అంగవైకల్యం ఉన్నా ఆత్మస్థైర్యంతో ముందుకు
హైదరాబాద్: అంగ వైకల్యం ఉన్నా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగవచ్చని అమెరికన్ మోటివేషనల్ స్పీకర్ జాన్ ఫొప్పీ అన్నారు. మాదాపూర్ ట్రైడెంట్ హోటల్‌లో శనివారం నిర్వహించిన మోటివేషన్ సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. అంగవైకల్యం ఉన్నంత మాత్రాన నిరాశ, నిస్పృహలకు లోనుకావాల్సిన అవసరం లేదన్నారు.
పుట్టుకతోనే రెండు చేతులూ లేకపోయినా... కరెన్సీ లెక్కపెట్టడం, డ్రెస్ వేసుకోవడం, రాయడం, టైపింగ్ వంటి వాటితో పాటు డ్రైవింగ్ కూడా తానే చేస్తున్నట్లు తెలిపారు. తన అంగవైకల్యం గురించి ఎప్పుడూ బాధ పడలేదన్నారు. అయితే ఆరేళ్ల క్రితం తనకు పాప పుట్టిన సమయంలో ఆమెను ఎత్తుకోలేకపోయినప్పుడు కొద్దిగా కలత చెందానని వెల్లడించారు.