Motivational speaker
-
‘సారీ’ చెప్తారా? ఎదుగుతారా?
‘ఐయాం సారీ’... తప్పులు, పోరపాట్లు చేసి సారీ చెప్పడం అందరూ చేసే పని. కాని జీవితంలో ‘సారీ’లు కొనసాగుతూ ఉంటే మనం ఇంకా ఎదగలేదని, తప్పుల నుంచి నేర్చుకోవడం లేదని అర్థమంటారు ప్రియా కుమార్.‘అలవాటుగా తప్పు చేయడం దుర్లక్షణం’ అనే ప్రియా కుమార్ తనవైన సూత్రీకరణలతో మోటివేషనల్ స్పీకర్‌గా మారారు. పర్సనాల్టీ డెవలప్మెంట్ రచనలు చేస్తూనే దేశంలో టాప్ 10 మహిళా వ్యక్తిత్వ వికాస నిపుణులలో ఒకరిగా ఎదిగారు. విజయానికి ఆమె చెప్తున్న సూత్రాలు. ‘నెగెటివ్ థింకింగ్ ఉన్నవాళ్లు సమస్యలను ఊహించుకుంటూ భయపడుతుంటారు. వాళ్లు ఊహించి ఎదురు చూసే సమస్యలు చాలామటుకు ఎదురుపడవు. కాని ఇలా నెగెటివ్ థింకింగ్ వల్ల నిజంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని ఎదుర్కొందాం అనే కుతూహలం నశిస్తుంది. సమస్య మీద ఫోకస్ నిలువదు. సమస్యను పరిష్కరించాల్సింది ΄ో దాని వల్ల నష్టపోతారు’ అంటుంది ప్రియా కుమార్. ఈమెది చండీగఢ్.47 ప్రపంచ దేశాలలో ప్రియా కుమార్ కార్పొరేట్ సంస్థలకు మోటివేషనల్ స్పీకర్‌గా ఉన్నారు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఆమె రాసిన 12 పుస్తకాలు అంతర్జాతీయ అవార్డులను ΄చెందాయి. బయోగ్రఫీలు రాయడం మరో ఆసక్తిగా కలిగిన ప్రియా కుమార్ తాజాగా పుల్లెల గోపీచంద్ బయోగ్రఫీ ‘షట్లర్స్ ఫ్లిక్’ను వెలువరించిచారు. డ్రీమ్, డేర్, డెలివర్ అనేది ఆమె నినాదం. ఇలా గెలవండి: ఒక వ్యక్తి కెరీర్ సఫలం కావాలంటే అతని కుటుంబ జీవనం సరిగ్గా ఉండాలని అంటుంది ప్రియా. ‘మీరు ఇల్లు విడిచి ఆఫీసుకు వస్తారు. మీరు విడిచి వచ్చిన ఇల్లు తిరిగి మీరు చేరే సమయానికి మీకు ఆహ్వానం పలికేలా ఉండాలి. అది మీ బడలిక తీర్చి మరుసటి రోజు మిమ్మల్ని కార్యోన్ముఖులను చేసేదిగా ఉండాలి. అలా ఉండాలంటే మీరు ఇంటిని, ఆఫీసును వేరు చేయకూడదు. అంటే మీ పనిలో ఏం జరుగుతున్నదో, మీరేం చేస్తున్నారో, మీరు ఎక్కడకు వెళుతున్నారో, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారో కొద్దిగా అయినా ఇంటి సభ్యులకు తెలియచేయాలి. ఒక్కమాటలో చె΄్పాలంటే మీ పనిని మీ ఇంటి సభ్యులతో జత చేయాలి. అప్పుడే వారు మీ ఉద్యోగ జీవితాన్ని సరిగా అర్థం చేసుకుని మీకు మద్దతుగా నిలుస్తారు’ అంటుందామె. ‘ఒక ఉద్యోగంలో మీరు చేరితే జీవితాంతం ఆ ఉద్యోగం చేయాలని లేదు. అక్కడ కొందరు రాజకీయాలు చేసి మీరు పని చేయలేని స్థితి వస్తే అలాంటి టాక్సిక్ వాతావరణం నుంచి బయటపడేయడానికి వారు మీకు సాయం చేస్తున్నారని అర్థం. అక్కడి నుంచి బయటపడి కొత్త జీవనాన్ని మొదలెట్టండి. మీకు ఉద్యోగం మీ సామర్థ్యాన్ని చూసి ఇస్తారు. మీరు ఉద్యోగంలో ఆ సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. ఈ సామర్థ్యానికి– దాని ప్రదర్శనకు మధ్య ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడంలోనే మీ విజయం ఆధారపడి ఉంది’ అని తెలుపుతుంది ప్రియ కుమార్. సారీలు మానండి: ‘జీవితంలో ఏదో ఒక దశలో సారీలు చెప్పలేని స్థితికి చేరుకోవాలి. సారీ చెప్తున్నామంటే ΄÷ర΄ాటో, త΄్పో చేస్తున్నామని అర్థం. చేసిన తప్పుల నుంచి ΄ాఠాలు నేర్చుకుని ఎదగలేక΄ోవడం వల్ల మళ్లీ మళ్లీ సారీ చెప్పాల్సి వస్తుంది. సారీ చెయవచ్చా. కాని దానినొక అలవాటుగా చేసుకుని అలాగే నెట్టుకొద్దామంటే ముందుకు పోలేరు’ అంటుంది ప్రియ కుమార్. ‘మీ గురించి ఎవరైనా మంచిగా మాట్లాడుతున్నారంటే మీరు వారి నుంచి మంచి ఆశించి, వారితో మంచిగా వ్యవహరిస్తున్నారని అర్థం. అలాగే మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారంటే వారిలోని మంచి కాకుండా చెడు బయటకు వచ్చేలా వారితో మీరు వ్యవహరిస్తున్నారని అర్థం’ అంటుందామె. ‘కొందరు సమస్యలను ఆహ్వానించడమే పనిగా పెట్టుకుంటారు. లేదా సమస్యలను సృష్టిస్తారు. మీలోని సామర్థ్యాలను గుర్తించి వాటి కోసం మీ శక్తిని ΄పాజిటివ్‌గా ఉపయోగిస్తే సమస్యల్లో కాకుండా విజయాలలో ఉంటారు’ అని గెలుపు సూత్రాలు తెలుపుతోందామె. -
రామోజీని ఏడ్పించిన నిక్
-
పెళ్లైన గంటల్లోనే భార్యపై దాడి.. వివేక్ బింద్రాపై గృహహింస కేసు
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ వివేక్ బింద్రాపై కేసు నమోదైంది. పెళ్లైన కొన్ని గంటలకే భార్యను వేధింపులకు గురిచేయడంతో పోలీసులు వివేక్ బింద్రాపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. వివేక్ బింద్రాకు యానిక అనే మహిళతో డిసెంబర్ 6న వివాహం జరిగింది. వీరు నోయిడాలోని సెక్టర్ 94 సూపర్ నోవా రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. డిసెంబర్ 7 తెల్లవారుజామున, బింద్రా అతని తల్లి ప్రభ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవను ఆపేందుకు ఆయన భార్య యానికా ప్రయత్నించడంతో బింద్రా ఆమెపై దాడికి దిగాడు. యానిక శరీరంపై పలుచోట్ల గాయాలు కాగా ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఈ విషయంపై బాధితురాలు సోదరుడు వైభవ్ క్వాత్రా నోయిడాలోని సెక్టర్ 126 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేగాక వివాహం జరిగిన కొన్ని గంటలకే, బింద్రా యానికను ఒక గదిలోకి తీసుకెళ్లి, ఆమెపై అసభ్యపదజాలంతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె జుట్టును లాగి, దాడి చేసినట్లు తెలిపారు. యానికా చెవికి గాయం అవ్వడంతో వినికిడి సమస్య ఏర్పడినట్లు వెల్లడించారు. బింద్రా ఆమె ఫోన్‌ను కూడా పగలగొట్టినట్లు చెప్పారు. దీనిపై నోయిడా పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం బింద్రా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక దేశంతో పేరు ప్రఖ్యాతలు సాధించినమోటివేషనల్ స్పీకర్ వివేక్ బింద్రా.. బడా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీబీపీఎల్) సీఈవో కూడా. అతనికి యూట్యూబ్, ఇన్‌స్టాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. చదవండి: వికటించిన క్రిస్మస్ డిన్నర్.. 700 మందికి అస్వస్థత -
Kavita Shukla: అమ్మమ్మ ఇంట్లో వచ్చిన ఐడియా జీవితాన్నే మార్చేసింది!
సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళితే ఏం దొరుకుతుంది? అంతులేని ఆనందం. అయితే అమెరికా నుంచి ఇండియాలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చిన కవితా శుక్లాకు ఆనందంతో పాటు ‘ఐడియా’ కూడా దొరికింది. ఆ ఐడియా ఆమెను ఇన్వెంటర్ని చేసింది. ఆ తరువాత ఎంటర్‌ప్రెన్యూర్‌ను చేసింది. ఇన్వెంటర్, ఎంటర్ప్రెన్యూర్, మోటివేషనల్ స్పీకర్, డిజైనర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది కవితా శుక్లా... చిన్నప్పటి నుంచి సైన్స్, కళలు అంటే కవితకు ఆసక్తి. సైన్స్‌లో రకరకాల ప్రయోగాలు చేసేది. తాను ఇన్నోవేటర్ కావడానికి ఆ ప్రయోగాలు పునాదిగా ఉపయోగపడ్డాయి. పదిహేడు సంవత్సరాల వయసులోనే ఎన్నో పేటెంట్లు తీసుకుంది. ‘ఫ్రెష్‌పేపర్’ రూపంలో ఆహార వ్యర్థాలను తగ్గించే సాంకేతిక ఆవిష్కరణ కవితకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చింది. ఈ ఫ్రెష్ పేపర్ ఆహారం, కూరగాయలలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను నిరోధించి వాటిని ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది. బోస్టన్లోని స్థానిక రైతు మార్కెట్ లో ఫ్రెష్ పేపర్ లాంచ్ చేశారు. మౌత్‌టాక్‌తోనే ఈ పేపర్ పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ ఫ్రెష్‌పేపర్ 180 దేశాల్లో అందుబాటులో ఉంది. ‘యూఎస్‌లో ఆహార వృథా అనేది ఇంత పెద్ద సమస్య అని తెలియదు. ఫ్రెష్పేపర్కు వచ్చిన స్పందన నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. పండ్లు, కూరగాయలు, ఆహారాన్ని తాజాగా ఉంచడానికి తద్వారా ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. లోకల్ఫుడ్ బ్యాంకులకు వీటిని విరాళంగా ఇచ్చాం’ అంటుంది కవిత. ఫుడ్ ప్రిజర్వేషన్‌కు సంబంధించిన ఆసక్తి కవితలో పదమూడు సంవత్సరాల వయసు నుంచే మొదలైంది. సెలవులు వచ్చినప్పుడు ఇండియాలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది కవిత. ఒకరోజు పొరపాటున కలుషితమైన నీరు తాగింది. ఆందోళన పడిన అమ్మమ్మ వెంటనే కవితతో ఏదో కషాయం తాగించింది. దీంతో కవితకు ఏమీ కాలేదు. అమెరికాకు తిరిగిన వచ్చిన తరువాత కషాయంలో అమ్మమ్మ ఉపయోగించిన పదార్థాల గురించి వివరంగా తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆహారపదార్థాలు, కూరగాయలు చెడిపోకుండా సంరక్షించడానికి సంబంధించిన పరిశోధనలు మొదలుపెట్టింది. జర్మనీలో పుట్టిన కవిత ఇలియట్ సిటీ (యూఎస్)లో పెరిగింది. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పుచ్చుకుంది. ‘ సింపుల్ ఐడియాలకు మార్పు తెచ్చే శక్తి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు’ అంటుంది కవిత. ఆహార భద్రత, సంరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కవిత మోటివేషనల్ స్పీకర్ కూడా. ఎన్నో కాలేజీలలో, సమావేశాలలో యువతను ఉద్దేశించి ఉత్తేజకరమైన ప్రసంగాలు చేసింది. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్లు అందుకుంది. ఫోర్బ్స్ ‘30 అండర్ 30: సోషల్ ఎంటర్ ప్రెన్యూర్స్’ టైమ్ మ్యాగజైన్ ‘5 మోస్ట్ ఇనోవేటివ్ ఉమెన్ ఇన్ ఫుడ్’ న్యూస్‌వీక్ ‘125 ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ జాబితాలలో చోటు సంపాదించింది. రెండు సంవత్సరాల క్రితం వర్జీనియాలో జరిగిన వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఇండిపెంటెంట్ ఇన్వెంటర్లు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొఫెషనల్స్ సమావేశంలో కీలక ఉపన్యాసం ఇచ్చింది. ఇన్వెంటర్ అయిన కవిత ‘ఫ్రెష్ గ్లో’ కంపెనీతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా అద్భుత విజయం సాధించింది. ‘మీకు ఏదైనా ఆసక్తిగా అనిపిస్తే దాని గురించి లోతుగా ఆలోచించండి. ఆ తరువాత పరిశోధించండి. ఫలితాలు చేతికి అందేవరకు ప్రయోగాలు చేయండి’ అంటుంది కవిత. ఆలోచించండి... అద్భుతాలు చేయండి కష్టాల దారిలో ప్రయాణించి విజయాలు సాధించిన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ల గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. వారి గురించి సమావేశాల్లో చెబుతుంటాను. వారి విజయగాథలు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తాయి. ఆలోచిస్తే ఐడియాలు వస్తాయి. ఆ ఐడియాలతో ఎన్ని గొప్ప పనులైనా చేయవచ్చు. మన ఐడియాను మొదట ఇతరులతో పంచుకోవడానికి భయంగా అనిపిస్తుంది. ఆ భయాన్ని వదులుకొని ఆత్మవిశ్వాసంతో చెప్పండి. ఆత్మవిశ్వాసం ఉన్న చోటుకి విజయం త్వరగా వస్తుంది. – కవితా శుక్లా, ఫ్రెష్ గ్లో కంపెనీ ఫౌండర్, సీయీవో ∙చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో కవితా శుక్లా -
ఆకట్టే కనికట్టు: మెంటలిస్ట్ సుహానీ షా
సుహానీ షాను ఇండియాలో ఏకైక ఫిమేల్ మెంటలిస్ట్ అంటారు. ఇప్పటికి 5000 ప్రదర్శనలు ఇచ్చిన సుహానీ స్టేజ్ మీద ప్రేక్షకులను దిగ్భ్రమ పరిచే చమత్కారాలు చేస్తుంది. సంప్రదాయ మేజీషియన్ల వేషంలో కాకుండా ఆధునికమైన ఆహార్యంలో ఆమె భ్రాంతిని, విభ్రాంతిని, కనికట్టును ప్రదర్శిస్తుంది. అందుకే దేశంలోని ఏదో ఒక నగరంలో ఆమె ప్రదర్శనకు సంబంధించిన ప్రకటన కనపడుతూనే ఉంటుంది. సుహానీ సక్సెస్ స్టోరీ. సుహానీ షా తన షోలో మిమ్మల్ని స్టేజ్ మీదకు పిలుస్తుంది. మీరెవరో ఆమెకు తెలియదు. ఆమెతో మీరు ఎప్పుడూ మాట్లాడి ఉండరు. ‘మీకు ఇష్టమైన పాట తలుచుకుని మనసులో పాడుకోండి’ అంటుంది. మీరు ఒక నిమిషం మనసులో పాడుకుంటారు. అప్పుడు సుహానీ షా తన చేతిలోని సెల్ఫోన్లో ఒక పాట మ్యూట్‌లో ప్లే చేసి పక్కన పెట్టి, మీరు ఏ పాట అనుకున్నారో మైక్‌లో చెప్పండి అంటుంది. ‘మౌనంగానే ఎదగమని’ అని మీరు అంటారు. ఆ ఫోన్లో చూడండి అంటుంది. ఆశ్చర్యం. అందులో అదే పాట అప్పటికే ప్లే అవుతూ ఉంటుంది. మీరు మనసులో అనుకున్న పాట ఆమెకు ఎలా తెలిసింది? అదే మైండ్ రీడింగ్. మళ్లీ ఇంకొకరిని పిలుస్తుంది. ‘ఎవరినైనా మీకు పరిచయమున్న వ్యక్తిని తలుచుకోండి’ అంటుంది. అతను తలుచుకుంటాడు. ఫ్రెండా? అడుగుతుంది. బంధువు అంటాడు. మీరు కళ్లు మూసుకుని ఆ మనిషిని మీ ఎదురుగా ఊహించుకోండి అంటుంది. ఆ తర్వాత తన చేతిలో ఉన్న పలక మీద ఒక పేరు రాసి పక్కన పెడుతుంది. కళ్లు తెరిచి మీరు తలుచుకున్న వ్యక్తి పేరు చెప్పండి అంటుంది. అతను చెప్తాడు. పలక చూపిస్తుంది. ఆశ్చర్యం. ఆ పలక మీద అప్పటికే ఆమె ఆ పేరు రాసి ఉంది. అదీ మైండ్ రీడింగే. ఇలాంటివి చేసే మహిళ మన దేశంలో సుహానీ షా ఒక్కర్తే ఉంది. అందుకే ఆమె భారతదేశ ఏకైక ఉమన్ మెంటలిస్ట్. చిన్నప్పటి నుంచి సుహానీ షాది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్. ఏడేళ్ల నుంచే మేజిక్ చేయడం మొదలెట్టింది. ఆ మేజిక్‌లు పెద్ద హిట్ అయ్యేసరికి స్కూల్‌కు వెళ్లే వీలే కలగలేదు. దేశ విదేశాలు మేజిక్‌లు చేస్తూ వెళ్లింది. దాంతో 14 ఏళ్ల వరకు ఆమెకు రాయడం రాదు. 16 ఏళ్ల వరకు ఇంగ్లిష్ మాట్లాడటం రాదు. కాని ఇప్పుడు నాలుగైదు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. ‘సాకులు చెప్పొద్దు’ అంటుంది ఎవరైనా ఏదైనా రాదు అంటే. ‘నేర్చుకోవాలనే సంకల్పం ముఖ్యం’ అంటుంది. సుహానీ షా మొదట మేజిక్‌లు చేస్తూ, తర్వాత ఇల్యూషన్స్ చేస్తూ, ఆ తర్వాత మైండ్ రీడర్‌గా మారింది. మెంటలిస్ట్ అంటే? మెజీషియన్లాగా సంగీతం, ఎక్విప్మెంట్, హంగామా ఏమీ ఉండదు. సరికొత్త ఆహార్యంలో ఒక్కరే వచ్చి స్టేజ్ మీద నుంచి ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఎదురుగా కూచున్న వారిలో ఒకరి పెళ్లిరోజు ఏదో చెప్పడం, ఒకరి ఫోన్ తీసుకుని అన్‌లాక్ చేయడం, ఒకరి గతాన్ని చెప్పడం, మరొకరి భవిష్యత్తును చెప్పడం, మనసులో అనుకున్న అంకెలు తెలియచేయడం... ఇవన్నీ మెంటలిస్ట్ చేస్తారు. సుహానీ షా తాను ఒక్కతే స్టేజ్ మీద నిలబడి ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది. ‘ఇందుకు దివ్యశక్తులు ఏమీ అక్కర్లేదు. సాధనతో సాధించిన స్కిల్ ఇది’ అంటుంది సుహానీ షా. ‘మామూలు మేజిక్‌లు చాలా కాలం చేశాక దీనికంటే పై స్థాయికి వెళ్లాలని ఎదుటివాళ్ల మైండ్ రీడింగ్ చేయాలని కొన్నాళ్ల పాటు హిమాలయాలకు వెళ్లి షో డిజైన్ చేస్తూ కూచున్నాను. మూడు నాలుగేళ్లుగా మెంటలిస్ట్‌గా షోలు చేస్తున్నాను’ అంటుంది సుహానీ. మోటివేషనల్ స్పీకర్ సుహానీ కేవలం షోస్ మాత్రమే చేయదు. యూట్యూబ్‌లో పర్సనాల్టీ డెవలప్మెంట్ మీద వీడియోలు చేస్తుంది. ఆమెకు గోవాలో హిప్నో క్లినిక్ ఉంది. దురవాట్లను మాన్పించడంలో ఆమె వ్యక్తులకు సాయ పడుతుంటుంది. ‘జీవితంలో ఏ పనీ చేయనివారు ఏదో ఒకటి సాధించాలని అనుకోని వారు తమ జీవితాలను వృథా చేసుకుంటున్నట్టు లెక్క’ అంటుందామె. సుహానీకి లక్షల కొద్ది అభిమానులు ఉన్నారు. ఆమె షోస్ నగరాల్లో జరుగుతూనే ఉంటాయి. ఈసారి మీ దృష్టికి వస్తే వెళ్లి చూడండి. -
కాగితానికి కొత్త ఊపిరి
‘నేను ఇల్లు దాటి బయట అడుగు వేయలేకపోవచ్చు. అయితే నేను తయారు చేసిన బొమ్మలు మాత్రం దేశదేశాలకు వెళుతున్నాయి’ ఆనందంగా అంటుంది రాధిక. ఆమె చేతిలో కాగితం కూడా కొత్త ఊపిరి పోసుకుంటుంది. పాతన్యూస్ పేపర్లతో ఆమె తయారు చేసిన బొమ్మలలో ఆత్మవిశ్వాస కళ ఉట్టిపడుతుంది. ‘చీకటిని చూసి దిగులు పడకు. అదిగో వెలుగు’ అని ఆ బొమ్మలు మౌనంగానే చెబుతుంటాయి... తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రాధిక బోన్ డిసీజ్ వల్ల నడకకు దూరమైంది. బడి మానేయవలసి వచ్చింది. రోజంతా బెడ్ మీద కూర్చోక తప్పనిసరి పరిస్థితి. ‘ఇక ఇంతేనా!’ అనే చింత ఆమెలో మొదలైంది. తన మనసులోని బాధను పంచుకోడానికి స్నేహితులు కూడా లేరు. కిటికీ నుంచి అవతలి ప్రపంచాన్ని చూస్తే... పిల్లలు బడికి వెళుతుంటారు... ఇలా ఎన్నో దృశ్యాలు ఆమె కంటపడేవి. తన విషయానికి వస్తే... బయటి ప్రపంచంలోకి వెళ్లడమంటే ఆస్పత్రికి వెళ్లడమే. తనలో తాను మౌనంగా కుమిలిపోతున్న సమయంలో ‘ఆర్ట్’ అనేది ఆత్మీయనేస్తమై పలకరించింది. పద్నాలుగేళ్ల వయసులో డ్రాయింగ్, పెయింటింగ్ మొదలుపెట్టింది. ఆర్ట్‌పై సోదరి ఆసక్తిని గమనించిన రాజ్‌మోహన్ పాత న్యూస్‌పేపర్లు, మెటల్ వైర్లతో ఆఫ్రికన్ బొమ్మలు తయారు చేసే యూట్యూబ్ వీడియోలను చూపెట్టాడు. అవి చూసిన తరువాత రాధికకు తనకు కూడా అలా తయారు చేయాలనిపించింది. పాత న్యూస్పేపర్ల నుంచి నవదంపతులు, సంగీతకారులు, వైద్యులు, దేవతలు... ఇలా రకరకాల బొమ్మలు తయారు చేసింది. పొరుగింటి వ్యక్తికి రాధిక తయారు చేసిన బొమ్మ బాగా నచ్చి కొనుగోలు చేసింది. అది తన ఫస్ట్ సేల్. ఆ సమయంలో రాధికకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. రాజ్‌మోహన్ స్నేహితుడు రాధిక తయారు చేసిన అయిదు బొమ్మలను తన షాప్‌లో పెడితే మంచి స్పందన వచ్చింది. ఆ తరువాత మరికొన్ని బొమ్మలు కొన్నాడు. వారం వ్యవధిలో 25 బొమ్మలను అమ్మాడు. సోషల్ మీడియా ద్వారా రాధిక బొమ్మల వ్యాపారం ఊపు అందుకుంది. ఊటీకి చెందిన ఒక హోటల్ యజమాని 25 బొమ్మలకు ఆర్డర్ ఇచ్చాడు. ఊటీలోని ఆ హోటల్‌ను తాను తయారుచేసిన బొమ్మలతో అలంకరించడం రాధికకు సంతోషం కలిగించింది. తన బొమ్మల గురించి ప్రచారం చేయడానికి పైసా ఖర్చు చేయకపోయినా సోషల్‌మీడియాలోని పోస్ట్‌ల వల్ల ఆర్డర్లు వెల్లువెత్తాయి. మూడువేలకు పైగా బొమ్మలు తయారు చేసిన రాధిక... ‘బొమ్మలకు ప్రాణం పోస్తుంటే నన్ను నేను మరిచిపోతాను. కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. టైమే తెలియదు. బొమ్మలు చేస్తున్నప్పుడు ఎంతో ఏకాగ్రత కావాలి. ఆసక్తి ఉన్నచోట సహజంగానే ఏకాగ్రత ఉంటుంది’ అంటుంది. రాధిక ఇప్పుడు ఆర్టిస్ట్ మాత్రమే కాదు. మోటివేషనల్ స్పీకర్ కూడా. తన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తోంది. ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తోంది. -
సీఎం జగన్‌ను కలిసిన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ కలిశారు. సీఎం జగన్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నానని నిక్ వుజిసిక్ అన్నారు. ఈ సందర్భంగా నిక్ ఏమన్నారంటే...: ‘‘దాదాపు ఏడెనిమిది దేశాల్లో నేను పర్యటించాను. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ లాంటి వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు. ఆయన అత్యున్నతమైన లక్ష్యం కోసం ఉన్నతమైన ఆశయంతో పనిచేస్తున్నారు. ఏపీలో సుమారు 45వేల ప్రభుత్వ స్కూళ్లను ఏ ప్రయివేటు స్కూళ్లకు తీసిపోనిరీతిలో అభివృద్ధి చేశారు. అందరికీ సమాన ఆవకాశాలు కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఈ రంగాల్లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. ఇది అందరికీ తెలియాల్సి ఉంది’’ అని నిక్ అన్నారు. ‘‘ఇవాళ ఆయన్ను కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నా పట్ల, నా జీవితం పట్ల మంచి అవగాహనతో స్పూర్తిదాయక వ్యక్తుల కింద నా జీవిత కథను ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ పేరుతో పదోతరగతి ఇంగ్లిషులో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. ఇది నాకు చాలా ఆనందం కలిగించే విషయం. విద్యారంగంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా, మరింత మెరుగైన ఫలితాల కోసం దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నాను. ఇక్కడ(ఏపీలో) విద్యారంగంలో పిల్లల ఎదుగుదలకు మంచి అవకాశాలున్నాయి’’ అని ఆయన అన్నారు. ‘‘ప్రభుత్వ స్కూళ్లలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ గురించి చెప్పాలంటే ఆయన హీరో. ఇంతవరకూ ఇలా ఎక్కడా జరగలేదు. సీఎం చాలా నిబద్ధత, క్రమశిక్షణ గల మనిషి’’ అని నిక్ వుజిసిక్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు ఆర్.ధనుంజయ్‌రెడ్డి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. చదవండి: రైతు భరోసాపై మడతలు కాదు.. చంద్రబాబుకు రామోజీ చిడతలు!! -
Arti Singh Tanwar: పోలీస్ వీడియో పాఠాలు
మోసం, లైంగిక దోపిడి నుంచి అమ్మాయిలను రక్షించే లేడీ సబ్ ఇన్స్పెక్టర్గా ఆర్తిసింగ్ తన్వర్కి మంచి పేరుంది. దీంతోపాటు సైబర్ నేరగాళ్ల నుంచి ఎంత అలెర్ట్‌గా ఉండాలో సోషల్ మీడియా ద్వారా అవగాహన కలిగిస్తుంటుంది. చట్టం గురించి వీడియో పాఠాలు చెబుతుంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తుంటుంది. ఆమె గైడ్లైన్స్కి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. రాజస్థాన్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్తిసింగ్ తన అభిరుచితో బాధ్యత గల సామాజికవేత్తగానూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ లేడీ సబ్ ఇన్స్పెక్టర్ తన విధుల ద్వారానే కాదు రోజూ ఇచ్చే స్ఫూర్తిమంతమైన స్పీచ్‌లు, ఎలాంటి మోసం జరగకుండా ఇచ్చే సైబర్ గైడెన్స్‌తో ప్రతిరోజూ చర్చలో ఉంటుంది. ‘నా అభిరుచిని వృత్తితో జోడీ కట్టించాను. ఫలితం ఎంతోమందికి చేరువయ్యాను’ అంటారు ఈ లేడీ పోలీస్. ► వృత్తి... ప్రవృత్తితో కలిసి.. ఆర్తిసింగ్ కుటుంబ సభ్యులు, బంధువుల్లో చాలామంది పోలీసులుగా ఉన్నారు. వారిలాగే ఆర్తి కూడా పోలీస్ వృత్తినే ఎంచుకుంది. 2012లో రాజస్థాన్ పోలీస్ అకాడమీలో చేరి 2014లో సబ్ ఇన్ స్పెక్టర్‌గా విధులను చేపట్టింది. ‘నేను సోషల్ మీడియా ఫ్రెండ్లీగా ఉంటాను. చేస్తున్న పనుల ద్వారానే నలుగురిలో అవగాహన కలిగిస్తే చాలనుకున్నాను. మహిళల గళం వినిపించాల్సిన చోటు, సైబర్ అవగాహన, సందేశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఫాలోవర్స్ ఎప్పుడు ఇంతగా పెరిగిపోయారో తెలియనే లేదు’ అనేస్తారు ఆమె నవ్వుతూ. ► సోషల్ మీడియా సెల్... పోలీస్ అకాడమీలో శిక్షణ ఇవ్వడంతోపాటు సోషల్ మీడియా సెల్ కూడా నిర్వహిస్తోంది ఈ సబ్ ఇన్స్పెక్టర్. ‘ఇటీవల మా సిబ్బందికి పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఫొటోతో ఓ మెసేజ్ వచ్చింది. గిఫ్ట్ కార్డుల సాకుతో ఎవరో నకిలీ నంబర్ తో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. వెంటనే అందరినీ అప్రమత్తం చేశాను. ఇలాగే.. షాపింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, మెసేజ్‌లలో వచ్చే షార్ట్ లింక్స్... వంటి ఆన్లైన్ మోసాలు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. ఈ మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన తప్పనిసరి అనుకున్నాను. లైవ్ ఇంటరాక్షన్ ద్వారా మోసాన్ని నివారించడానికి సూచనలు ఇస్తుంటాను. బాధితులు తమ అనుభవాలను కామెంట్స్‌లో లేదా డైరెక్ట్ మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. దీంతో వారికి తక్షణ సహాయం అందివ్వడానికి ప్రయత్నిస్తుంటాం. మోసం, లైంగిక దోపిడీని ఎలా నివారించాలో సూచించే వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను’ అని వివరిస్తారు ఆమె. ► యువతకు వీడియో పాఠాలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు, టైమ్ టేబుల్ తయారు చేసుకోవడం, రోజువారీ సిలబస్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏ సబ్జెక్టులను ఎప్పుడు, ఎలా చదవాలి, కంటెంట్ సులభంగా ఎలా గుర్తుంచుకోవచ్చు... ఇలాంటి వీడియోల కోసం యువత ఎదురు చూస్తుంటుంది. ► కొత్త టెక్నాలజీ పరిచయం సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా షేర్ చేస్తుంటుంది ఆర్తి. మొబైల్ హ్యాక్ అయితే ఏం చేయాలి? ఇంట్లోని స్మార్ట్ టీవీ హ్యాక్ అయితే సమస్యను ఎలా పరిష్కరించాలి? సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కొత్త ఫీచర్లు ఏమిటి?.. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది ఆర్తి. ► ఖాకీ యూనిఫాంలో.. ‘నా వీడియోలలో చాలా వరకు నేను ఖాకీ యూనిఫాంలోనే కనిపిస్తాను. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు చట్టపరమైన సమాచారాన్ని చిన్న చిన్న వీడియోలు చేసి పోస్ట్ చేస్తాను. కొన్నిసార్లు ఇంటి నుంచి ఆఫీసుకు లేదా ఆఫీసుకు నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కారులో వీడియోలు షూట్ చేసి అప్లోడ్ చేస్తుంటాను. పోస్ట్ చేసిన గంటల్లోనే వేలల్లో వ్యూస్ వస్తాయి. దీనిని బట్టి ప్రజల్లో చట్టం, న్యాయం, మోసాలకు సంబంధించిన అవగాహన ఎంత అవసరం ఉందో గ్రహించవచ్చు’ అని చెప్పే ఆర్తిసింగ్ను ‘మా మంచి పోలీస్’ అంటూ ప్రశంసిస్తున్నారు ఆమె ఫాలోవర్స్. ప్రతిరోజూ అవగాహన రీల్ ప్రతిరోజూ లక్షలాది మంది ఫాలోవర్లు ఆర్తి గైడెన్స్ రీల్స్ కోసం ఎదురు చూస్తుంటారు. వాటిలో చట్టం, న్యాయానికి సంబంధించి అవగాహన కంటెంట్‌కే ప్రాధాన్యమిస్తుంటుంది. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్‌ల ద్వారా నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ఆర్తి సూచనలను ఫాలో అవుతున్నారు. -
