
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. తీవ్ర నీటి సమస్యతో సంగారెడ్డి పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. సంగారెడ్డితో పాటు హైదరాబాద్ జంట నగరాల నీటి అవసరాలను తీర్చే సింగూరు జలాశయం పూర్తిగా ఎండిపోవడంతో.. ఈ కొరత ఏర్పడిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను సింగూరు డ్యాంకు తరలించి నీటి సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన రాసిన లేఖలో పూర్తి వివరాలను పొందుపరిచారు. కాగా మంజీర నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో దానిపై నిర్మించిన సింగూరు డ్యాం పూర్తిగా ఎండిపోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment