సాక్షి, నిజామాబాద్: కాసాల జైపాల్‌రెడ్డి.. అతడో మోటివేటర్.. ఒత్తిడితో కుంగిపోయి, సమస్యలతో పో రాడలేక జీవితంపై విరక్తిచెందిన ఎందరికో తన ప్రసంగాలతో స్ఫూర్తిని నింపిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు.. ‘‘ధైర్యముంటే ఈ ధరణిపైన సాధించలేని దంటూ ఏదీ లేదు’’ అంటూ ధైర్యాన్ని నూరిపోసిన ఆయన.. చివరికి తన అనారోగ్య సమస్యకు పరిష్కారం కనుగొనలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజాంసాగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. పిట్లం మండలం అల్లాపూ ర్‌కు చెందిన జైపాల్‌రెడ్డి(34) ఎంసీఏ, ఎంఏ ఇంగ్లిష్, ఎమ్మెస్సీ సైకాలజీ చదివారు. ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఆయన వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మోటివేషనల్ క్లాసులతో వేలాది మందికి వ్యక్తిత్వ వికాసాన్ని అందించారు. పరీక్షలంటే భయం పోగొట్టారు. సుమారుగా 8 వేల సదస్సులలో పాల్గొని ఎందరిలోనో స్ఫూర్తిని నింపారు.
ఆత్మహత్యాయత్నం నుంచి..
జైపాల్‌రెడ్డి గతంలో ఓసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. 2004లో అనారోగ్య సమస్యతో మానసికంగా కుంగిపోయిన ఆయన బాసర చేరుకున్నారు. బలవన్మరణానికి పాల్పడాలనుకున్న సమయంలో స్వామి వివేకానంద సూక్తులు తన మనసులో మెదిలాయని, దీంతో బతకాలని నిర్ణయించుకున్నానని ఆయన పలు సందర్భాలలో పేర్కొన్నారు.
చదవండి: కారు ప్రమాదం.. బీజేపీ నేత కొడుకుతో సహా ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి
ఆరోగ్యం బాగాలేక..
జైపాల్‌రెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా గుల్‌దస్తా సమీపంలో నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోమవారం ఉదయం ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. పోస్టును చూసిన ఆయన స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ప్రాజెక్టు వద్దకు వెళ్లిన పోలీసులకు జైపాల్‌రెడ్డి బైక్, చెప్పులు, ఫోన్ కనిపించాయి. జాలరి సాయంతో ప్రాజెక్టులో గాలించగా మృతదేహం లభించింది. పేద కుటుంబం కావడం, అనారోగ్యం తీవ్రం కావడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
చదవండి: విష సర్పాన్ని ముద్దాడి.. మృత్యువుతో పోరాటం!
Comments
Please login to add a commentAdd a comment