పాపన్నపేట: సింగూరు నీటి కోసం ఘనపురం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రాజెక్టు నుంచి నీరు వదిలి నాలుగు రోజులైనా.. ఇప్పటికీ నీటి జాడలేక పోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. గత బుధవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సింగూరు నుంచి 0.25 టీఎంసీల నీటిని వదిలారు. అయితే ఆ నీరు దిగువన ఉన్న కలబ్‌గూర్ డ్యాంలో నిల్వ ఉండిపోయాయి.
ఈ మేరకు శనివారం రాత్రి ఇరిగేషన్ అధికారులు 0.25 టీఎంసీ నీటిని దిగువకు వదిలినట్లు తెలిసింది. అయితే ఈనీరు 24గంటల తరువాతే ఘనపురం ఆనకట్టను చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ డిప్యూటీఈఈ సురేష్‌బాబు తెలిపారు. నాలుగు రోజులుగా చినుకులు జాడలేక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పాపన్నపేట మండలంలో జోరుగా వరినాట్లు కొనసాగుతున్నాయి.
సింగూరు నీటిపై ఆశతో ఘనపురం ఆయకట్టు పరిధిలోని రైతులు సైతం వరినాట్లకు సన్నద్ధమయ్యారు. దీంతో సింగూరు నీరు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా నాట్లు వేస్తేనే పంట దిగుబడి ఆశించినస్థాయిలో వస్తుందని, ఆలస్యమైతే దిగుబడి తగ్గిపోతుందని దిగాలుప డుతున్నారు.
సింగూరు నీటి కోసం ఎదురుచూపులు
Published Mon, Aug 4 2014 4:00 AM | Last Updated on Fri, Nov 9 2018 6:05 PM
Advertisement