Deepika Padukone Imitates Ranveer Singh Dialogue From 83 Movie Goes Video Viral - Sakshi
Sakshi News home page

Deepika Padukone: రణ్‌వీర్‌ సింగ్‌ను ఇమిటేట్‌ చేసిన దీపికా.. ఫన్నీ వీడియో వైరల్‌

Published Sat, Jan 1 2022 6:12 PM | Last Updated on Sat, Jan 1 2022 7:39 PM

Deepika Padukone Imitates Ranveer Singh Dialogue From 83 Movie - Sakshi

Deepika Padukone Imitates Ranveer Singh Dialogue From 83 Movie: ప్రపంచం మొత్తం న్యూ ఇయర్‌ మూడ్‌లో ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరాన‍్ని స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు తమదైన శైలిలో వేడుకలు నిర్వహిస్తున్నారు. తమకు ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతున్నారు. కాగా బాలీవుడ్ పాపులర్‌ కపుల్‌ రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె కూడా న్యూ ఇయర్‌ వెకేషన్‌లో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి శుక్రవారం డిన్నర్‌ చేశారు. దీనికి సంబంధించిన ఒక ఫన్నీ వీడియోను షేర్‌ చేసుకున్నాడు రణ్‌వీర్‌ సింగ్‌. 

ఇటీవల విడుదలైన రణ్‌వీర్‌ సింగ్‌ 83 చిత్రం ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అందులో కపిల్‌ దేవ్‌ పాత్రలో అలరించిన రణ్‌వీర్‌ సింగ్‌ అద్భుత నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. సినిమాలో 'వరల్డ్‌ కప్‌ గెలవడానికి వచ్చాం' అని రణ్‌వీర్‌ సింగ్‌ చెప్పే డైలాగ్‌ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆ డైలాగ్‌ను అదే రణ్‌వీర్‌ యాసలో ఇమిటేట్‌ చేసింది దీపికా. క్యూట్‌గా ఇమిటేట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో 'హావింగ్ ఫన్‌ బేబీ' అని రణ్‌వీర్ అడగ్గా.. 'వీ హియర్‌ టు ఎంజాయ్‌.. వాట్‌ ఎల్స్‌ వి హియర్‌ ఫర్‌ (మేము ఇక్కడికి వచ్చిందే ఎంజాయ్‌ చేయడానికి. ఇక్కడికి ఇంకా దేనికి వచ్చాం)' అని రణ్‌వీర్‌ యాసలో దీపికా అనడం నవ్వు తెప్పిస్తోంది.
 

రణ్‌వీర్‌-దీపికా జంట వెకేషన్‌ కోసం మాల్దీవులు వెళ్లినట్లు సమాచారం. వీరు బయలుదేరే ముందు ముంబై విమానాశ్రయంలో తళుక్కుమన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 1983 వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో వచ్చిన 83 సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఇందులో కపిల్ దేవ్ భార్య రూమీ భాటియ పాత్రలో దీపికా పదుకొణె నటించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement