రత్లామ్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్సు లేకపోవడంతో తల్లిదండ్రులు బైక్‌పై తీసుకెళ్లగా మార్గమధ్యంలోనే ఆ చిన్నారి ప్రాణాలుకోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. నంద్‌లేటా గ్రామానికి చెందిన ఘన్‌శ్యామ్ నాథ్, దీనాబాయి దంపతుల కుమార్తె జీజా(4)న్యూమోనియాతో తీవ్రమైన జ్వరం రావడంతో ఆమెను సైలానాలోని సామాజిక ఆరోగ్యకేంద్రంలో చేర్పించారు.
మెరుగైన చికిత్స కోసం రత్లామ్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. దినసరి కూలీ అయిన ఘనశ్యామ్ తన కుమార్తెను రత్లామ్‌కు తీసుకెళ్లేందుకు అంబులెన్సును ఇవ్వాల్సిందిగా కోరగా ఆరోగ్యకేంద్రం సిబ్బంది అందుకు నిరాకరించారు. దీంతో స్నేహితుడి బైక్‌ను తెచ్చారు. ఆ స్నేహితుడు బైక్ నడుపుతుంటే జీజాను ఘనశ్యామ్, చిన్నారి చేతికి అమర్చిన సెలైన్‌ను భార్య పట్టుకున్నారు. ఇలా బైక్‌పై 30 కి.మీ దూరంలో ఉన్న రత్లామ్ ప్రభుత్వాసుపత్రికి చిన్నారిని తీసుకెళ్లారు. అక్కడ జీజాను పరీక్షించిన వైద్యులు ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment