Kgf 2 Trailer Highlights: Violence Dialogue Wrote by Yash - Sakshi
Sakshi News home page

KGF 2 Trailer: ‘వైలెన్స్‌.. వైలెన్స్‌..’ ఈ డైలాగ్‌ రాసింది ఆ స్టార్‌ హీరోనే

Published Thu, Mar 31 2022 5:47 PM | Last Updated on Thu, Mar 31 2022 6:53 PM

Director Prashanth Neel Revealed Yash Penned A Dialogues For KGF 2 Movie - Sakshi

కన్నడ స్టార్‌ హీరో యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్‌-2. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్‌14న విడుదల కానున్న నేపథ్యంలో మార్చి 27 ఆదివారం కేజీఎఫ్‌ 2 ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్‌ విడుదల అయితే ఇప్పుడ ఈ ట్రైలర్‌ అన్ని భాషల్లో రికార్డుల మోత మోగిస్తుంది. ఇందులో రాఖీ భాయ్‌ డైలాగ్స్‌ ప్రేక్షకులు సలాం కొడుతున్నారు.

చదవండి: రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ఈటీ మూవీ, స్ట్రీమింగ్‌ ఆ రోజు నుంచే

ట్రైలర్‌ ప్రారంభంలో యశ్‌ ‘వైలెన్స్‌.. వైలెన్స్‌.. వైలెన్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌.. బట్‌.. వైలెన్స్‌ లైక్స్‌ మీ’ అంటూ చెప్పిన ఈ పవర్‌ ఫుల్ డైలాగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ యశ్‌ గురించిన ఆసక్తిర విషయం చెప్పాడు. ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ.. ఈ మూవీకి ఓ స్టార్‌ హీరో కొన్ని డైలాగ్స్‌ రాశాడంటూ సీక్రెట్‌ రివీల్‌ చేశాడు. ఆయన ఎవరో కాదని కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ అని చెప్పాడు. ప్రస్తుతం ఎంతో మందిని ఆకట్టుకుంటూ వైరల్‌గా మారిన ‘వైలెన్స్‌’ డైలాగ్‌ స్వయంగా యశ్‌(రాఖీ భాయ్‌) రాశాడంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇది తెలిసి ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషి అవుతున్నారు.

చదవండి: ఇప్పటికీ తగ్గని పుష్ప మేనియా, ఆ పాటకు అమెరికా అమ్మాయిల స్టెప్పులు

ఇది మాత్రమే కాదు.. మూవీ కొసం యశ్‌ మరిన్ని డైలాగ్స్‌ కూడా రాసినట్లు ప్రశాంత్‌ వర్మ తెలిపాడు. కాగా ఈ ట్రైలర్‌ విడుదలైన 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్‌ వ్యూస్‌ను కొల్లగొట్టింది. ట్రైలర్‌కి కన్నడ భాషలో 18మిలియన్‌ వ్యూస్‌ రాగా..  తెలుగులో 20M, హిందీలో 51M, తమిళంలో 12M, మలయాళంలో 8M వ్యూస్‌ వచ్చాయి. 'రికార్డ్స్‌.. రికార్డ్స్‌.. రికార్డ్స్‌.. రాఖీకి ఇది ఇష్టం ఉండదు, అందుకు తప్పించుకుంటాడు. కానీ రికార్డ్స్‌ రాఖీని ఇష్టపడతాయి. అందుకే వాటి నుంచి తప్పించుకోలేడు' అంటూ మేకర్స్‌ బుధవారం ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement