
ఆర్డీఓ నగేష్‌కు వినతిపత్రం ఇస్తున్న నేతలు
మలివిడతగా సింగూర్ జలాలను విడుదల చేసి ఘణాపూర్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
- మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి
మెదక్: మలివిడతగా సింగూర్ జలాలను విడుదల చేసి ఘణాపూర్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పలువురు కాంగ్రెస్‌నాయకులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి ఆర్డీఓ మెంచు నగేష్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడతగా సింగూర్ జలాలు విడుదల చేసినప్పటికీ అవి మధ్యలోనే ఆగిపోయాయని, మళ్లీ వెంటనే నీరు విడుదల చేస్తే పంట పొలాలకు చేరుకుంటాయన్నారు.
2004లో సింగూర్ ప్రాజెక్ట్‌లో కేవలం 5టీఎంసీల నీరునప్పటికీ ఘనపురం ఆయకట్టుకు నీరు వదలడం జరిగిందన్నారు. ప్రస్తుతం 6టీఎంసీల నీరున్నా ప్రాజెక్ట్‌కు వదలడంతో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే మెదక్ జిల్లాకేంద్రాన్ని నర్సాపూర్, నారాయణఖేడ్, ఆందోల్ పూర్తి నియోజకవర్గాలతోపాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డి మండలాన్ని కలపాలని డిమాండ్ చేశారు.
18మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మెదక్‌ను 14 మండలాలకే జిల్లాకేంద్రం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు మామిళ్ల ఆంజనేయులు, సురేందర్‌గౌడ్, మధుసూదన్‌రావు, తోట అశోక్, శంకర్, అమృతరావు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.