ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ వివేక్ బింద్రాపై కేసు నమోదైంది. పెళ్లైన కొన్ని గంటలకే భార్యను వేధింపులకు గురిచేయడంతో పోలీసులు వివేక్ బింద్రాపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు.
వివరాలు.. వివేక్ బింద్రాకు యానిక అనే మహిళతో డిసెంబర్ 6న వివాహం జరిగింది. వీరు నోయిడాలోని సెక్టర్ 94 సూపర్ నోవా రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. డిసెంబర్ 7 తెల్లవారుజామున, బింద్రా అతని తల్లి ప్రభ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవను ఆపేందుకు ఆయన భార్య యానికా ప్రయత్నించడంతో బింద్రా ఆమెపై దాడికి దిగాడు. యానిక శరీరంపై పలుచోట్ల గాయాలు కాగా ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది.
ఈ విషయంపై బాధితురాలు సోదరుడు వైభవ్ క్వాత్రా నోయిడాలోని సెక్టర్ 126 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేగాక వివాహం జరిగిన కొన్ని గంటలకే, బింద్రా యానికను ఒక గదిలోకి తీసుకెళ్లి, ఆమెపై అసభ్యపదజాలంతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె జుట్టును లాగి, దాడి చేసినట్లు తెలిపారు. యానికా చెవికి గాయం అవ్వడంతో వినికిడి సమస్య ఏర్పడినట్లు వెల్లడించారు. బింద్రా ఆమె ఫోన్‌ను కూడా పగలగొట్టినట్లు చెప్పారు.
దీనిపై నోయిడా పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం బింద్రా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక దేశంతో పేరు ప్రఖ్యాతలు సాధించినమోటివేషనల్ స్పీకర్ వివేక్ బింద్రా.. బడా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీబీపీఎల్) సీఈవో కూడా. అతనికి యూట్యూబ్, ఇన్‌స్టాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.
చదవండి: వికటించిన క్రిస్మస్ డిన్నర్.. 700 మందికి అస్వస్థత
Comments
Please login to add a commentAdd a comment