Jyotsna Cheruvu: స్థిరత్వమే సక్సెస్ సూత్రం
హైదరాబాద్ నగరం... దుర్గం చెరువు వంతెనకు సస్పెండెడ్ రోప్ ప్లాట్‌ఫామ్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో ఓ వలయాకారపు షాఫ్ట్. బహుళ అంతస్తుల నిర్మాణంలో పాసెంజర్ అండ్ మెటీరియల్ హాయిస్ట్. ఇవన్నీ సాంకేతికరంగం రూపొందించుకున్న అద్భుతమైన ఆవిష్కరణలు. వీటి రూపకల్పన... తయారీలో కీలకమైన మహిళ... జ్యోత్స్న చెరువు. ‘ఇండిపెండెంట్‌గా నిలబడాలంటే ఇండిపెండెంట్‌గా ఆలోచించాలి, ఇండిపెండెంట్‌గా నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మీరు పదిమంది నడిచే దారిలో పదకొండవ వ్యక్తిగా మిగలకుండా మీదైన కొత్త çపథాన్ని నిర్మించుకోగలుగుతా’ రంటూ మహిళలకు సందేశమిస్తుంటారు... సీఎమ్ఏసీ, మెకనైజేషన్ అండ్ ఆటోమేషన్ ఇన్ కన్స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్ జ్యోత్స్న చెరువు. ‘ప్రౌడ్ టు మేక్ ఇన్ ఇండియా, ఎక్స్పోర్ట్ దెమ్ యాజ్ మేడ్ ఇన్ ఇండియా’ నినాదంతో పరిశ్రమను విజయవంతంగా నిర్వహిస్తున్న జ్యోత్స్న చెరువు తన వైవిధ్యభరితమైన పారిశ్రామిక ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ► సీబీఐటీ స్టూడెంట్‌ని! ‘‘నేను పుట్టింది నెల్లూరు జిల్లా బిట్రగుంటలో. తాత అప్పుడు అక్కడ రైల్వే ఉద్యోగి. అలా అది మా అమ్మమ్మగారి ఊరైంది. నాన్న బ్యాంకు ఉద్యోగరీత్యా మేము పెరిగిందీ, చదువు, కెరీర్ అంతా హైదరాబాద్‌లోనే. మా కాలేజ్ రోజుల్లో అమ్మాయిలు సివిల్ ఇంజనీరింగ్‌ని పెద్దగా తీసుకునేవాళ్లు కాదు. నాకు సీబీఐటీలో సివిల్ ఇంజనీరింగ్ సీటు వచ్చింది. చేరిన తర్వాత సబ్జెక్ట్‌లో ఉన్న అందం తెలిసి వచ్చింది. ఆనందంగా ఆస్వాదిస్తూ కోర్సు పూర్తి చేశాను. ఆ తర్వాత ఉస్మానియాలో ఎంబీఏ చేశాను. మా వారు మెకానికల్ ఇంజనీర్. పెళ్లి తర్వాత కొంతకాలం ఇద్దరమూ ఉద్యోగం చేశాం. మా వారి ఉద్యోగరీత్యా పూనాకి వెళ్లాం. అప్పుడు పిల్లలు చిన్నవాళ్లు. నేనక్కడ ఉద్యోగంలో చేరలేదు, కానీ హోమ్ బ్యూటిఫికేషన్ వంటి సర్వీస్ ప్రాజెక్టులు మొదలుపెట్టాను. మార్కెట్ అవగాహన ఉంది కాబట్టి నిర్మాణ రంగం మీద దృష్టి పెట్టమని ఓ రిటైర్డ్ పర్సన్ చెప్పిన మాట నన్ను పారిశ్రామికవేత్తగా నిలిపాయి. ► నిర్మాణరంగంలో సాంకేతిక వేగం! పిల్లలు పెద్దవుతున్నారు, హైదరాబాద్‌కి వెళ్లిపోదామనే ఆలోచన వచ్చిన నాటికి హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణరంగం కొత్త రూపు సంతరించుకుంటోంది. 25–30 అంతస్తుల భవనాల నిర్మాణం మొదలైన రోజులవి. అది నాకు బాగా కలిసి వచ్చింది. నిర్మాణరంగంలో అవసరమైన కొత్త టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ తయారీని ప్రారంభించాం. ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ని అప్పటివరకు చైనా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చిన నిర్మాణసంస్థలకు అవన్నీ ఇండియాలోనే దొరకడం మంచి సౌలభ్యం కదా. అలా 2006లో మొదలైన మా కంపెనీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా సంస్థలకు సేవలందిస్తోంది. వ్యాపారం అంటే... సమాజం లోని అవసరాన్ని గుర్తించి ఆ అవసరాన్ని తీర్చడం, ఒక సమస్యకు పరిష్కారం చూపించడం. అప్పుడే బిజినెస్ విజయవంతమవుతుంది. మా కంపెనీ సిద్ధాంతం నాలుగు ‘ఎస్’లు... స్పీడ్, సేఫ్టీ, సేవింగ్స్, స్ట్రెంగ్త్. పని వేగంగా జరగాలి, పనిలో పాల్గొనే కార్మికులకు రక్షణ కల్పించాలి, ప్రాజెక్టు వ్యయం తగ్గాలి, పని చేసే కార్మికుని శక్తిని ఇనుమడింప చేయాలి. మా క్లయింట్ అవసరానికి తగినట్లు కస్టమైజ్డ్ ఎక్విప్మెంట్ను డిజైన్ చేయడం, తయారు చేయడం, ఇన్స్టాల్ చేయడం, యాన్యుయల్ మెయింటెనెన్స్ సర్వీస్ ఇవ్వడం, ఆ కంపెనీ ప్రాజెక్టు మరో చోటకు మారినప్పుడు ఎక్విప్మెంట్ని ఆ ప్రదేశానికి తీసుకువెళ్లి అమర్చడం... ఇలా ఉంటుంది మా పని. ఇప్పుడు దేశం ఎల్లలు దాటి విదేశాలకు కూడా విస్తరించాం. నా రంగంలో నేను లక్ష్యంగా పెట్టుకున్న శిఖరానికి చేరాననే చెప్పాలి. నా వంతు బాధ్యతగా మహిళా సమాజానికి, యువతకు కెరీర్ ప్లానింగ్ గురించి చెబుతున్నాను. కోవె (కన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) తెలంగాణ అధ్యక్షురాలిగా వేలాది మహిళలకు, యువతకు ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్‌సెట్ క్లాసులు చెప్తున్నాను. కంపెనీ నిర్వహణలో ఉద్యోగులను కలుపుకుపోవడం చాలా అవసరం. పని వరకే చేయించుకుని మిగిలిన విషయాల్లో వాళ్లను డార్క్‌లో ఉంచరాదు. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను వారితో చర్చించాలి. ఈ కంపెనీతో కొనసాగితే కెరీర్లో పైకి ఎదగగలమనే భరోసా కలిగితేనే ఉద్యోగులు మనతో కొనసాగుతారు. ఇలాంటి అనేక విషయాలను చెబుతుంటాను. ఈ జర్నీ నాకు సంతోషంగా ఉంది. ఏటా ఈ ఏడాది ఎంతమంది మహిళలకు దిశానిర్దేశం చేశానని లెక్కచూసుకున్నప్పుడు కనిపించే పెద్ద సంఖ్య నాకు ఆత్మసంతృప్తి కలిగించే విషయం ’’ అని వివరించారు జ్యోత్స్న చెరువు. లీడర్‌గా ఎదిగేది కొందరే! మా దగ్గరకు ట్రైనింగ్‌కు వచ్చిన మహిళలకు నేను చెప్పే తొలిమాట ‘మీ స్ట్రెంగ్త్ ఏమిటో మీరు తెలుసుకోండి’ అని. వాళ్లకు ఏం వచ్చో తెలిసిన తర్వాత వాళ్లకు ఎటువంటి కెరీర్ సౌకర్యంగా ఉంటుందో సూచిస్తాను. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలంటే... మొదటగా ఉండాల్సింది స్థిరత్వం. చిన్న ఉదాహరణ చెబుతాను... ఒక ఇస్త్రీ షాపు వ్యక్తి రోజూ కచ్చితంగా షాపు తెరవకపోతే మనం దుస్తులు ఇవ్వం కదా! రోజూ ఠంచన్‌గా పని చేసే వ్యక్తికి మాత్రమే ఇస్తాం. ఇంటి ముందుకు వచ్చే వాళ్ల దగ్గర కూరగాయలు కొనాలన్నా అంతే. మన సర్వీస్ అందుకునే క్లయింట్ ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునే పరిస్థితిని కల్పించకూడదు. ఎందరు వచ్చినా, ఎవరూ రాకపోయినా సరే వర్క్‌ప్లేస్‌ని మూతవేయరాదు. నేను నా రంగంలో సంపాదించుకున్న నమ్మకం అదే. ఏ సమయంలో ఫోన్ వచ్చినా సరే... ఎవరో ఒకరు హాజరవుతారనే భరోసా కల్పించడంలో విజయవంతం అయ్యాం. మా దగ్గరకు కోర్సులో చేరిన పాతిక మందిలో చివరకు ఆ కోర్సును ఉపయోగపెట్టుకునేవాళ్లు పదికి మించరు. కోర్సు సమయంలో ‘ఇంటికి బంధువులు వచ్చార’ని క్లాసు మానేసే వాళ్లు ఎంటర్ ప్రెన్యూర్‌గా కూడా కొనసాగలేరు. బిజినెస్ రంగంలో ఉన్న ఇద్దరు మగవాళ్లు కలిస్తే తమ వ్యాపారం గురించి, ఇతరుల వ్యాపారం గురించి, విస్తరణకు ఉన్న అవకాశాల గురించి మాట్లాడుకుంటారు. అదే ఇద్దరు మహిళలు రిలేషన్ షిప్ మీద మాట్లాడినంతగా తమ ప్రొఫెషన్ గురించి చర్చించరు. ప్రొఫెషన్ గురించి మాట్లాడగలిగిన మహిళలే లీడర్లుగా ఎదుగుతారు, ఫీల్డ్‌లో విజయవంతంగా నిలబడగలుగుతారు. – జ్యోత్స్న చెరువు, డైరెక్టర్, సిఎమ్ఏసీ, ప్రెసిడెంట్, కోవె తెలంగాణ – వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోహనాచారి -
Panchakshari Nagini: టాలెంట్‌కు మూ'ల'కం
కోవిడ్ పుణ్యమాని ఆన్లైన్ క్లాసుల పేరిట పిల్లలందరికీ స్మార్ట్ఫోన్లు అలవాటైపోయాయి. కానీ చాలా మంది వాటిని టైమ్‌పాస్‌గానే వాడేవారు. నెట్టింట తెగ హడావిడి చేసేవారు. స్మార్ట్ ఆలోచనతో ఆన్లైన్లో రికార్డ్ల వేట ప్రారంభించింది కామారెడ్డి జిల్లా పంచాక్షరి నాగిని. ఇంటర్మీడియెట్ చదువుతున్న నాగిని ఇటీవల 118 రసాయన మూలకాల పేర్లు 22 సెకన్లలో చెప్పి కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా మోటివేటర్‌గా మారింది. ఆట, పాట, క్విజ్, హ్యాండ్ రైటింగ్.. అన్నింటా తానే ఫస్ట్ అని నిరూపించుకుంటున్న నాగిని కృషి తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కృషి, పట్టుదల ఉంటే సాధ్యంకానిది ఏదీ లేదని నిరూపిస్తోంది ఇంటర్ విద్యార్థిని పంచాక్షరి నాగిని. రసాయన శాస్త్రంలో మూలకాల గురించి అడిగితే చాలు నోటి వెంట పదాలు పరుగులు తీస్తూనే ఉంటాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 118 మూలకాల పేర్లు 22 సెకన్లలో చెప్పి కలాం వరల్డ్ రికార్డు సాధించింది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన పంచాక్షరి శ్రీనివాస్, లక్ష్మీ సంధ్యల కూతురు నాగిని ఇంటర్ సెకండియర్ చదువుతోంది. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్.. ఇలా 118 మూలకాల గురించి అతి తక్కువ సమయంలో చెప్పి, రికార్డులను సృష్టించింది. ఇంజినీరింగ్ చదివి ఆపై సివిల్స్‌లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న నాగిని జ్ఞాపకశక్తిలోనే కాదు మాటల్లోనూ దిట్టే అని పేరు సాధించింది. మంచి వక్తగా రాణిస్తోంది. తాను చదువుకునే కాలేజీలోనే మోటివేషన్ క్లాసులు ఇస్తోంది. అంతేకాదు, స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు మోటివేటర్‌గా క్లాసులు చెబుతుంటుంది. స్కూల్ నుంచి ఇస్రోకు మొదటి నుంచి చదువులో చురుకుగా ఉంటున్న నాగిని తొమ్మిదో తరగతిలో ఇస్రో నిర్వహించిన యువికా–2020 యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందింది. రాష్ట్ర స్థాయిలో మ్యాథ్స్ టాలెంట్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. పదో తరగతిలో స్టేట్ లెవల్ సైన్స్ ఫేయిర్‌లో పాల్గొని మొదటి బహుమతి సంపాదించింది. కరోనాను వెళ్లిపొమ్మంటూ ‘గోబ్యాక్ కరోనా’ అన్న పాట స్వయంగా రాసి, పాడింది. అలాగే స్పీచ్ కాంపిటీషన్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. హ్యాండ్ రైటింగ్లోనూ గోల్డ్‌మెడల్ సాధించింది. ఖోకో, వాలీబాల్, కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో పాల్గొని, బహుమతులు గెల్చుకుంది. టాలెంట్ టెస్ట్ కరోనా సమయంలో ఇంటి వద్ద ఆన్లైన్ పాఠాలు వింటున్న నాగిని దృష్టి మూలకాల మీద పడింది. మొదట్లో కొంత ఇబ్బందిపడ్డా మెల్లమెల్లగా టార్గెట్ పెట్టుకుని ముందుకు సాగింది. 118 మూలకాల పేర్లను తొలుత 27 సెకన్లలో చదివి భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకుంది. ఆ తర్వాత తన టాలెంట్‌ను మెరుగు పరుచుకునే ప్రయత్నం చేసింది. కొంతకాలానికే 22 సెకన్లలో 118 మూలకాల పేర్లు చదివి కలాం వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించింది నాగిని. ఆన్లైన్లో జరిగిన నేషనల్ మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ‘లర్న్ సంథింగ్ విత్ నాగిని’ అనే పేరుతో యూట్యూబ్‌లో చానల్ నిర్వహిస్తోంది. మోటివేటర్‌గా పనిచేస్తోంది. తన జూనియర్లకు క్లాసులు చెబుతోంది. ఆన్లైన్ రికార్డులు నా లక్ష్యం సివిల్స్ వైపే. ఆ దిశగా ఇప్పుడే ప్రణాళికలు వేసుకుంటున్నాను. ఇలాంటి ఆలోచనలు నాలో కలగడానికి కరోనా నాకు టర్నింగ్పాయింట్లా ఉపయోగపడింది. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్ చేతిలో పట్టుకోవడం, దాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నాలు చేశాను. దాని ద్వారానే రికార్డుల సాధనకు మరింత సులువు అయ్యింది. – పంచాక్షరి నాగిని – ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
భర్త హఠాన్మరణం.. ఇద్దరు బిడ్డల భారం.. ఆమెను నిలబెట్టిన ఆంగ్లం
వెనుకటి రోజుల్లో.. కాస్త చదువుకున్న అమ్మాయి అయితే పుట్టే పిల్లలకు చదువు చెప్పగలుగుతుందన్న ఉద్దేశ్యంతో చదువుకున్న అమ్మాయిల్ని కోడలిగా చేసుకునేందుకు ఇష్టపడేవారు. ఇలా ఇష్టపడి చేసుకున్న ఓ కోడలే కామ్నా మిశ్రా. ‘‘అత్తింటివారు ఎంతో ఇష్టపడి చేసుకున్నారు. ఇంకేం... నా జీవితం సంతోషంగా గడిచిపోతుంది అనుకుంది కామ్నా, కానీ అనుకోని సమస్యలతో అంతా తలకిందులైంది. అయినప్పటికీ తనకున్న నైపుణ్యాలతో చితికిపోయిన కుటుంబాన్ని నిలబెట్టి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన కామ్నా మిశ్రా చిన్నప్పటి నుంచి చదువులోనూ, ఆటపాటల్లోనూ ఎంతో చురుకుగా ఉండేది. ఆంగ్లం అంటే అమిత మక్కువ. మంచి మార్కులతో డిగ్రీ పాస్ కావడంతో ఆమె గురించి తెలిసిన వాళ్లు కోరికోరి ఆమెను తమ ఇంటికోడలుగా చేసుకున్నారు. జైలు లాంటి ఇల్లు.. జీవితం ఎంతో చక్కగా ఉంటుందన్న కలలతో అత్తారింట్లో అడుగు పెట్టింది కామ్నా. అయితే, అత్తింటి వారి ఆంక్షలు, ఆరళ్లతో ఆమె సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ వార్తాపత్రికలు, కథలు చదవడం, రాయడంతోపాటు చుట్టుపక్కల పిల్లలకు పాఠాలు కూడా చెప్పేది. ఇంతలో కామ్నాకు ఊహించని విపత్తు పాతాళానికి తొక్కేసినట్లు అనిపించింది. భర్త హఠాన్మరణంతో.. ఇద్దరు పసిబిడ్డల భారం ఆమెపై పడింది. కాలానికి తగ్గట్టుగా... భర్త అకాల మరణంతో కుటుంబ భారాన్ని మోయక తప్పని పరిస్థితి ఎదురైనప్పటికీ ఏ మాత్రం భయపడలేదు కామ్నా. ఇంటికి దగ్గరల్లోని ఓ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పేది. ఇలా మూడేళ్లపాటు వివిధ రకాల ఇన్స్టిట్యూట్స్లో పనిచేసాక ..కామ్నా సొంతంగా ఇన్స్టిట్యూట్ను తెరిచింది. దీనిద్వారా అనేకమందికి ఆఫ్‌లైన్, ఆన్లైన్ పాఠాలను బోధించడం సాధ్యమైంది. గృహిణులు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇంగ్లిష్‌తోపాటు, డ్యాన్సింగ్, యాక్టింగ్ వంటివి కూడా నేర్పిస్తోంది. మోటివేషనల్ స్పీకర్‌గా పనిచేస్తోంది. ఇందుకోసం తను కూడా నిరంతరం చదువుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కుటుంబానికి అండగా నిలుస్తోంది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ‘‘అమ్మాయిల విషయంలో సమాజం మారాల్సిన అవసరం ఉంది. ప్రతి అమ్మాయికి తనకు నచ్చిన విధంగా బతికే హక్కు ఉంది. కలలను కలలుగానే కూలిపోనివ్వవద్దు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగాలి. ఏదైనా నేర్చుకోవడానికి వయసుతో పనిలేదు. ఎక్కడైనా, ఎక్కడి నుంౖచెనా కొత్తవాటిని నేర్చుకోవాలి. అప్పుడే జీవితం రంగుల మయం అవుతుంది. అందుకు నా జీవితమే ఉదాహరణ’’. – కామ్నా మిశ్రా చదవండి: తల్లి నగలు తాకట్టు పెట్టి గెర్బెరా పూలను సాగు చేశారు.. లక్షలు సంపాదిస్తున్నారు -
తన ప్రసంగాలతో స్ఫూర్తిని నింపే వ్యక్తే.. చివరికి ఇలా..
సాక్షి, నిజామాబాద్: కాసాల జైపాల్‌రెడ్డి.. అతడో మోటివేటర్.. ఒత్తిడితో కుంగిపోయి, సమస్యలతో పో రాడలేక జీవితంపై విరక్తిచెందిన ఎందరికో తన ప్రసంగాలతో స్ఫూర్తిని నింపిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు.. ‘‘ధైర్యముంటే ఈ ధరణిపైన సాధించలేని దంటూ ఏదీ లేదు’’ అంటూ ధైర్యాన్ని నూరిపోసిన ఆయన.. చివరికి తన అనారోగ్య సమస్యకు పరిష్కారం కనుగొనలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజాంసాగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. పిట్లం మండలం అల్లాపూ ర్కు చెందిన జైపాల్‌రెడ్డి(34) ఎంసీఏ, ఎంఏ ఇంగ్లిష్, ఎమ్మెస్సీ సైకాలజీ చదివారు. ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఆయన వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మోటివేషనల్ క్లాసులతో వేలాది మందికి వ్యక్తిత్వ వికాసాన్ని అందించారు. పరీక్షలంటే భయం పోగొట్టారు. సుమారుగా 8 వేల సదస్సులలో పాల్గొని ఎందరిలోనో స్ఫూర్తిని నింపారు. ఆత్మహత్యాయత్నం నుంచి.. జైపాల్‌రెడ్డి గతంలో ఓసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. 2004లో అనారోగ్య సమస్యతో మానసికంగా కుంగిపోయిన ఆయన బాసర చేరుకున్నారు. బలవన్మరణానికి పాల్పడాలనుకున్న సమయంలో స్వామి వివేకానంద సూక్తులు తన మనసులో మెదిలాయని, దీంతో బతకాలని నిర్ణయించుకున్నానని ఆయన పలు సందర్భాలలో పేర్కొన్నారు. చదవండి: కారు ప్రమాదం.. బీజేపీ నేత కొడుకుతో సహా ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి ఆరోగ్యం బాగాలేక.. జైపాల్‌రెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా గుల్దస్తా సమీపంలో నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోమవారం ఉదయం ఫేస్బుక్లో పోస్టు చేశారు. పోస్టును చూసిన ఆయన స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ప్రాజెక్టు వద్దకు వెళ్లిన పోలీసులకు జైపాల్‌రెడ్డి బైక్, చెప్పులు, ఫోన్ కనిపించాయి. జాలరి సాయంతో ప్రాజెక్టులో గాలించగా మృతదేహం లభించింది. పేద కుటుంబం కావడం, అనారోగ్యం తీవ్రం కావడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: విష సర్పాన్ని ముద్దాడి.. మృత్యువుతో పోరాటం! -
స్వర్ణలత ఈ స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు!
చెవులు వినపడవు. ‘పాపం ఈ పిల్లను ఎవరు చేసుకుంటారు?’ కళ్లు కనిపించవు. ‘అయ్యో. ఎలా బతుకుతుంది’ నడవలేదు. ‘జన్మంతా అవస్థే’ దివ్యాంగులపై జాలి, సానుభూతి రోజులు పోయాయి. వాటిని ఉచితంగా పడేస్తే అదే పదివేలు అని మహిళా దివ్యాంగులు అనుకోవడం లేదు. మేము సాధిస్తాం.. మేము జీవిస్తాం... ఈ జగత్తు మాది కూడా అని ముందుకు సాగుతున్నారు. స్వర్ణలత ఒక ఉదాహరణ. మస్క్యులర్ డిజార్డర్ వల్ల వీల్‌చైర్‌కు పరిమితమైనా గాయనిగా, రచయితగా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా, మోటివేషనల్ స్పీకర్‌గా గుర్తింపు పొందింది. ఆమె స్ఫూర్తిదాయక పరిచయం ఇది. జీవితం ఒక్కోసారి అడుగు ముందుకు పడనివ్వదు. మరోసారి శరీరం కదలిక కోల్పోయి ముందుకు అడుగు పడనివ్వదు. కాని జీవితంలో కాని, శరీరం మొరాయించినప్పుడు కాని మొండి పట్టుదలతో ముందుకు సాగితే దారి కనిపిస్తుంది. గమ్యం కనిపిస్తుంది. గమనంలో తోడు నిలిచేవాళ్లుంటారని తెలిసి వస్తుంది. అచలనంలో జీవితానికి సార్థకత లేదని చలనంలోనే పరమార్థం ఉందని అర్థమవుతుంది. దివ్యాంగులు గతంలో న్యూనతతో ఇంటికి పరిమితమయ్యేవారు. నలుగురిలో వచ్చేవారు కాదు. ఇక ఆ దివ్యాంగులు స్త్రీలైతే మానసిక కుంగుబాటుతో ముడుచుకుపోయేవారు. కాని ఆ రోజులు పోయాయి. ‘మనల్ని మనలాగే మన శారీరక పరిమితులతోనే గౌరవించేలా ఈ సమాజంలో మార్పు తేవాలి. ఒకరిపై ఆధారపడకుండా మన జీవితాన్ని జీవించాలి. నలుగురికీ స్ఫూర్తినివ్వాలి’ అని మహిళా దివ్యాంగులు ముందుకు సాగుతున్నారు. జాలి చూపులు, సానుభూతి మాటలు... ఇవి అక్కర్లేదు... ఈ సమాజంలో దివ్యాంగులు ఒక భాగమని గుర్తించి... ఈ జగత్తులో తమ వాటా చోటును మాకు వదిలిపెట్టి... అందరూ తిరుగాడే చోటుల్లో తాము కూడా అడుగుపెట్టేలా సౌకర్యాలు ఉంచితే చాలు అని అంటున్నారు. పెద్ద ఉద్యోగాలు, డాక్టర్ చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. వీల్‌చైర్‌కు పరిమితమైనా ఆలోచనలకు రెక్కలు ఇస్తున్నారు. స్వర్ణలత– మల్టిపుల్ స్ల్కెర్లోసిస్ స్వర్ణలత వేదిక మీదకు వస్తే చాలు కరతాళధ్వనులు వినిపిస్తాయి. ఎందుకు? ఆమె మోటివేషనల్ స్పీకర్. ‘చూడండి... నేను వీల్‌చైర్‌లో ఉన్నాను. 80 శాతం నా శరీరంలో కదలిక లేదు. మీరు నూరు శాతం కదల వీలైన శరీరంతో ఆరోగ్యంగా ఉన్నారు. నేను నా పరిమిత కదలికల్లోనే సమాజం కోసం ఇంత చేస్తుంటే మీరు ఎంత చేయాలి?’ అని ఆమె ప్రశ్నిస్తే వింటున్నవారు చప్పట్లు కొడుతూ ఇన్స్పైర్ అవుతారు. కాని స్వర్ణలత ఈ స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు. బెంగళూరులో జన్మించిన స్వర్ణలత చిన్నప్పుడు ఆరోగ్యంగా ఉండేది. బాగా చదువుకుందామనుకుంది. కాని దిగువ మధ్యతరగతి కుటుంబం ఆమెను అడుగు పడనివ్వక కంప్యూటర్స్‌లో డిప్లమా చాల్లే అని ఆపేసింది. ఆ తర్వాత ఆమె ప్రేమించిన కుర్రాణ్ణి పెళ్లి చేసుకుంటే వెలి వేసి ఇంటికి రాకుండా ఆపేసింది. జీవితం ఇలా నిరోధిస్తుంటే పెళ్లయ్యి పాప పుట్టాక 2009లో ఆమెకు హటాత్తుగా మెడ దిగువల పక్షవాతం వచ్చింది. డాక్టర్లు పరీక్షించి దాని పేరు ‘మల్టిపుల్ స్ల్కెర్లోసిస్ అన్నారు. అంటే మెడ కింద వెన్ను ప్రాంతంలో కండరాల ఇబ్బంది వచ్చి శరీరం చచ్చుబడుతుంది. చిన్న పాప, ఏం చేయాలో తోచని భర్త. కాని స్వర్ణలత ధైర్యం చెప్పింది. ‘ఏం కాదు... పోరాడదాం’ అంది. తనకు ధైర్యం రావాలంటే తనలాంటి వారికి మేలు చేయాలని అనుకుంది. తనలాంటి వారిని గుర్తించి వెంటనే మల్టిపుల్ స్ల్కెర్లోసిస్ వచ్చిన తనలాంటి వారిని గుర్తించేలా ‘స్వర్గ ఫౌండేషన్’ స్థాపించింది స్వర్ణలత. కర్నాటక, తమిళనాడుల్లో ఈ వ్యాధితో బాధ పడేవారి గురించి పని చేయసాగింది. వారికి అందాల్సిన వైద్యం, ఉండవలసిన అవగాహన, కుటుంబ సభ్యులు ఎలా చూసుకోవాలి, వీల్‌చైర్‌లో ఉంటూనే జీవితంపై ఆశ కలిగి బతికే ఉపాధి ఎలా పొందాలి... ఇలాంటి విషయాలన్నీ ఈ స్వర్గ ఫౌండేషన్ చూస్తుంది. అంతే కాదు పబ్లిక్ ప్లేసులలో దివ్యాంగుల రాకపోకలకు అనువుగా ఉండేలా ర్యాంప్‌ల నిర్మాణం చేపట్టేలా సమాజాన్ని, పాలనా వ్యవస్థని అని సెన్సిటైజ్ చేస్తుంది. ‘కోయంబత్తూరులో దాదాపుగా అన్ని పబ్లిక్ ప్లేసుల్లో ర్యాంప్‌లు వచ్చేలా చూశాం. బడి కాని ఆస్పత్రి కాని దివ్యాంగులు సౌకర్యంగా వెళ్లి రావచ్చు’ అంటుంది స్వర్ణలత. కాని దివ్యాంగుల పట్ల సమాజం ఎంతో మారాల్సి ఉంది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, రెస్టరెంట్లు, థియేటర్లు.. ఎన్నో వారి రాకపోకలకు వీలుగా లేవు. ఈ జగత్తు వారిది కూడా. వారు అందరిలానే అన్ని సౌకర్యాలు పొందుతూ జీవించేలా చూసే బాధ్యత మనది కూడా. ఆ విధంగా ఆలోచిద్దాం. ‘సారథి’లాంటి వాహనం స్వర్ణలత తన ఫౌండేషన్ తరఫున చేసిన మరో మంచి పని ‘సారథి’ పేర ఒక వాహనాన్ని తయారు చేయడం. ఇందులో దివ్యాంగులు తమ వీల్‌చైర్‌తో చాలా వీలుగా ప్రవేశించవచ్చు. లోపల సోఫా, బెడ్ ఉంటాయి. అంతేకాదు వేడి నీళ్ల బాత్రూమ్, టాయిలెట్ ఉంటాయి. ఇబ్బంది పడకుండా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. ‘ఈ సారథిని ఉపయోగించుకుని ఒక దివ్యాంగుడు మూడేళ్ల తర్వాత తన తల్లిని చూడటానికి వెళ్లాడు. ఒక 90 ఏళ్ల ఆమె ఎన్నేళ్లగానో చూడాలనుకున్న పుణ్యక్షేత్రానికి వెళ్లి వచ్చింది. నిజానికి ఇలాంటి వాహనాలు ప్రతి ఊళ్లో ఉండాలి. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టాలి. వీటిని ఫీజుతో, పేదలకు తక్కువ చార్జీలతో ఉపయోగించవచ్చు’ అంటుంది స్వర్ణలత. -
Haut Monde Mrs India Worldwide: ప్రతిభా షా
ఉద్యోగం చేసి అలసిపోయి..అబ్బా చాలా కష్టపడ్డాం... అనుకునే వాళ్లు కొందరైతే...ఈ ఉద్యోగం ఇంకెన్నాళ్లు చేస్తాం? ఇక చాలు విసుగొస్తుంది. ఇంకేదైనా కొత్తగా నేర్చుకుందాం! అని సరికొత్త ఉత్సాహంతో విభిన్న రంగాల్లో దూసుకుపోతుంటారు మరికొందరు. ఈ కోవకు చెందిన వ్యక్తే అమిషా సేథీ. రచయితగా... వెల్నెస్ కోచ్‌గా... గ్లోబల్ మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా విజయవంతంగా రాణిస్తూనే.. తాజాగా ప్రతిష్టాత్మక ‘హౌట్ మొండే మిసెస్ ఇండియా వరల్డ్‌వైడ్– 2021’ పదో సీజన్ విన్నర్‌గా నిలిచి, కిరీటాన్ని కైవసం చేసుకుంది. అమిషా రాజ్‌కోట్‌లో పుట్టినప్పటికీ పెరిగిందంతా ఢిల్లీలోనే. బాల్యంలో స్నేహితులతో కలిసి డ్యాన్స్‌షోలు చూడడం. థ్రిల్లర్, రొమాంటిక్ నవలలు చదువుతూ... సినిమాలు చూస్తూనే చదువులో మంచి గ్రేడ్లు తెచ్చుకునేది. తను చూసిన డ్యాన్స్షోల ప్రభావంతో చిన్ననాటి నుంచి కొరియోగ్రాఫర్ అవ్వాలని కలలను కనేది. కానీ వివిధ కారణాలతో కొరియోగ్రఫీ చేయలేకపోయింది. దీంతో ఇంటర్మీడియట్ అయ్యాక నోయిడాలోని బిజినెస్ స్కూల్లో ఎమ్బీఏ చదివింది. తరవాత చికాగోలోని‘ కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్’లో ఎగ్జిక్యూటివ్ స్కాలర్స్ ప్రోగ్రామ్ చేసింది. బడా కంపెనీలకు కన్సల్టెంట్‌గా.. అమిషా చదువు పూర్తయిన వెంటనే ఎయిర్‌టెల్‌లో ఉద్యోగిగా చేరింది. ఇక్కడ నాలుగేళ్లు పనిచేసాక, బ్లాక్‌బెర్రీ కంపెనీకి మారింది. ఈ రెండు కంపెనీలలో వివిధ హోదాల్లో పనిచేసింది. బ్లాక్‌బెర్రీలో బ్రాండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా, ఎయిర్ ఏసియాలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా, జఫీన్లో గ్లోబల్ సీఎమ్వోగా అత్యుతమ సేవలందించింది. అనేక బడా కంపెనీలకు కన్సల్టెంట్‌గా అమిషా అందించిన సేవలకుగాను.. వరల్డ్ ఉమెన్ లీడర్షిప్ కాంగ్రెస్ ఇచ్చే ‘యంగ్ ఉమెన్ రైజింగ్ స్టార్’, ద ఏసియా పసిఫిక్ యంగ్ ఉమెన్ అచీవర్స్ అవార్డు, సీఎన్‌బీసీ యూత్ అచీవర్స్ అవార్డు, మార్కెటింగ్ ఎక్స్‌లెన్స్ లాంటి ఎన్నో అవార్డులు వరించాయి. రచయిత నుంచి మోటివేషనల్ స్పీకర్ వరకు... కన్సల్టెంట్‌గా విజయవంతంగా దూసుకుపోతూ, అనేక ఉన్నతస్థాయి పదవుల్లో తనని తాను నిరూపించుకున్న అమిషాకు గ్రంథాలు, శిల్పాల మీదకు ఆసక్తి మళ్లింది. దీంతో వివిధ గ్రంథాలను చదువుతూ అనేక విషయాలు తెలుసుకునేది. గ్రంథాలను చదివేటప్పుడు తనకు వచ్చిన ఆలోచనలను కాగితం మీద పెట్టేది. అలాగే వివిధ భాషల్లో తను చదివిన గ్రంథాలను అందరూ చదివేందుకు వీలుగా అనువాదాలు చేసింది. ఇలా అమిషా రాసి పుస్తకం ‘ఇట్ డజంట్ హర్ట్ టు బి నైస్’ బెస్ట్‌సెల్లర్ బుక్‌గా నిలిచింది. పుస్తకాల ప్రమోషన్లో భాగంగా అమిషా మాటతీరు ఆసక్తికరంగా ఉండడంతో, ‘‘అంతా ఇంకా మాట్లాడండి’’ అంటూ ప్రోత్సహించడంతో అమిషా మోటివేషనల్ స్పీకర్‌గా మారింది. ప్రతి సెషన్‌కు ఏం మాట్లాడాలి? ఆరోజు ఏం సందేశం ఇవ్వాలి... అని బాగా సన్నద్ధమయ్యేది. ఏన్షియంట్ టైమ్‌లెస్ టెక్నిక్స్, మెడిటేషన్, ఫన్ గేమ్స్, న్యూరోసైన్స్, సైకలాజికల్ టెస్టులను వివిధ వర్క్‌షాప్స్‌లో అందిస్తూ తన కంటెంట్‌ను మెరుగుపరుచుకుంది. ఇవేగాక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్, ఆసుపత్రులు, సపోర్ట్ సెంటర్లలో తరచూ హ్యాపీనెస్ సెషన్లను నిర్వహిస్తుండేది. వెల్నెస్కోచ్.. ఫిట్‌నెస్‌కు బాగా ప్రాముఖ్యతనిచ్చే అమిషా ‘ఏజ్ రివర్సల్ థెరపీస్’, యోగా, మెడిటేషన్, ఆధునిక వ్యాయామాలపై ఆసక్తితో వాటి గురించి లోతుగా తెలుసుకుని తను ఆచరించడంతోపాటు.. ఫిట్‌గా ఎలా ఉండాలో తోటి వాళ్లకు నేర్పించేంత ప్రావీణ్యాన్ని సంపాదించింది. తన ఫిటెనెస్, ఆకర్షించే రూపం, తెలివితేటలతో బెంగళూరు తరపున పాల్గొని ప్రతిష్టాత్మక హౌట్ మొండే మిసెస్ ఇండియా వరల్డ్‌వైడ్–2021 సీజన్–10 విజేతగా నిలిచింది. యూఏఈలో జరిగిన ఈ పోటీలో 21 దేశాల నుంచి అతివలు పాల్గొనగా, అందులో 96 మంది ఫైనలిస్టులలో గ్లామర్, గుడ్‌లుక్స్, తెలివితేటల ప్రతిభ ఆధారంగా అమిషా సేథీ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ‘‘జీవితంలో విజయం, ఓటమి రెండూ లేవు. జీవితమంటే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడమే. ఈ సూత్రం నమ్మే నేను ఈ స్థాయికి ఎదిగాను.’’ అంటూ అమిషా నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. -
అన్వేషీజైన్.. అందమైన మోటివేషనల్ స్పీకర్
అన్వేషీజైన్.. అందంతోనే కాదు, అద్భుతమైన మాటలతో కూడా మాయ చేయగల గ్రేట్ మోటివేషనల్ స్పీకర్. ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్, సినిమాలతో దూసుకుపోతున్న ఈ యూట్యూబ్ స్టార్ గురించి.. ► అన్వేషీ జైన్ జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని ఖజురహో. ►భోపాల్‌లోని రాజీవ్‌గాంధీ టెక్నికల్ యూనివర్సిటీలో ఎలాక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసింది. ► ఓ ప్రైవేట్ కంపెనీలో కొంతకాలం పనిచేసి, సొంతంగా బిజినెస్ ప్రారంభించింది. అది కాస్తా నష్టాల్లో పడడంతో ముంబై చేరింది. ►ఆమె అందమైన ముఖం, చక్కని శరీరాకృతి చూసి మోడల్‌గా చాన్స్ ఇచ్చింది ముంబైలోని మోడలింగ్ ఇండస్ట్రీ. పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. ►మోడల్‌గా వచ్చిన గుర్తింపు బుల్లితెరపై యాంకరింగ్ అవకాశాన్ని తెచ్చింది. సుమారు వెయ్యికి పైగా టీవీ, స్టేజ్ షోలు, పబ్లిక్ ఫంక్షన్లకు యాంకరింగ్ చేసింది. ► ‘అన్వేషీ జైన్’ పేరుతో యూట్యూబ్ చానెల్ ప్రారంభించి పలు వీడియోలు చేసింది. బంధాలు, అనుబంధాల గురించి చెప్పే ఆమె ప్రసంగాలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా మోటివేషనల్ స్పీకర్‌గానూ అన్వేషీ చాలా ఫేమస్. ► 2018లో ‘గందీ బాత్ 2’ వెబ్‌సిరీస్‌తో వెబ్ దునియాలోకీ ఎంటరై మరింత మంది అభిమానులను సంపాదించుకుంది. ► 2019లో ఆమెకు రెండు విభాగాల్లో ‘దాదాసాహెబ్ ఫాల్కే ఐకాన్’ అవార్డు లభించింది. ఒకటి ‘సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్’, రెండు ‘పర్సోనా ఆఫ్ ది ఇయర్’. ► ప్రస్తుతం త్వరలోనే విడుదల కానున్న ‘జీ’ అనే గుజరాతీ సినిమాలో నటిస్తోంది. కాలేజీ రోజుల్లో నా శరీరాకృతి గురించి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా. ఆ ఆకృతే ఇప్పుడు నా జీవితాన్ని మార్చేసింది. – అన్వేషీ జైన్ -
Neena Nizar: ఇది నాకు పెద్ద షాక్.. పేరు లేని విలన్ కాటేసింది!
ఎన్ని కష్టాలు ఎదురైనా పోరాటం ఎక్కడా ఆపకూడదని... ఎన్ని ఒడిదొడుకులకు లోనైనా ఎక్కడా ఆగిపోకూడదని... నినా నైజర్ జీవితం చాటి చెబుతుంది. పుట్టుకతోనే అరుదైన వ్యాధి వెంటాడినా ఆ వ్యాధి తనను వీల్‌చెయిర్‌కే పరిమితం చేసినా చదువుల రాణిగా వర్ధిల్లింది. మోటివేషనల్ స్పీకర్‌గా ఎదిగింది. తనకు పుట్టిన పిల్లలనూ అదే వ్యాధి కబళించి అడుగడుగునా నిరాశ తరుముతున్నా విధి విసిరిన ఛాలెంజ్‌ను చిరునవ్వుతో స్వీకరించింది. ‘అరుదైన వ్యాధి కారణంగా మేం ఒంటరిగా, బలహీనులుగా అనిపించవచ్చు. కానీ, మా కథను పంచుకోవడం ద్వారా చావు అంచున నిలబడిన వారిలో చిన్న ఆశను మిగిలిస్తే చాలు’ అంటోంది నీనా నైజర్. నాలుగు పదుల వయసు దాటిన నీనా నైజర్ దుబాయిలో ఓ వ్యాపారస్తుడి కుటుంబంలో పుట్టింది. పుట్టుకతోనే వెన్నెముకలో అరుదైన వ్యాధికి లోనైంది. ఏళ్లకేళ్లుగా చికిత్స జరుగుతూనే ఉంది. కానీ, వ్యాధి పేరేంటో తెలియలేదు. వెన్నెముకలో లోపాల వల్ల శరీరం అంతగా ఎదగలేదు. ఈ కారణంగా వీల్‌చైర్‌కే పరిమితం అయ్యింది. ఇండియా వచ్చి వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకుంది. లండన్, అమెరికాలోనూ ట్రీట్మెంట్ తీసుకుంది. ఏమంత ప్రయోజనం లేకపోయింది. అయినా ఆమె చదువుల తల్లిని వదిలిపెట్టలేదు. పీహెచ్‌డి పట్టా పుచ్చుకొని.. ‘చదువు ధైర్యాన్ని ఇస్తుందని నా నమ్మకం. అందుకే, నా దృష్టి అంతా చదువు మీదే. నాకు 16 ఏళ్ల వయసులో అమెరికాలోని క్రైటన్ విశ్వవిద్యాలయం లో చదువుకోవడానికి పూర్తి స్కాలర్షిప్ తో అవకాశం వచ్చింది. ఆ సమయంలో నా శరీరం శస్త్రచికిత్సల కారణం గా మరింత బలహీనంగా ఉంది. మా అమ్మానాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. అంతదూరం పంపించడానికి ఒప్పుకోలేదు. కానీ, నేను చదువుకోవాల్సిందే అని బలంగా చెప్పి, వెళ్లాను. 2018 లో క్రైటన్ విశ్వవిద్యాలయం నుండి ఎడ్యుకేషన్ లీడర్‌షిప్‌లో పీహెచ్‌డి పట్టాతో బయటకు వచ్చాను’ అని వివరించే నినా నైజర్ చదువులోనే కాదు వ్యాస రచన, పెయింటింగ్, చర్చాపోటీల్లో అనేక బహుమతులు గెలుచుకుంది. దేశవిదేశాల్లో మోటివేషనల్ స్పీచుల్లో పాల్గొంది. తలకిందులైన ప్రపంచం.. పునర్నిర్మాణం తను చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే ఆడమ్‌ను కలుసుకున్న నినా పెళ్లి తర్వాత ప్రయాణం గురించి వివరిస్తూ ‘పిల్లలు కలగరనే భయంతో పెళ్లే వద్దనుకున్నాను. ఆడమ్ తన ప్రేమ ప్రస్తావన తీసుకురావడంతో పెళ్లి చేసుకున్నాం. ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాను’ అని వైవాహిక జీవితం గురించి ఆనందంగా చెప్పే నైజర్ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తుంది. నైజర్కు మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఎలాంటి లోపం కనిపించలేదు. చాలా ఆనందంగా ఉన్నారు. రెండేళ్ల తర్వాత పుట్టిన చిన్నకొడుకులో మాత్రం పుట్టుకతోనే అరుదైన వ్యాధి ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఆ తర్వాత పెద్ద కొడుకుని పరీక్షించడంతో వాడిలోనూ ఈ అరుదైన సమస్య ఉందని, ఇది మెటాఫిసల్ కొండ్రోడైస్పా›్లసియా అని, జన్యుపరమైనదని వైద్యులు తేల్చారు. ‘ఇది నాకు పెద్ద షాక్. ఈ విషయం తెలియగానే నా ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది. నా శరీరం లోపల పేరులేని విలన్ నన్ను ఇంకా కృంగదీయాలనే చూసింది. కానీ, ఈ అరుదైన ప్రయాణంలో నా కుమారులతో కలిసి నడవాలనే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇది కష్టమైన మార్గం అని నాకు తెలుసు. కానీ, ఆ మార్గంలో చిరునవ్వుతో బయల్దేరాను’ అంటున్న నినా, తన ఇద్దరు కుమారులతో వైద్య పరిశోధనల్లో భాగమైంది. ముగ్గురూ వీల్చైర్లలో ఉండటంతో వారు ఇంటి నుండి బయటకు రావాలంటే మరొకరి సహాయం కావాలి. కానీ, తన కుటుంబంలో నిత్యం నవ్వులు పూయించడానికి తపిస్తూనే ఉంది నినా. ‘నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఇది వైకల్యం ఉన్నవారిలో కలిగే స్వతంత్ర భావనగా నేను ఆనందిస్తాను. మీ లక్ష్యం కేవలం ప్రయాణికుడిగా ఉంటే చాలదు, జీవితానికి బాధ్యత వహించాలి. ఈ రోజు నా కొడుకులు అర్షాన్, జహాన్ సూపర్ హీరోల్లా నాకు కనిపిస్తుంటారు. వారి ఆటపాటలు, అల్లరిని చూస్తుంటే ఎంతటి శత్రువునైనా ఓడించగల బలం వచ్చేస్తుంది’ అని ఆనందంగా వివరిస్తుంది నినా నైజర్. ఇప్పటికీ జీవితంలోని ఒడిదొడుకులను సవాళ్లుగా తీసుకొని చిరునవ్వుతో నిత్య పోరాటం చేస్తున్న నినా నైజర్ ఎంతో మంది నిరాశావాదులకు ఆశాదీపంలా కనిపిస్తుంది. ఇది నాకు పెద్ద షాక్. ఈ విషయం తెలియగానే నా ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది. నా శరీరం లోపల పేరులేని విలన్ నన్ను ఇంకా కృంగదీయాలనే చూసింది. కానీ, ఈ అరుదైన ప్రయాణంలో నా కుమారులతో కలిసి నడవాలనే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇది కష్టమైన మార్గం అని నాకు తెలుసు. కానీ, ఆ మార్గంలో చిరునవ్వుతో బయల్దేరాను. – నినా నైజర్ భర్త, పిల్లలతో నినా నైజర్ -
రక్తపు మడుగులో మునిగినా ఏడ్వలేదు.. కానీ
మానసిక వైకల్యమే అన్నింటి కంటే పెద్ద శాపం. ఒక విషయం పట్ల ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. కొంతమంది తీవ్ర ఉద్వేగాలకు లోనవుతారు. అయితే తాము మానసికంగా దృఢంగా లేమన్న విషయాన్ని గుర్తించరు. తమను పిచ్చివాళ్లుగా ముద్ర వేస్తారన్న భయంతో... అందుకు చికిత్స కూడా తీసుకోరు అంటారు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ మాళవిక అయ్యర్. భారతదేశ మహిళా అత్యున్నత నారీశక్తి పురస్కార గ్రహీత ఆమె. తమిళనాడుకు చెందిన మాళవిక పదమూడేళ్ల వయస్సులోనే అర చేతులు కోల్పోయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి మోటివేషనల్ స్పీకర్‌గా ఎదిగారు. సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ పొంది దివ్యాంగులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. డిసెంబరు 3న ‘వరల్డ్ డిసబిలిటీ డే’ సందర్భంగా శారీరక వైకల్యం ఉన్న వారి పట్ల సమాజం అనుసరించాల్సిన తీరును సోషల్ మీడియాలో ప్రస్తావించారు. నిజంగా శాపగ్రస్తురాలే..! ‘ఇది పదిహేడేళ్ల క్రితం నాటి మాట. నా రెండు చేతులు రక్తపు మడుగులో మునిగిపోయినపుడు నేను అంతగా ఏడ్వలేదు. డాక్టర్లు నా చేతుల్లో ఇనుప రాడ్లు వేసినపుడు కూడా ఎక్కువ బాధ పడలేదు. కానీ ఆస్పత్రి బెడ్ మీద ఉన్నపుడు నా పక్కనున్న ఆడవాళ్లు మాట్లాడిన మాటలు విని వెక్కివెక్కి ఏడ్చాను. జనరల్ వార్డులో కొత్త అమ్మాయి చేరిందట. తను నిజంగా శాపగ్రస్తురాలే. ఇక తన జీవితం ముగిసిపోయినట్లే అంటూ నా గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మొదటిసారిగా నా కళ్ల నుంచి ధారాపాతంగా కన్నీళ్లు కారాయి. బాంబు పేలుడులో అర చేతులు కోల్పోయిన నాకు భవిష్యత్తే లేదన్నట్లుగా వారు మాట్లాడారు. ఆ మాటలను అంగీకరించడానికి నా హృదయం అప్పుడు సిద్ధంగానే ఉంది. అయితే నా కుటుంబం, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం నాలో కొత్త ఉత్సాహం నింపింది. వారి చొరవతోనే నేనింత వరకు రాగలిగాను. నిజానికి దివ్యాంగుల పట్ల సమాజం స్పందించే తీరు సరిగా లేదు. ప్రతి ఒక్కరికీ అటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుందని’ మాళవిక చెప్పుకొచ్చారు. అదే పెద్ద శాపం.. ‘నిజానికి మానసిక వైకల్యమే అన్నింటి కంటే పెద్ద శాపం. ఎదుటివారిని ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు కానీ నిరాశ చెందేలా మాట్లాడకూడదు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 26.8 మంది దివ్యాంగులు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరిది 2.21 శాతం. ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి వంటి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడే ముందు ప్రతీ ఒక్కరు దివ్యాంగుల పట్ల తాము ప్రవర్తిస్తున్న తీరు గురించి ఆలోచించుకోవాలి. వారిని సమాజంలో మమేకం చేసి.. ఉద్యోగ భద్రత కల్పించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలి. శారీరక వైకల్యం ఉంటే ఇక జీవితం ముగిసినట్లే అనే మాటలు మానుకోవాలి. దివ్యాంగులనంతా ఒక్కచోట చేర్చడం కాదు.. వారికి ఏమేం అవసరమో గుర్తించి... వాటిని సమకూర్చాలి. అలా చేసినపుడే సమాజంతో వారు కలిసిపోగలుగుతారు. లేదంటే ఆత్మన్యూనతా భావంతో కుంగిపోతారు. అందుకే బాల్యం నుంచే ప్రతీ ఒక్కరు వివక్ష లేకుండా పెరిగే వాతావరణం కల్పించాలి. విద్యా విధానంలోనూ మార్పులు రావాలి. శారీరక వైకల్యం ఉన్న వారిని చారిటీ వస్తువులుగా చూపకుండా... దివ్యాంగులైనప్పటికీ సమాజంలో ఉన్నత స్థితికి చేరిన వారి గురించి పాఠ్యాంశంలో బోధించాలి. ఒకరిపై ఆధారపడకుండా.. సొంతంగా తమ పనులు తాము చేసుకునేలా తీర్చిదిద్దాలి. సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సాహం అందించాలి. సానుకూల దృక్పథం నెలకొనేలా సినిమాలు నిర్మించాలి. చేతులు, కాళ్లు లేకుంటే పెళ్లి కాదు. ఇక జీవితమే ఉండదు అనే పిచ్చి నమ్మకాలను తొలగించాలి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న దివ్యాంగులకు సమాజం పట్ల, తమ సమస్యల పట్ల ఒక అవగాహన ఏర్పడింది. తమ హక్కులకే గళాన్ని గట్టిగా వినిపించగలుగుతున్నారు. అయితే వారికి ప్రజాప్రతినిధుల, రాజకీయ నాయకుల అవసరం ఎంతగానో ఉంది. దివ్యాంగులను సమాజం నిండు మనస్సుతో ఆలింగనం చేసుకోవాలనేదే నా కల. ఆ దిశగా వడివడిగా అడుగులు పడాలి’ అని మాళవిక ఆకాంక్షించారు. గ్రానైడ్ పేలడంతో... మాళవిక అయ్యర్ తమిళనాడులోని కుంభకోణంలో క్రిష్ణన్- హేమా క్రిష్ణన్ దంపతులకు జన్మించారు. తండ్రి వాటర్ వర్క్స్‌లో ఇంజనీరుగా పనిచేసిన క్రమంలో ఆమె బాల్యం రాజస్తాన్‌లోని బికనీర్‌లో గడిచింది. అక్కడ ఉన్నపుడే ఓ రోజు తమ గ్యారేజీలో ఆడుకుంటున్న సమయంలో గ్రానైడ్ చేతుల్లో పేలి రెండు అరచేతులు పోయాయి. ఆ తర్వాత ఆమెను చెన్నైలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్క్రైబ్ సహాయంతో పరీక్షలు రాస్తూ మాళవిక తన విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు(ప్రైవేటు పరీక్ష) సంపాదించి ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రశంసలు పొందారు. అనంతరం ఉన్నత విద్య కోసం ఢిల్లీకి చేరకున్న మాళవిక... ఎకనమిక్స్ హానర్స్ చదివారు. అదే విధంగా సోషల్ వర్క్‌లో పీహెచ్డీ చేసి డాక్టరేట్ సంపాదించారు. 2013 నుంచి మోటివేషనల్ స్పీకర్‌గా మారి ఎంతోమందిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. వివిధ దేశాల్లో ప్రసంగాలు చేసిన మాళవిక.. సమాజ తీరు, మహిళలు, దివ్యాంగులపై వివక్ష వంటి అంశాలపై ఐక్యరాజ్యసమితిలోనూ తన గళాన్ని వినిపించారు. ఈ క్రమంలో ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా అత్యున్నత మహిళా పురస్కారం నారీ శక్తి పురస్కార్‌తో సత్కరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. ఇదే కాదు మరెన్నో పురస్కారాలను మాళవిక అందుకున్నారు. 17 years ago, when I was lying on the hospital bed, I heard a bunch of women whisper, “Did you see that new girl in the general ward? What a shame! She must be cursed as now her life has now come to an end.”#WorldDisabilityDay #InternationalDisabilityDay #IDPD2019 #Disability pic.twitter.com/P9ZhWDslIK — Dr. Malvika Iyer (@MalvikaIyer) December 3, 2019 -
తన జీతంలో 40 శాతం ఉచిత శిక్షణకే..
సాక్షి, నాగర్‌కర్నూల్ : నాన్న ఆశయమే ఆయన ఊపిరి.. సమాజంలో ఉన్నత విలువలతో కూడిన విద్యనందించడమే లక్ష్యం.. అలుపెరగని సేవాభావం.. నిరుద్యోగుల పట్ల ఆయనకున్న అభిమానం వెరసి కొన్ని వేల మంది నిరుద్యోగుల ఇంట ఉద్యోగాల పంట పండుతోంది. తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్న నిరుద్యోగులకు ప్రేరణ కల్పించి.. ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కింది. నాడు బడిబయటి బాలుడు అయిన ఆయన ఓ ఉపాధ్యాయుడు ఇచ్చిన స్ఫూర్తితో మూడు ఉద్యోగాలు సాధించాడు. ఆర్థిక స్థోమత లేని నిరుద్యోగుల కష్టాలు తెలుసుకున్న ఆయన నేడు వేల మందికి ఉచితంగా ఉద్యోగ శిక్షణ అందిస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకకాలంలో రాష్త్రవ్యాప్తంగా 22 ఉచిత కోచింగ్ సెంటర్లను నిర్విరామంగా నడుపుతూ వందలాది మంది నిరుద్యోగుల్లో వెలుగులు నింపుతున్నారు. విధి నిర్వహణలో ఒకవైపు సమాజంలో తాగుబోతుల మత్తు వదిలిస్తూ.. మరోవైపు నిరుద్యోగులను ఉద్యోగాల బాటపట్టిస్తున్నారు. ఆయనే నాగర్‌కర్నూల్ జిల్లా ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు. . వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా 22 సెంటర్లలో దాదాపు 10 వేల మందిపై చిలుకు నిరుద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. తన ఉద్యోగ విరామ సమయంలో ఉదయం 7 నుంచి 9 గంటలు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రెండు దఫాలుగా శిక్షణ అందిస్తున్నారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌లో 2, వనపర్తిలో ఒకటి, మహబూబ్‌నగర్‌లో మూడు, షాద్‌నగర్‌లో ఒకటి, ఖైరతాబాద్‌లో ఒకటి, సిద్ధిపేటలోని వర్గల్లో ఒకటి, మహత్మాగాంధీ యూనివర్శిటీ బాలబాలికలకు రెండు, చర్లపల్లిలో ఒకటి, నల్లగొండ టౌన్లో మూడు, దేవరకొండలో రెండు, హాలియాలో ఒకటి, సూర్యాపేటలో రెండు, కోదాడలో రెండు, ఖమ్మంలో ఒకటి చొప్పున ఆన్లైన్ శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇంకా 70 కేంద్రాల ఏర్పాటు కోసం వినతులు వస్తున్నాయని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏర్పాటు చేయలేకపోతున్నానని చెబుతున్నారు ఏడుకొండలు. కుటుంబ నేపథ్యం.. ఏడుకొండలు స్వస్థలం నల్లగొండ జిల్లా పెద్దఊర మండలం నాయనవాయికుంట. బాల్‌నర్సయ్య, లింగమ్మల రెండో సంతానం ఏడుకొండలు. వీరిది వ్యవసాయం కుటుంబం. ఎనిమిదో తరగతిలోనే బడి మానివేసి తల్లిద్రండులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్తుండేవాడు. అలా ఏడాదిపాటు చదువుకు దూరంగా ఉన్నాడు. చదువుతున్న సమయంలో ఈయన ప్రతిభను గుర్తించిన లీనస్ అనే ఉపాధ్యాయుడు చదువు విలువను తెలిపి ప్రోత్సహించాడు. దీంతో ఏడుకొండలు మళ్లీ బడి లో చేరి మంచి ఉత్తీర్ణతతో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశాడు. వెంటనే 2003లో జైలు వార్డెన్‌కు నోటిఫికేషన్ రావడంతో కష్టపడి చదివి ఉద్యోగాన్ని సాధించాడు. విశాఖపట్నంలో జైలు వార్డెన్ విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు గ్రూప్–2 పరీక్షకు సన్నద్ధమయ్యాడు. శిక్షణ లేకుండానే 2007లో ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాన్ని సాధించాడు. నల్లగొండ ఎక్సైజ్ ఎస్ఐగా చేరాడు. తర్వాత కొన్నేళ్లకే సీఐగా ప్రమోషన్ పొందాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఓ ప్రైవేట్ శిక్షణ సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఆయనను అతిథిగా ఆహ్వానించారు. అక్కడ ఆయన ప్రసంగాన్ని విన్న వి ద్యార్థులు, సన్నిహితులు ఆశ్చర్యపోయారు. ఆయన చెప్పిన విధానం ప్రతిఒక్కరి మనసుల్లోకి చొచ్చుకుపోయింది. ఇలాంటి ప్రేరణ నిరుద్యోగులకు కావాలని తన సన్నిహితులు చెప్పిన మాటలతో 2015లో 38 మంది విద్యార్థులతో బీసీ స్టడీ సర్కిల్లో శిక్ష ణ తరగతులు ప్రారంభించారు. ఇలా ఇంతింౖ తె వటుడింతై అన్న చందంగా 38 మందితో ప్రారంభించిన శిక్షణతో పది వేల పైచిలుకు మందికి మార్గదర్శిగా నిలిచాడు. ఏడుకొండలు ఇచ్చే శిక్షణ తరగతులు నిరుద్యోగులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. రూ.వేలకు వేలు ఫీజులు చెల్లించి శిక్షణ తీసుకోలేక ఆర్థిక స్తోమత లేని నిరుద్యోగుల పాలిట ఆయన దేవుడిలా నిలిచారు. పోలీస్, ఫారెస్ట్, రెవెన్యూ, ఉపాధ్యాయ ఇలా పలు శాఖల్లో ఇప్పటి వరకు దాదాపు 500 మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తాను ఇచ్చే శిక్షణకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నత ఉద్యోగాల కోసం శిక్షణకు హాజరవుతుండడం గమనార్హం. ఇప్పుడు తరగుతులకు హాజరవుతున్న అందరినోట గ్రూప్– 1 మాటే వినిపిస్తోంది. తండ్రి మాటలే స్ఫూర్తిగా.. మనకు ఉన్నంతలో కొంత ఇతరులకు పంచడంలో వచ్చే ఆనందం వెలకట్టలేనిదని, ఒకరి నుంచి తీసుకోవడం కాకుండా మనం ఏమివ్వగలం అనే ఆలోచన ఉన్నప్పుడే ప్రతిఒక్కరిలో మార్పు వస్తుందని తన తండ్రి బాల్‌నర్సయ్య ఎప్పుడూ చెబుతుండేవాడని, ఆయనే తనకు స్ఫూర్తి అని చెబుతున్నాడు ఏడుకొండలు. సమాజంలో విలువలతో కూడిన విద్య అందించడమే లక్ష్యమని, దాని కోసం ఎంత ఇబ్బంది అయినా ముందుకు వెళ్తున్నాడు. తనకు వచ్చే జీతంలో 40 శాతం ఉచిత శిక్షణకే ఖర్చు చేస్తున్నారు. కుటుంబం నుంచి కూడా సహకారం ఉండడంతో మరింత ముందుకు వెళ్తున్నారు. ఉన్నదాంట్లోనే సర్దుకుంటూ యువతను మరో ఏడుకొండలుగా మార్చి సమాజ మార్పునకు తనవంతు కృషిచేస్తున్నాని చెబుతున్నారు. సోషల్, సైన్స్‌లపై పట్టుసాధించా నేను బీటెక్ పూర్తి చేశాను. నాకు సోషల్, సైన్స్ వాటిపై పట్టులేదు. చాలా భయంగా ఉండేది. కానీ సార్ తరగతులకు హాజరయ్యాక వీటిపై పూర్తిగా పట్టు సాధించాను. నేను సాధించిన ఈ ఉద్యోగానికి సార్ తరగతులే ఉపయోగపడ్డాయి. – జ్యోతి, పంచాయతీ సెక్రటరీ, వనపర్తి మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యా.. నేను సార్ తరగతులకు రాక ముందు గతేడాది కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఒక్క మార్కు తేడాతో కోల్పోయా. తర్వాత సార్ తరగతులకు హాజరయ్యాక అక్కడ ఇచ్చిన మోటివేషన్, శిక్షణతో ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యా. ఏడుకొండలు సార్ తరగతులను నేను మర్చిపోలేను. – సంతోష, స్కూల్ అసిస్టెంట్, గుండాల, యాదాద్రి జిల్లా మోటివేషన్ అద్భుతం.. పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ సార్ శిక్షణ తరగతులకు హాజరయ్యాను. అప్పుడే వరుస నోటిఫికేషన్లు రావడంతో గ్రూప్– 4, పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు ఎంపికయ్యా. ఏడుకొండలు సార్ ఇచ్చే మోటివేషన్ అద్భుతం. అది ఎంతటి వారినైనా ముందుకు తీసుకెళ్తుంది. ప్రస్తుతం నా ముందు ఉన్న లక్ష్యం గ్రూప్– 1. – సాయిప్రియ, వీఆర్ఓ, మాదారం, కల్వకుర్తి సహకారం మరువలేనిది.. ఉద్యోగ బాధ్యతలు, శిక్షణను ఇంత సమర్థవంతంగా కొనసాగించడంలో నా కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది. ఇతర ప్రాంతాల్లో శిక్షణ అందించడానికి నా భార్య జ్యోతి, అమ్మ లింగమ్మ, సోదరుడు శ్రీనివాస్ ఎంతో అండగా నిలిచారు. నా కుమారులు కార్తీక్, కౌశిక్ కూడా అవీ ఇవీ కొనివ్వాలంటూ ఇబ్బందులు పెట్టలేదు. ఆన్లైన్ శిక్షణకు స్క్రీన్లు, ఇంటర్నెట్ బిల్లు మొత్తం సొంతంగా ఖర్చు పెట్టుకున్నా. ఇంకా సెంటర్లు ఓపెన్ చేయాలని పలు ప్రాంతాల నుంచి వినతులు వస్తున్నాయి. కానీ ఆర్థికంగా లేక వెనకడుగు వేస్తున్నా. ఎవరైనా ఆర్థికతోడ్పాటుకు ముందుకు వస్తే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని లక్షల మందికి శిక్షణ అందించవచ్చు. – ఏడుకొండలు, ఎక్సైజ్ సీఐ, నాగర్‌కర్నూల్ -
స్వామీజీ మహిళలను చూడగానే..!
జైపూర్: ఓ కార్యక్రమానికి హాజరైన స్వామిజీ మహిళా ప్రేక్షకులు ముందు వరుసలో కూర్చొని ఉండడం చూసి, సభలో ప్రసంగించకుండానే వెనుదిరిగిన ఘటన జైపూర్‌లో చోటు చేసుకొంది. జైపూర్ బిర్లా ఆడిటోరియంలో జూన్ 30న నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రముఖ గురువు స్వామి జ్ఞానవాత్సల్య, తన ప్రసంగాన్ని ప్రారంభించకుండానే వెనుదిరిగారు. తాను ప్రసంగించే ఆడిటోరియంలోని మొదటి మూడు వరుసలలో మహిళలను కూర్చోనివ్వడానికి అనుమతించకూడదని స్వామి జ్ఞానవాత్సల్య ముందుగానే సభ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. తాను షరతు పెట్టినా కూడా నిర్వాహకులు మహిళలను ముందు వరుసలో కూర్చొనిచ్చిన కారణంగా.. స్వామిజీ ఈ కార్యక్రమం నుంచి వైదొలిగినట్లు నిర్వాహకులు వెల్లడించారు. 'రాజ్ మెడికాన్ 2019' అనే ఈ కార్యక్రమాన్ని 'ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఆల్ రాజస్థాన్ ఇన్ సర్వీస్ డాక్టర్స్ అసోసియేషన్ (అరిస్డా)' నిర్వహించింది. మహిళా వైద్యులు స్వామి జ్ఞానవాత్సల్య విధించిన షరతులపై కొందరు మహిళా డాక్టర్లు కలత చెందగా, మరికొందరు దీనికి వ్యతిరేకంగా స్వామిజీ ప్రసంగాన్ని అడ్డుకుంటామని నిరసన తెలిపారు. అయితే వైద్యులు, నిర్వాహకుల మధ్య జరిగిన ఒప్పందం మేరకు, మొదటి రెండు వరుసలను ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు. కానీ, స్వామిజీ వేదిక వద్దకు రాగానే.. కొందరు మహిళలు ముందు వరుసలో వచ్చి కూర్చొన్నారు. ఈ సంఘటన గూర్చి డాక్టర్ రితు చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. స్వామిజీ ప్రసంగం వినడానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చాలా మంది మహిళలు మొదటి మూడు వరుసల్లో కూర్చున్నారు. హఠాత్తుగా మొదటి మూడు వరుసల్లో మహిళలు కూర్చొరాదని అనడంతో గందరగోళం నెలకొందని అన్నారు. -
నీకోసం నీవే చదివి ఎదగాలి
నిజామాబాద్‌నాగారం(నిజామాబాద్‌అర్బన్): నీ కోసం నీవే చదివి జీవితంలో ఎదగాలని, అమ్మానాన్నల కోసమో, స్నేహితుల కోసమో, బంధువుల కోసమో, చుట్టు పక్కల వారికోసమో చదవొద్దని మోటివేషన్ స్పీచ్ నిపుణుడు, ఉత్తమ యువసారథి అవార్డు గ్రహీత బ్రదర్ షఫీ సూచించారు. ప్రపంచంలో కేవలం ఒకశాతం మందిమాత్రమే లక్ష్యాలను సాధిస్తున్నారని, మిగతా 99శాతం మంది కారణాలు చూపుతూ లక్ష్యసాధనను పక్కనపెడుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో గురువారం రాత్రి మైనారిటీ గురుకులాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కీ – సక్సెస్’ సదస్సుకు ఆయన హాజరై విద్యార్థులు, నగరవాసులనుద్ధేశించి ప్రసంగించారు. సృష్టిలో అన్ని జన్మలకంటే మానవ జన్మ గొప్పదని, భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి వ్యక్తి నిరంతరం సాధన చేయాలన్నారు. ఈ ప్రపంచంలో విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఎంతో మంది మహనీయులు నిరూపించారన్నారు. సమస్యలు ఎదురవగానే జీవితం ఇంతే అని అనుకోకూడదని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్నారని, మైనారిటీ గురుకులాల ఏర్పాటు అభినందనీయమన్నారు. షఫీ కూతురు తంజీలా ప్రసంగిస్తూ నీవు చెప్పదలుచుకున్న విషయం నిజమైతే ఎవరికి భయపడవల్సిన అవసరం లేదన్నారు. సదస్సులో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఆర్డీవో వినోద్‌కుమార్, నెడ్‌క్యాప్ చైర్మన్ అలీం, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు, మైనారిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
సాధ్వీమణులకు వందనం..
ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఏకాగ్రత, నిబద్ధత అవసరం.. అవి చేకూరాలంటే మానసిక ప్రశాంతత ఉండాలి.. అందుకు ఏకైక మార్గం ఆధ్యాత్మికత.. తమ ప్రవచనాలు, ప్రసంగాల ద్వారా ఎందరికో సాంత్వన చేకూర్చిన సాధ్వీమణులను ఓసారి స్మరించుకుందాం.. శ్రీ శారదా దేవి భారత మహిళా సాధువుల్లో అత్యంత ప్రముఖులు. రామకృష్ణ పరమహంస ధర్మపత్ని. 1858లో శారదామణి ముఖోపాధ్యాయ్గా జన్మించిన ఆమెకు ఐదేళ్ల ప్రాయంలో 23 ఏళ్ల రామకృష్ణ పరమహంసతో వివాహం జరిగింది. కౌమార దశలోకి ప్రవేశించగానే దక్షిణేశ్వర్‌లోని కాళీమాత గుడిలో పూజారిగా పనిచేసే భర్తను కలుసుకోవడానికి వేల మైళ్లు ప్రయాణించారు. భర్తను చేరుకునే సమయానికి ఆయన ఆధ్యాత్మిక యోగిగా మారారు. భార్యగా, భక్తురాలిగా, సహాయకురాలిగా పరమహంస సాహచర్యంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నారు. పరమహంస ఆమెను కాళీ మాత అవతారంగా, దైవ మూర్తిగా భావించి శారదాదేవిగా నామకరణం చేశారు. తమ ఆశ్రమానికి వచ్చే మహిళా భక్తుల్ని సాదరంగా ఆహ్వానించేవారు. వారికి ఆధ్యాత్మిక అంశాలు బోధించేవారు. భర్త దైవైక్యం పొందిన తర్వాత శిష్యులందరికీ గురువుగా మారారు. ఎంతో మంది భక్తులను పొందారు. శారదాదేవి గౌరవార్థం ఆమె భక్తుల్లో ఒకరు 1954లో శ్రీ శారదా మఠ్ రామకృష్ణ శారదా మిషన్ స్థాపించారు. దీని ద్వారా ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. భారత్, ఆస్ట్రేలియా దేశాల్లో శాఖలు కలిగి ఉంది. మైత్రేయి ప్రాచీన భారతదేశంలో అత్యంత మేధావిగా పేరుగాంచిన మహిళగా అనేక పురాణాల్లో మైత్రేయి ప్రస్తావన ఉంది. విద్యా వ్యాప్తికై ఆమె ఎంతగానో కృషి చేశారు. వైదిక భారతదేశంలో స్త్రీలకు కూడా విద్యావకాశాలు ఉన్నాయనడానికి నిదర్శనంగా నిలిచారు. భారతీయ మహిళా మేధావులకు దర్పణంగా నిలిచిన మైత్రేయి స్మారకార్థం ఢిల్లీలోని ఒక విద్యా సంస్థకి ఆమె పేరు పెట్టారు. భైరవీ బ్రాహ్మణి రామకృష్ణ పరమహంస 1861లో భైరవీ బ్రాహ్మణిని గురువుగా స్వీకరించారు. ఆమె ఎల్లప్పుడూ రామ, వైష్ణవ దేవతల ప్రతిమలను ప్రతిబింబించే ‘రఘువీర్ శిల’ను తన వెంట తీసుకువెళ్లేవారు. గౌడీయ వైష్ణవం, తంత్ర విద్యను ఆచరించేవారు. దైవత్వం పట్ల నమ్మకాన్ని, భక్తి శాస్త్రాలను బోధించారు. శక్తిని పూజించేందుకు కావాల్సిన తంత్ర విద్యను రామకృష్ణకు ఉపదేశించారు. 64 రకాల తంత్ర సాధనాలను కేవలం రెండేళ్లలో రామకృష్ణకు బోధించారు. రామకృష్ణ వీటిని పూర్తి స్థాయిలో ఆచరించేందుకు చిత్తశుద్ధి, నిగ్రహం పొందేందుకు మంత్ర, జప, పురస్కరణ వంటి సంస్కృతులు పాటించేవారు. సంప్రదాయ విరుద్ధమైన వామాచార ఆచారాన్ని(పూర్తిస్వేచ్ఛగా జీవించడం, మాంసాహారం భుజించడం, బ్రహ్మచర్యం వదలటం) కూడా రామకృష్ణకు బోధించారు. కానీ ఆయన ఈ ఆచారాన్ని పూర్తిస్థాయిలో ఆచరించలేదు. కుమారి పూజ, కుండలిని యోగ, యోగాసనాలు బోధించిన పరిపూర్ణ గురువుగా మన్ననలు అందుకున్నారు. అవ్వయ్యార్ తమిళంలో అవ్వయ్యార్ అంటే గౌరవనీయులైన మహిళ అని అర్థం. తమిళ సాహిత్యంలో ఈ పేరుతో సుమారు ముగ్గురు కవయిత్రులు ఉన్నారు. వారిలో ఒకరు 1 వ శతాబ్దంలో జీవించినట్లు, 59 పద్యాలు రచించినట్లు ఆధారాలు ఉన్నాయి. అవ్వయ్యార్-2 చోళ వంశ పాలనా సమయంలో(10వ శతాబ్దం) జీవించారు. రోజువారీ జీవితంలో చేయకూడని, చేయాల్సిన పనుల గురించి సామాన్య భాషలో పద్యాలు రచించారు. ఆమె రాసిన పద్యాలు నేటికీ తమిళ పాఠ్య పుస్తకాల్లో దర్శనమిస్తున్నాయి. తను ఎంతో ఙ్ఞాన సంపదను కలిగి ఉన్నానని, ఇక నేర్చుకోవాల్సిందేమీలేదని చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మారువేషంలో వచ్చిన మురుగన్ ఙ్ఞానసముపార్జన నిత్యప్రవాహం వంటిదని, నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆమెకు బోధ చేయడంతో మరలా విద్యాభ్యాసం ప్రారంభించిందని, చిన్నారుల కోసం పుస్తకాలు రాసిన మొదటి వ్యక్తిగా నిలిచిందని చరిత్ర చెబుతోంది. ఉభయ భారతి ఒకప్పటి మాహిష్మతి(మహిషి) రాజు మందన మిశ్రా భార్య. జైత్ర యాత్రలో భాగంగా ఒకరోజు ఆదిశంకరాచార్యుల వారు మాహిష్మతి రాజ్యానికి చేరుకున్నపుడు రాజుతో మేధో చర్చకు సిద్ధమవుతారు. ఈ చర్చలో విజేతను నిర్ణయించే బాధ్యతను రాజు భార్యకు అప్పగిస్తారు. చర్చలో ఓడితే రాజు సన్యాసం స్వీకరించాలనే షరుతు కూడా విధిస్తారు. వాదోపదవాదాలను, గణాంకాలను బేరీజు వేస్తూ శంకరాచార్యుల వారిని విజేతగా నిర్ణయిస్తుంది ఉభయ భారతి. షరతు ప్రకారం రాజు సన్యాసం స్వీకరిస్తారు. భర్త అడుగుజాడల్లో నడిచే భారతీయ స్త్రీ కనుక ఆమె కూడా సన్యాసం స్వీకరించి, ఇద్దరూ కలిసి ఙ్ఞాన మార్గాన్ని వ్యాప్తిచేస్తూంటారు. ఈ క్రమంలో ఆమె గంగా నది ఒడ్డున ఆశ్రమంలో శిష్యురాళ్లతో కలిసి జీవిస్తూ ఉంటారు. స్నానపానాదుల కోసం రోజూ గంగా నదికి వెళ్లే దారిలో బ్రహ్మఙ్ఞానిగా పిలువబడే సన్యాసి వారికి తారసపడతారు. అన్నింటినీ పరిత్యజించిన ఆ సాధువు ఒక మట్టికుండను మాత్రం ఎల్లప్పుడూ తన వద్దే పెట్టుకుని, ఒక దిండులాగా భావించి దానిపై నిద్రిస్తూ ఉంటారు. ఇది గమనించిన ఉభయ భారతి ‘నిజమైన సన్యాసులు దేనిని కూడా ఆస్తిగా, ప్రేమపూర్వకమైన దానిగా భావించరని’ తన శిష్యులకు చెబుతుండగా ఆ మాటలు విన్న సన్యాసి ఆగ్రహించి కుండను దూరంగా విసిరివేస్తారు. ‘నాడు ఆ కుండను మీ దగ్గర పెట్లుకుని అభిమానం పెంచుకున్నారు. నేడేమో అహంకారంతో దానిని పగులగొట్టారు’ అన్న ఉభయ భారతి మాటలు ఆయనకు కనువిప్పు కలిగిస్తాయి. ఈ విధంగా ప్రతిఒక్కరినీ ఙ్ఞాన మార్గాన్ని బోధిస్తూ తన జీవితాన్నిసంఘసంస్కరణకు అంకితం చేశారు ఉభయ భారతి. శ్రీ ఆండాళ్ వైష్ణవ మతాన్ని ఆచరించిన 12 మంది అళ్వార్లలో ఏకైక మహిళా అళ్వార్. 8వ శతాబ్దానికి చెందిన వారు. పెరుమాళ్(విష్ణుమూర్తి)ని స్తుతిస్తూ పదిహేనేళ్ల ప్రాయంలో ‘తిరుప్పావై’(తమిళం) రచించారు. ఇందులో గల 30 చరణాలను పసురామాలు అంటారు. వైష్ణవ మతాన్ని ఆచరించే అళ్వార్లు సంకలనం చేసిన ‘దివ్య ప్రబందం’లోని అంతర్భాగాలుగా వీటిని పేర్కొంటారు. పెరియళ్వార్గా పిలువబడే విష్ణుచిత్త అనే సాధువు తులసి మొక్క కింద కనిపించిన పసిపాపను చేరదీసి, కొదాయి(గోదా)గా నామకరణం చేశారు. పెరిగి పెద్దవుతున్న కొద్దీ భగవంతుని పట్ల ఆమెకున్న అచంచలమైన భక్తి, ఆరాధనా భావం వలన భగవంతుడినే తన భర్తగా భావించి ఊహాలోకంలో విహరించేవారు. విష్ణుమూర్తి విగ్రహానికి అలంకరించే పూలమాలను తాను ముందుగా ధరించేవారు. ఇది గమనించిన ఆమె తండ్రి విష్ణుచిత్త ఆగ్రహించారు. అతని కలలో విష్ణుమూర్తి కనిపించి, తాను గోదా చేస్తున్న పనిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్లు చెప్పడంతో నాటి నుంచి గోదా, ఆండాళ్,-దేవున్ని పాలించే బాలికగా పేరుపొందారు. కొంతమంది భక్తులు ఆమెను ‘సూది కొడుత సుదర్కోడి’గా పిలుచుకుంటారు. గోదా వివాహం రంగనాథ స్వామితో జరిపించేందుకు విష్ణుచిత్త ఆమెను శ్రీరంగం గుడికి తీసుకువెళ్లగా గర్భగుడిలోకి ప్రవేశించిన ఆమె దేవునిలో ఐక్యమైపోయింది. మీరా బాయి కృష్ణ భక్తురాలుగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి మీరాబాయి. రాజస్థాన్‌లోని కుడ్కి జిల్లాలో జన్మించారు.16వ శతాబ్దానికి చెందినవారు. మీరాబాయి రాజపూత్ వంశానికి చెందినవారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా శ్రీ కృష్ణుడిని తన భర్తగా పూజించడంతో అత్తారింటివారు ఆమెను పీడించినట్లుగా కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. భక్తి ఉద్యమంలో పాల్గొన్నారు. అక్క మహాదేవి 12వ శతాబ్దంలో సాగిన వీరశైవ భక్తి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తుల్లో ముఖ్యులు. కన్నడ భాషలో 430కి పైగా వచన పద్యాలు రచించారు. మంత్రోగోప్య, యోగత్రివిధి రచనలు కన్నడ సాహిత్యంలో ఆమెకు ఉన్నత స్థానం కల్పించాయి. వీరశైవ ప్రచారకులు బసవన్న, సిద్ధారామ, అల్లమప్రభు భక్తి ఉద్యమంలో మహాదేవి కృషికి గౌరవసూచకంగా ఆమెను ‘అక్క’ అని పిలిచేవారు. చెన్న మల్లికార్జుడిని(శివుడు) ఆమె భర్తగా భావించేవారు. శ్రీ దయామాత అమెరికాలోని ఊథా నగరంలో 1914లో జన్మించిన చెందిన రాచెల్ ఫాయె రైట్ తన 17వ ఏట భారత ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానందను కలుసుకున్నారు. పరిపూర్ణమైన ప్రేమ గురించి, జీవిత సత్యాల గురించి యోగానంద చేసిన ప్రసంగాలు ఆమెను ప్రభావితం చేశాయి. యోగానంద తన మొదటి శిష్యురాలిగా స్వీకరించారు. ‘దయా మాత’గా నామకరణం చేశారు. యోగానంద మరణానికి ముందు తన వారసత్వాన్ని కొనసాగించాల్సిందిగా ఆమెను కోరారు. అతికొద్ది మంది మహిళా ఆధ్యాత్మికవేత్తలు ఉన్న సమయంలో యోగానంద వారసత్వాన్ని కొనసాగించే బాధ్యతను స్వీకరించారు. మహిళాఅనుచర గణాన్ని సంపాదించుకున్నారు. 1955లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ సంస్థ ప్రస్తుతం సుమారు 60 దేశాల్లో కేంద్రాలు కలిగి ఉంది. తన శిష్యులకు కర్మ యోగాను బోధించారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగాను ప్రవేశపెట్టి, ప్రాచుర్యం కల్పించారు. సంపన్న కుటుంబంలో జన్మించిన మాతాజీ బాల్యం నుంచే గాంధీ ఆశ్రమాన్ని సందర్శించేవారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లారు. 1947లో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సంస్కృతి, సాంప్రదాయాలు, జాతీయత, నైతిక విలువల పట్ల యువతకు అవగాహన కల్పించేవారు. 1970లో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘నిన్ను నడిపించే శక్తి ఏదో నీవు కనుగొనాలంటే ధ్యాన సాధన చేయాల’ని బోధించేవారు. ఈవిధమైన ధ్యాన ప్రక్రియకు సహజ యోగాగా నామకరణం చేశారు. ఈ ప్రక్రియకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించారు. ఈ క్రమంలోనే నిర్మలా శ్రీ వాస్తవను ఆమె అనుచరులు మాతాజీ నిర్మలాదేవిగా పిలిచేవారు. 90వ దశకంలో అంతర్జాతీయ సహజ యోగా ఆరోగ్య, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిరాశ్రయులైన మహిళలకు ఆశ్రయం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పారు. అనేక పాఠశాలలు, అంతర్జాతీయ సంగీత, కళా అకాడమీని స్థాపించారు. మా నిత్యా స్వరూప ప్రియానంద ఈమె అసలు పేరు సుదేవి. కెనడాకు చెందిన సుదేవి 2010లో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ‘ఫ్రీ యువర్సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ అగైనెస్ట్ ఎన్లైటెన్మెంట్’ పేరుతో వీడియోలు పోస్ట్ చేసేవారు. తన ఛానెల్లో ముఖ్యంగా హిందుత్వ, మార్మికత, శాకాహార, ఙ్ఞానోదయ, భూలోకేతర అంశాల గురించి చర్చించేవారు. 2011లో తాను భూలోకేతర మూలాలు కలిగిన వ్యక్తినని ప్రకటిస్తూ ఒక వీడియో పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు. దాదాపు 40 వేల మంది అనుచరగణాన్ని సంపాదించారు. 2015లో నిత్యానంద ఆశ్రమంలో చేరి స్వరూపాప్రియానందగా మారారు. ‘లివింగ్ అద్వైత’ అనే టీవీ షోకి హోస్ట్‌గా వ్యవహరించారు. జంతు ప్రేమికురాలైన మాతాజీ, వాటి హక్కుల కోసం పోరాడుతున్నారు. శ్రీ ఆనందమయి మా బెంగాల్‌కు చెందిన వారు. హిందూ ఆధ్యాత్మిక గురువు. 20 శతాబ్దానికి చెందిన తత్త్వవేత్తగా, సాధ్విగా గుర్తింపు పొందారు. వేలాది మంది అనుచరులను సంపాదించుకున్నారు. వారందరూ ఆమెను ఒక గురువుగా, దేవుని ప్రతిరూపంగా, దేవీ మాతగా కొలిచేవారు. సాధ్వి రితంభరా జీ(దీదీ మా) పంజాబ్‌కు చెందిన రితంభరా జీ సమకాలీన భారతీయ ఆధ్యాత్మికవేత్తల్లో ప్రముఖులు. హిందూ మత ప్రచారకులు. మానవతావాది. సామాజిక వేత్త. విశ్వహిందూ పరిషత్,ఆర్ఎస్ఎస్ సభ్యులుగా ఉన్నారు. ‘దుర్గా వాహిని’ సేన చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘వాత్సల్యగ్రామ్’ అనే సంస్థను స్థాపించి అనాథలు, వృద్ధులు, వితంతువులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆప్యాయంగా అమ్మలా ఆదరించే గుణం కలిగిన ఆమెను అనుచరగణం ‘దీదీ మా’ అని పిలుస్తారు. ఆనందమూర్తి గురూ మా నవతరం ఆధ్మాత్మికవేత్త. క్రిస్టియన్లు, హిందువులు, సిక్కులు,యూదులు, ముస్లింలు, బౌద్ధులు ఇలా మతాలకతీతంగా ఆమెకు అనుచరులు ఉన్నారు. ఆమె ప్రవచనాలకు లింగ, వర్గ, మత, రాజకీయ, భౌగోళిక హద్దులంటూ ఏమీలేవు. జైనిజం, బుద్ధిజం, కళలు, ఉపనిషత్తులు, యోగాలలో ప్రావీణ్యం కలవారు. ప్రతీ అంశాన్ని హేతుబద్ధంగా, శాస్త్రీయతను జోడించి తర్కించగల ఙ్ఞాననిధి. బాలికా విద్యను ప్రోత్సహించడానికి, భ్రూణహత్యలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడానికి ‘శకి’్త అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అన్ని వర్గాల పేద విద్యార్థినులకు విద్యా అవకాశం కల్పించడంతో పాటు, ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. బ్రహ్మకుమారి భారతీయ మూలాలతో ప్రారంభమై ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘బ్రహ్మకుమారీస్’ అనే ఆధ్యాత్మిక సంస్థను స్థాపించారు. బ్రహ్మకుమారీలు శివుడిని గురువుగా భావిస్తారు. సామాజిక సేవను బాధ్యతగా స్వీకరించి జీవితాంతం సేవకే అంకితం అవుతారు. ఈ సంస్థ ద్వారా భారతీయ సంప్రదాయ, సంస్కృతులతో పాటు ధ్యానం, రాజయోగా వంటి ఆధ్మాత్మిక భావనలు ప్రచారం చేస్తున్నారు. రాణి హేమలేఖ ఒక గురువుగా భర్త హేమచూడ, అత్త ఇలా ఎంతో మందిని తన ఙ్ఞాన సంపద ద్వారా అభ్యుదయ మార్గంలోకి నడిపించారు. ఆమె ప్రవచనా ప్రభావం ఎంతగా ఉండేదంటే.... ఒకానొక సమయంలో రాజ్యమంతా బ్రహ్మ ఙ్ఞానులుగా మారారట. వారి రాజ్యంలోని చిలకలు కూడా ఆమె ప్రవచనా వల్లెవేసేవట. ఈ విషయాలు ‘త్రిపుర రహస్యం’లో పేర్కొనబడినాయి. రాణి చూడల యోగ వశిష్ఠ గ్రంథంలో ఈమె గురించి పేర్కొనబడింది. మేధావుల నుంచి ఆర్జించిన ఙ్ఞానాన్ని తన భర్త రాజా సిఖిధ్వజ్కు బోధించడం ద్వారా గురువుగా మారారు. - సుష్మారెడ్డి యాళ్ళ -
శ్రీలక్ష్మి ఏం చేసిందో తెలుసా?
‘మనం ఎప్పుడు కలుద్దాం, మీ రేటు ఎంత, రూ. 3000కు వస్తావా, హోటల్ గది బుక్ చేయమంటారా’.... కేరళ మహిళ శ్రీలక్ష్మి సతీశ్ కు వచ్చిన ఫోన్లలో వినిపించిన మాటలు ఇవి. విద్యా సంస్థ కన్సల్టెన్సీ సీఈవో, మోటివేషనల్ స్పీకర్ గా పనిచేస్తున్న ఆమెకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారు. ఒకడైతే రూ. 25000 ఇస్తానని వాగాడు. ఇవన్నీ భరించలేక ఆమె సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు తనకు ఫోన్ చేసిన వారికి ఆమె మళ్లీ ఫోన్ చేశారు. తన నంబర్ ఉన్న వాట్సాప్ గ్రూప్ తో జరిపిన సంభాషణ స్ర్కీన్ షాట్లను ఆమె సంపాదించారు. దీని ఆధారంగా తన ఫోన్ నంబర్ ను దుర్వినియోగం చేసిన వ్యక్తిని గుర్తించారు. నిందితుడు ఒక జాతీయ పార్టీ యువజన విభాగంలో ప్రాంతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో పార్టీ నాయకులు రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని కోర్టు బయటే రాజీ చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు శ్రీలక్ష్మి పలు షరతులు విధించారు. తన ఫోన్ నంబర్ ను దుర్వినియోగం చేసిన వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించాలని, దీనికి సంబంధించిన సమావేశం వివరాలు తనకు అందించాలని నిష్కర్షగా చెప్పారు. గురువారం రాత్రి 8 గంటలకు సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో నిందితుడి తండ్రి శ్రీలక్ష్మి వద్దకు వచ్చి తన కొడుకును క్షమించాలని, కేసు పెట్టొద్దని వేడుకున్నాడు. తాను చెప్పినట్టుగా చేస్తే కేసు పెట్టనని చెప్పడంతో ఆయనకు ప్రాణం లేచొచ్చింది. నిందితుడు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు కూ. 25000 విరాళం ఇవ్వాలని, దీనికి సంబంధించిన రసీదు తనకు అందజేయాలని అన్నారు. శ్రీలక్ష్మి చెప్పినట్టుగానే చేసి రసీదు ఆమెకు ఇచ్చారు. తన కోపం చల్లారకపోవడంతో ఈ వ్యవహారం గురించి తన ఫేస్ బుక్ పేజీలో వివరంగా రాశారు. దీనికి 1317 షేర్లు, 1200 కామెంట్లు, 4500 లైకులు వచ్చాయి. తనను అవమానించిన వాడికి తగిన గుణపాఠం చెప్పారని శ్రీలక్ష్మిని అందరూ ప్రశంసించారు. అయితే ఇదంతా తాను ప్రచారం కోసం చేయలేదని ‘మలయాళం మనోరమ’తో శ్రీలక్ష్మి చెప్పారు. -
అంగవైకల్యం ఉన్నా ఆత్మస్థైర్యంతో ముందుకు
హైదరాబాద్: అంగ వైకల్యం ఉన్నా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగవచ్చని అమెరికన్ మోటివేషనల్ స్పీకర్ జాన్ ఫొప్పీ అన్నారు. మాదాపూర్ ట్రైడెంట్ హోటల్లో శనివారం నిర్వహించిన మోటివేషన్ సెమినార్లో ఆయన ప్రసంగించారు. అంగవైకల్యం ఉన్నంత మాత్రాన నిరాశ, నిస్పృహలకు లోనుకావాల్సిన అవసరం లేదన్నారు. పుట్టుకతోనే రెండు చేతులూ లేకపోయినా... కరెన్సీ లెక్కపెట్టడం, డ్రెస్ వేసుకోవడం, రాయడం, టైపింగ్ వంటి వాటితో పాటు డ్రైవింగ్ కూడా తానే చేస్తున్నట్లు తెలిపారు. తన అంగవైకల్యం గురించి ఎప్పుడూ బాధ పడలేదన్నారు. అయితే ఆరేళ్ల క్రితం తనకు పాప పుట్టిన సమయంలో ఆమెను ఎత్తుకోలేకపోయినప్పుడు కొద్దిగా కలత చెందానని వెల్లడించారు.