పాపన్నపేట: సింగూరు నుంచి బుధవారం సాయంత్రం విడుదల చేసిన 0.25 టీఎంసీల నీరు శుక్రవారం ఘనపురం ప్రాజెక్టు చేరింది. ఎండి పోతున్న పంటలకు ప్రాణం పోసింది. ఘనపురం ప్రాజెక్టు కింద ఖరీఫ్ సీజన్‌లో రైతన్నలు సుమారు 20 వేల ఎకరాల్లో వరిపంట వేశారు. అయితే ఇప్పటి వరకు సింగూరు నుంచి 0.25 టీఎంసీల చొప్పున రెండు సార్లు నీటిని విడుదల చేశారు. గత 15 రోజుల నుంచి కరెంట్ కోతలు తీవ్రం కావడంతో రోజుకు రెండు మడులు కూడా తడవని పరిస్థితి నెలకొంది.
తుఫాన్ ఫలితంగా వర్షాలు పడతాయని రైతులు ఆశించినప్పటికీ వాన జాడే కరువైంది. చాలా చోట్ల వరి పంటలు ఎండి పోయాయి. దీంతో స్పందించిన డిప్యుటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి 0.25 నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం 0.1 టీఎంసీ నీరు ఘనపురం చేరిందని, మరో 0.1 టీఎంసీ వచ్చే ఘనపురంలో చేరుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
ఘనపురం చేరిన సింగూరు నీరు
Published Sat, Oct 18 2014 12:09 AM | Last Updated on Fri, Nov 9 2018 6:05 PM
Advertisement
Advertisement