గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: శు.తదియ రా.2.26 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: శ్రవణం రా.12.52 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: తె.4.45 నుండి 6.17 వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం: ఉ.10.16 నుండి 11.04 వరకు, తదుపరి ప.2.41 నుండి 3.29 వరకు, అమృతఘడియలు: ప.2.30 నుండి 4.05 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.35, సూర్యాస్తమయం: 5.33.
మేషం...పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఇంటర్వ్యూలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. వ్యాపారాలు లాభిస్తాయి.
వృషభం...ప్రయాణాలు వాయిదా. శ్రమా«ధిక్యం. పనులు మందగిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.
మిథునం...కుటుంబంలో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఖర్చులు. ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.
కర్కాటకం...ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. వ్యాపారాలు పుంజుకుంటాయి. బంధువుల కలయిక. విందువినోదాలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు.
సింహం....పనులలో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
కన్య....దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు గందరగోళం. దైవదర్శనాలు.
తుల...వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఉద్యోగులకు పనిభారం. వ్యాపారాలు మందగిస్తాయి. సోదరుల కలయిక.
వృశ్చికం...కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. సన్నిహితుల నుంచి సహాయం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
ధనుస్సు...రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యభంగం.
మకరం..పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక ప్రగతి. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు.
కుంభం..ప్రయాణాలు. రుణయత్నాలు. పనులలో జాప్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
మీనం...పాతమిత్రుల కలయిక. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆసక్తికరమైన సమాచారం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment