందులోనూ తండ్రి ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాలంటే బాలయ్యకు చాలా ఇష్టం. పలు సందర్భాల్లో బాలకృష్ణ ఆయా పౌరాణిక సినిమాల్లోని భారీ డైలాగ్స్ అవలీలగా చెప్పి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు కూడా. తాజాగా విమాన ప్రయాణంలో ఆయన చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ నటించిన ఎవర్ గ్రీన్ ‘దానవీరశూరకర్ణ’ చిత్రాన్ని ఓ ప్రయాణికుడు తన ట్యాబ్ లో వీక్షిస్తున్నాడు.