ఫ్లయిట్లో డైలాగ్స్తో అదరగొట్టిన బాలయ్య
హీరో బాలకృష్ణకు పౌరాణిక పాత్రలు అంటే చాలా మక్కువ. అందులోనూ తండ్రి ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాలంటే బాలయ్యకు చాలా ఇష్టం. పలు సందర్భాల్లో బాలకృష్ణ ఆయా పౌరాణిక సినిమాల్లోని భారీ డైలాగ్స్ అవలీలగా చెప్పి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు కూడా. తాజాగా విమాన ప్రయాణంలో ఆయన చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ నటించిన ఎవర్ గ్రీన్ ‘దానవీరశూరకర్ణ’ చిత్రాన్ని ఓ ప్రయాణికుడు తన ట్యాబ్ లో వీక్షిస్తున్నాడు.
కాగా అదే ఫ్లయిట్లో బాలయ్య కూడా ప్రయాణిస్తున్న విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఆయన సీటు దగ్గరకు వెళ్లి...అందులోని డైలాగ్స్ కొన్ని చెప్పాలంటూ విజ్ఞప్తి చేశాడు. దాన్ని తాను రికార్డు చేసుకుంటానని రిక్వెస్ట్ చేయడంతో... ఇక బాలయ్య... డైలాగ్స్తో అదురగొట్టారు. దాంతో ఉబ్బితబ్బిబ్బు అయిన ఆ యువకుడు బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పాడు. ఈ సన్నివేశం మొత్తాన్ని ఆ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూడండి మరి...