‘కాళేశ్వరం’లో మరో మార్పు!
Published Wed, Jun 7 2017 2:36 AM | Last Updated on Fri, Nov 9 2018 6:05 PM
సింగూరు నీటి తరలింపుపై తెరపైకి కొత్త ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మరో భారీ మార్పు దిశగా కసరత్తు జరుగుతోంది. సింగూరు ప్రాజెక్టు నీటి తరలింపు మార్గాలపై కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికే నిర్ణయించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి నేరుగా సింగూ రుకు నీటిని తరలించకుండా కొత్తగా సామ ర్థ్యం పెంచనున్న కొండపోచమ్మ రిజ ర్వాయర్ ద్వారా సింగూరుకు నీటిని తరలించేందుకు సాధ్యాసాధ్యాలపై అన్వేషణ సాగుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు మంగళవారం ప్రగతి భవన్‌లో నీటిపారుద లశాఖ మంత్రి హరీశ్‌రావు, ఇంజనీర్లతో గూగుల్ మ్యాపుల ద్వారా సమీక్షించారు.
ఏ మార్గంతో ఎంతెంత...
స్థిరీకరణ కింద నిర్ణయించిన ఆయకట్టుకు నీరివ్వాలంటే సింగూరు, నిజాం సాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను సైతం కాళేశ్వరం నీటితో నింపేలా ప్రణాళిక వేశారు. మల్లన్నసాగర్‌కు వచ్చే నీటిని గ్రావిటీ పద్ధతిన సింగూరుకు తరలించి అటు నుంచి శ్రీరాంసా గర్ వరకు తరలించేలా ప్రణాళిక రచించారు. మల్లన్నసాగర్‌లో నీటిని తీసుకునే లెవల్ 557 మీటర్లు ఉండగా సింగూరు లెవల్ 530 మీట ర్లుగా ఉంది. అయితే పూర్తిగా గ్రావిటీ పద్ధతిన నీటిని తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో మధ్యన 30 మీటర్ల లిఫ్టును ఏర్పాటు చేసి నీటిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూరుకు పంపాలనేది ఉద్దేశం. దీనిపై వ్యాప్కోస్ నుంచి డీపీఆర్ నివేదిక అందాల్సి ఉంది. ఈలోగా ప్రభుత్వం కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 7 టీఎంసీల నుంచి 21 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించింది. దీంతో 627 మీటర్ల లెవల్ నుంచి 530 మీటర్ల లెవల్ ఉన్న సింగూరుకు పూర్తి గ్రావిటీ ద్వారా నీటిని తరలించవచ్చన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. ఈ విధానం ద్వారా మరింత ఆయక ట్టుకు నీరందించవచ్చని చెబుతున్నారు.
గూగుల్ మ్యాప్‌ల ద్వారా సీఎం సమీక్ష
సింగూరుకు కాళేశ్వరం జలాల తరలింపుపై సీఎం కేసీఆర్ మంగళవారం గూగుల్ మ్యాప్‌ల సాయంతో సుదీర్ఘంగా సమీక్షించారు. కొండపోచమ్మ నుంచి సింగూరుకు నీటిని తరలిస్తే ఎలాంటి లాభం ఉంటుంది, ఉన్న అడ్డంకులు ఏమిటన్న దానిపై చర్చించారు. ప్రాథ మికంగా తెలిసిన సమాచారం మేరకు ఈ డిజైన్ ద్వారా ఔటర్ రింగురోడ్డు మార్గం లో రెండు చోట్ల, ముంబై హైవేపై మరో రెండు చోట్ల క్రాసిం గ్‌లు ఉంటాయని, పటాన్‌చెరు వద్ద ఉన్న ఇక్రిశాట్‌ను సైతం దాటాల్సి ఉంటుందని అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై ముఖ్య మంత్రి ఎలాంటి సూచనలు చేశారన్నది తెలియ రాలేదు.
Advertisement