Allu Arjun Pushpa Movie Telugu Dialogues Jukebox Released, Video Inside - Sakshi
Sakshi News home page

Pushpa Dialogue Jukebox: పుష్ప మేకర్స్‌ సరికొత్త విధానం.. డైలాగ్ జ్యూక్ బాక్స్‌ విడుదల

Mar 7 2022 9:26 PM | Updated on Mar 8 2022 8:51 AM

Pushpa Movie Dialogue Jukebox Released - Sakshi

Pushpa Movie Dialogue Jukebox Released: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ కాంబొలో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ 'పుష్ప: ది రైజ్‌'. గతేడాది డిసెంబర్‌ 17న వరల్డ్‌ వైడ్‌గా థియేటర్లలో రిలీజైన ఈ  చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 330 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. వసూళ్ల కలెక్షన్లను పక్కన పెడితే పుష్ప మేనియా కూడా విపరీతంగా పాపులర్‌ అయింది. పుష్ప క్యారెక్టర్‌లోని బన్నీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సినిమాలోని డైలాగులు, పాటలు అన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. దీంతో పుష్ప క్యారెక్టర్‌ను అనుకరిస్తూ ప్రపంచం నలుమూలల నుంచి సినీ, క్రికెట్ సెలబ్రిటీలు ప్రత్యేక వీడియోలు క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశారు. అవి ఎంతో ట్రెండ్‌ కూడా అయ్యాయి.  

ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం 'పుష్ప: ది రూల్‌' చిత్రీకరణ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈలోపు ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర వీడియోను విడుదల చేశారు మేకర్స్‌. ఇదివరకూ సినిమా పాటల జ్యూక్‌ బాక్స్‌ను రిలీజ్‌ చేసేవారు. ఇప్పుడు సరికొత్త విధానానిని నాంది పలుకుతూ పుష‍్ప డైలాగ్‌ జ్యూక్ బాక్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌. పుష్ప మూవీలో అల్లు అర్జున్‌ పలికిన కొన్ని పాపులర్‌ డైలాగ్‌లతో ఈ జ్యూక్‌ బాక్స్‌ ఉంది. ఈ వీడియో సుమారు 21 నిమిషాల నిడివితో ఉంది. ఈ డైలాగ్ జ్యూక్‌ బాక్స్‌కు మంచి స్పందన వస్తోంది. మరి ఈ విధానాన్ని భవిష్యత్తులో దర్శకనిర్మాతలు అనుసరిస్తారేమో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement